# Assessment, Evaluation types, Tools of assessment, CCE

- Link: https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/
- Published: 2026-09-20T07:48:49+05:30
- Author: MAHENDRA MANCHIKALAPATI

## మదింపు, మూల్యాంకనం, మూల్యాంకన సాధనాలు మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)

## Table of Contents

 * [మదింపు, మూల్యాంకనం, మూల్యాంకన సాధనాలు మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/#cce)
 * [1. మదింపు మరియు మూల్యాంకనం – భావనలు (Concepts of Assessment & Evaluation)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/#1-concepts-of-assessment-amp-evaluation)
 * [2. మదింపు మరియు మూల్యాంకనం మధ్య వ్యత్యాసాలు (Comparison between Assessment & Evaluation)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/#2-comparison-between-assessment-amp-evaluation)
 * [3. అభ్యసన మదింపు రూపాలు / రకాలు (Types / Dimensions of Assessment)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/#3-types-dimensions-of-assessment)
 * [4. నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE – Continuous Comprehensive Evaluation)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/#4-cce-continuous-comprehensive-evaluation)
 * [5. మూల్యాంకన సాధనాలు మరియు వ్యూహాలు (Tools & Strategies of Assessment)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/#5-tools-amp-strategies-of-assessment)
 * [ముగింపు (Conclusion)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/#conclusion)
 * [Practice Time](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/#practice-time)
 * [Related Pages](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/assessment-evaluation-types-tools-of-assessment-cce/#related-pages)

విద్యా ప్రక్రియలో బోధనా-అభ్యసన లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకోవడానికి, 
విద్యార్థుల ప్రగతిని నిరంతరం పరిశీలించడానికి మదింపు మరియు మూల్యాంకనాలు అత్యంత కీలకమైన
అంశాలు. 

**బెంజిమన్ బ్లూమ్** అభిప్రాయం ప్రకారం:

> _విద్యా ప్రక్రియలో బోధనా లక్ష్యాలు, బోధనా-అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం అనేవి పరస్పర
> ఆధారితాలు_.

**కొఠారి కమిషన్** పేర్కొన్నట్లు — 

> _“మూల్యాంకనం అనేది విద్యలో ఒక భాగమే కనుక ఇది కూడా విద్య వలే నిరంతర ప్రక్రియ. ఇది
> విద్యా వ్యవస్థలో అంతర్భాగమై లక్ష్యసాధనతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది విద్యార్థులపై,
> ఉపాధ్యాయుల బోధనా పద్ధతులపై ప్రభావం చూపి విద్యా లక్ష్యాలు సాధించబడిందీ లేనిదీ తెలుపడమే
> కాక, వాటి అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది”_.

---

### 1. మదింపు మరియు మూల్యాంకనం – భావనలు (Concepts of Assessment & Evaluation)

 * **మూల్యాంకనం (Evaluation):** మూల్యాంకనం అనేది ఒక అంతిమ తీర్పును/నిర్ణయాన్ని ప్రకటించే
   పద్ధతి (Judgement). నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అనుసరించిన బోధనా-అభ్యసన
   ప్రక్రియలు ఎంతవరకు ఉపయోగపడ్డాయి, బోధన ఫలవంతమైందా లేదా అని విశ్లేషించడానికి ఇది
   ఉపయోగపడుతుంది. మూల్యాంకనం అనేది ప్రధానంగా అభ్యసన ప్రక్రియ ముగిసిన తర్వాత లభించే**
   ఫలితానికి (Product)** ప్రాధాన్యత ఇస్తుంది.
 * **మదింపు (Assessment):** పిల్లల ప్రగతిని, సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే
   వివిధ రకాల కార్యకలాపాలు, పనులు మరియు ప్రక్రియలన్నింటినీ మదింపు అంటారు. తరగతి 
   గది అభ్యసన సన్నివేశాలలో పాల్గొనడం ద్వారా పిల్లలు నేర్చుకునే క్రమాన్ని, వారిలోని
   చైతన్యాన్ని పరిశీలించే నిరంతర ప్రక్రియ ఇది. మదింపు అనేది అంతిమ ఫలితానికి మాత్రమే
   కాకుండా, అభ్యసనం సాగుతున్న **విధానానికి/ప్రక్రియకు (Process)** ప్రాధాన్యత ఇస్తుంది.

---

### 2. మదింపు మరియు మూల్యాంకనం మధ్య వ్యత్యాసాలు (Comparison between Assessment & Evaluation)

పాఠశాల విద్యలో మదింపు మరియు మూల్యాంకనాల మధ్య ఉన్న మౌలిక వ్యత్యాసాలను క్రింది పట్టిక
ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు:

| మూల్యాంకన అంశం | మదింపు (Assessment) | మూల్యాంకనం (Evaluation) | 
| **కేంద్ర బిందువు** | బోధనా-అభ్యసన ప్రక్రియను నిరంతరం పరిశీలిస్తుంది. | ప్రక్రియ ద్వారా లభించే అంతిమ ఫలితాలతో సంబంధం కలిగి ఉంటుంది. | 
| **నమ్యత/సవరణ** | సందర్భానుసారంగా మార్పులు చేయడానికి సరళత, నమ్యత కలిగి ఉంటుంది. | స్థిరంగా ఉండి, అభ్యసన ఫలితాలపై అంతిమ తీర్పునిస్తుంది. | 
| **పరిస్థితి/వాతావరణం** | పరీక్ష అనే ఆలోచన, భయం విద్యార్థులకు కలగని రీతిలో సాగుతుంది. | పరీక్ష, గ్రేడింగ్ అనే ఒత్తిడికి/భయానికి అవకాశం ఉంటుంది. | 
| **విద్యార్థి ప్రగతి** | పిల్లలు తమ ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధికి కృషి చేస్తారు. | ఫలితాలు వెల్లడైన తర్వాత విద్యార్థులు తదుపరి తరగతుల ప్రవేశానికి అర్హత పొందుతారు. | 
| **వినియోగ పరిధి** | ఫలితాలు పాఠశాల సంస్థలో అంతర్గతంగా సమీక్షించబడతాయి. | ఫలితాలు సమాజానికి, తల్లిదండ్రులకు తెలపడానికి ఉపయోగపడతాయి. | 
| **స్వభావం** | నిరంతర సమగ్ర మూల్యాంకనానికి (CCE) సహకరించే ప్రక్రియ. | పరీక్షలు, ఫలితాలు, సమీక్షలతో కూడిన వ్యవస్థ. |

---

### 3. అభ్యసన మదింపు రూపాలు / రకాలు (Types / Dimensions of Assessment)

బోధనా-అభ్యసన ప్రక్రియలో మదింపును మూడు ప్రధాన రూపాలుగా వర్గీకరించవచ్చు:

 1. **అభ్యసనంతోపాటు మదింపు (Assessment as learning):** విద్యార్థుల సామర్థ్యాల సాధనను
    విడిగా మదింపు చేయకుండా రోజువారీ బోధనా-అభ్యసన ప్రక్రియల్లో భాగంగానే నిర్వహించడం.
    దీనివల్ల మదింపు అనేది అభ్యసనానికి సహకరించే అంశంగా మారుతుంది. ఇందు విద్యార్థులు 
    తమను తాము స్వయం మదింపు (Self-assessment) చేసుకోవడానికి మరియు తోటి సమవయస్కులు మదింపు(
    Peer-assessment) చేయడానికి అవకాశం లభిస్తుంది.
 2. **అభ్యసనం కొరకు మదింపు (Assessment for learning):** ఇది బోధనా-అభ్యసన ప్రక్రియలో
    అత్యంత ముఖ్యమైన భాగం. ఇందులో ఉపాధ్యాయుడు మరియు పిల్లలు ఒకరికొకరు ప్రతిస్పందించుకుంటూ,
    చర్చించుకుంటూ అభ్యసనాన్ని మెరుగుపరుచుకుంటారు. తరగతి గదిలో ప్రతీరోజు జరిగే ఈ ప్రక్రియ
    యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థుల అభ్యసన లోపాలను లేదా ఇబ్బందులను గుర్తించి వెంటనే
    సరిదిద్దడం (Diagnostic and Remedial).
 3. **అభ్యసనం యొక్క మదింపు (Assessment of learning):** పిల్లలు వివిధ విషయాలను ఎంతవరకు
    నేర్చుకున్నారో కొంతకాలం తర్వాత పరీక్షించడాన్ని అభ్యసనం యొక్క మదింపు అంటారు. ఇది
    విద్యార్థులు పొందిన జ్ఞానాన్ని మార్కులు, గ్రేడ్ల రూపంలో ప్రదర్శిస్తుంది. ఇది ఉపాధ్యాయులు
    లేదా బాహ్య నికషల ద్వారా నిర్ణీత కాలాంతరంలో (టర్మ్/వార్షిక) నిర్వహించబడుతుంది.

---

### 4. నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE – Continuous Comprehensive Evaluation)

పాఠశాల విద్యా వ్యవస్థలో సాంప్రదాయ పరీక్షల భయాన్ని తొలగించి, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిని
అంచనా వేయడానికి **నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)** ఆవిర్భవించింది.

 * **భావన:** CCE లో **నిరంతర**, **సమగ్ర**, **మూల్యాంకనం** అనే మూడు పదాలు ఉన్నాయి.
   అనగా కేవలం పాఠ్యాంశ విషయాలనే (Languages, Maths, Science, Social) కాకుండా సహపాఠ్యాంశ
   అంశాలైన కళలు, పని విద్యా విలువలు, ఆరోగ్యం, క్రీడలు, జీవన నైపుణ్యాలు మరియు పిల్లల
   వైఖరులు, అభిరుచులను పరిగణనలోకి తీసుకుని విద్యా సంవత్సరం పొడవునా మూల్యాంకనం చేయడం.
 * **CCE లోని రెండు ప్రధాన మదింపు విధానాలు:** 
   నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) మరియు
   బోధనా-అభ్యసన ప్రక్రియలో విద్యార్థుల అభ్యసన పురోగతిని, సాధనలను అంచనా వేయడానికి**
   నిర్మాణాత్మక మదింపు (Formative Assessment – FA)** మరియు **సంగ్రహణాత్మక / సంకలన
   మదింపు (Summative Assessment – SA)** అనే రెండు ప్రధాన విధానాలు ఉపయోగించబడతాయి.**
   1. నిర్మాణాత్మక మదింపు (Formative Assessment – FA)నిర్మాణాత్మక మదింపు అనేది బోధనా-
   అభ్యసన ప్రక్రియ సాగుతున్న సమయంలోనే, భావనలు ఏర్పడుతున్న దశలోనే నిరంతరం జరిగే మదింపు
   విధానం. దీనిని “అభ్యసనం కొరకు మదింపు” (Assessment for Learning) అని కూడా అంటారు.
   ప్రధాన ఉద్దేశం: విద్యార్థుల అభ్యసన లోపాలను లేదా ఇబ్బందులను వెంటనే గుర్తించి (
   Diagnostic), వాటిని నివారించడానికి సవరణాత్మక బోధన (Remedial Teaching) అందించడం
   మరియు అభ్యసనాన్ని వేగవంతం చేయడం.కీలక లక్షణాలు:నిరంతర పరిపుష్టి (Feedback): అభ్యసన
   పురోగతిపై ఉపాధ్యాయునికి, విద్యార్థికి నిరంతరం ఫీడ్‌బ్యాక్ అందిస్తుంది.ప్రక్రియా
   కేంద్రీకృతం: అంతిమ మార్కుల కంటే అభ్యసనం జరుగుతున్న ‘ప్రక్రియ’ (Process) కి ప్రాధాన్యత
   ఇస్తుంది.నమ్యత మరియు సరళత (Flexibility): ఇది ఉపాధ్యాయునిచే నిర్ణయించబడి, తరగతి
   సన్నివేశాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి నమ్యత కలిగి ఉంటుంది.భయరహిత వాతావరణం:
   పరీక్ష అనే భయం విద్యార్థులకు కలగకుండా, అభ్యసనంలో భాగంగా సృజనాత్మకంగా, నిరంతరంగా
   జరుగుతుంది.పరస్పర చర్యలు: విద్యార్థుల మధ్య చర్చలు, స్వీయ మదింపు (Self-assessment),
   సమవయస్కుల మదింపు (Peer-assessment) మరియు ప్రతిస్పందనలకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
   సూక్ష్మస్థాయి పరిశీలన: ప్రతి విద్యార్థిని, అన్ని అంశాలను సూక్ష్మస్థాయిలో పరిశీలించే
   అవకాశం ఉంటుంది.నిర్మాణాత్మక మదింపు సాధనాలు/అంశాలు:Tool -1 : పిల్లల భాగస్వామ్యం&
   స్పందనలు (Classroom Interaction & Participation)Tool -2 : రాత పనులు / నోటు పుస్తకాలు(
   Written Work / Note Books)Tool -3 : ప్రాజెక్టు పనులు (Projects)Tool -4 :లఘు నికషలు/
   స్లిప్ టెస్టులు (Slip Tests)2. సంగ్రహణాత్మక / సంకలన మదింపు (Summative Assessment–
   SA)సంగ్రహణాత్మక మదింపు అనేది ఒక నిర్దిష్ట బోధనా కాలవ్యవధి లేదా యూనిట్/టర్మ్/సంవత్సరం
   ముగిసిన తర్వాత విద్యార్థులు బోధనా లక్ష్యాలను ఏ మేరకు సాధించారో అంచనా వేయడానికి
   నిర్వహించే మదింపు. దీనిని “అభ్యసనం యొక్క మదింపు” (Assessment of Learning) అంటారు.
   ప్రధాన ఉద్దేశం: విద్యార్థులు సాధించిన విషయ పరిజ్ఞానాన్ని, సామర్థ్యాలను కొలిచి
   అంతిమ గ్రేడింగ్ లేదా ఉత్తీర్ణతను నిర్ణయించడం.కీలక లక్షణాలు:ఫలిత కేంద్రీకృతం: 
   ప్రక్రియ కంటే అంతిమంగా వచ్చిన ‘ఫలితాలు / ఉత్పత్తుల’ (Product) ఆధారంగా తీర్పు (
   Judgement) నిస్తుంది.నిర్దిష్ట షెడ్యూల్: ఒక నిర్దిష్ట టైమ్‌టేబుల్ ప్రకారమే ప్రత్యేకంగా
   రాత మరియు మౌఖిక పరీక్షల (Paper-Pencil Tests) రూపంలో నిర్వహించబడుతుంది.పోటీతత్వం&
   ప్రమాణాలు: విద్యార్థి స్థాయిని జిల్లా, రాష్ట్ర లేదా జాతీయ స్థాయి ప్రమాణాలతో పోల్చడానికి
   మరియు పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.పరిమిత పరస్పర చర్యలు: పరీక్ష
   సమయంలో విద్యార్థుల మధ్య పరస్పర చర్యలకు లేదా తక్షణ సవరణలకు అవకాశం తక్కువగా ఉంటుంది.
   సంగ్రహణాత్మక మదింపు సాధనాలు: వ్రాత పరీక్షలు (Paper-Pencil Tests), మౌఖిక పరీక్షలు
   మరియు వార్షిక/టర్మ్ పరీక్షలు.

> Please utilise this [CCE Marks Calculator](https://thecuriosi.com/digital-tlm-for-maths-1-5/all-in-one-education-tools/cce-marks-calculator/)
> to evaluate grades efficiently.

**నిర్మాణాత్మక vs సంగ్రహణాత్మక మదింపు – పోలికల పట్టిక**

| **మూల్యాంకన అంశం** | **నిర్మాణాత్మక మదింపు (Formative Assessment – FA)** | **సంగ్రహణాత్మక మదింపు (Summative Assessment – SA)** | 
| **సమయం / సందర్భం** | బోధనా-అభ్యసన క్రమంలో, భావనలు ఏర్పడుతున్న దశలోనే జరుగుతుంది. | బోధనా ప్రక్రియ ముగిసిన అనంతరం లేదా నిర్దిష్ట కాలాంతరంలో జరుగుతుంది. | 
| **లక్ష్యం** | అభ్యసన లోపాలను గుర్తించి మెరుగుపరచడం (Diagnostic & Remedial). | సాధించిన జ్ఞానాన్ని అంచనా వేసి ఉత్తీర్ణత/గ్రేడింగ్ నిర్ణయించడం. | 
| **స్వభావం** | నమ్యత, సరళత ఉండి, అభ్యసనంలో ఒక అంతర్గత భాగంగా సాగుతుంది. | స్థిరమైన షెడ్యూల్‌తో బాహ్య నికషలుగా/పరీక్షలుగా నిర్వహించబడుతుంది. | 
| **పరిపుష్తి (Feedback)** | ఉపాధ్యాయునికి, విద్యార్థికి నిరంతరం తక్షణ ఫీడ్‌బ్యాక్ లభిస్తుంది. | బోధన పూర్తయిన తర్వాత అంతిమ ఫలితాల రూపంలో లభిస్తుంది. | 
| **పరిధి** | ప్రాథమికంగా తరగతి గది మరియు పాఠశాల అంతర్గత పరిధికి పరిమితం. | విశాల ప్రతిపాదిక ఉండి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోల్చడానికి ఉపయోగపడుతుంది. |

---

### 5. మూల్యాంకన సాధనాలు మరియు వ్యూహాలు (Tools & Strategies of Assessment)

నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపులను సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపాధ్యాయులు
వివిధ రకాల సాధనాలను వాడతారు:

 * **ఉపాధ్యాయుని పరిశీలన / టీచర్ డైరీ (Teacher Diary):** బోధనా-అభ్యసన ప్రక్రియలో
   విద్యార్థుల స్పందనలను, ప్రత్యేక ప్రతిభను, అవగాహనా లోపాలను ఉపాధ్యాయుడు పరిశీలించి
   తన డైరీలో నమోదు చేయడం ద్వారా మదింపు చేస్తాడు.
 * **ప్రశ్నావళులు (Questionnaires):** విద్యార్థుల విషయ పరిజ్ఞానంతో పాటు వారి ఆలోచనా
   నైపుణ్యాలు, అభిరుచులు, వైఖరులు మరియు ప్రజ్ఞా స్థాయిలను అంచనా వేయడానికి ప్రశ్నావళులు
   తోడ్పడతాయి.
 * **చెక్‌లిస్టులు (Checklists):** విద్యార్థిలో ఒక నిర్దిష్ట సామర్థ్యం, నైపుణ్యం
   లేదా ప్రవర్తనా లక్షణం ఉందో లేదో (‘అవును’ లేదా ‘కాదు’ రూపంలో) త్వరగా గుర్తించడానికి
   చెక్‌లిస్ట్ ఉపయోగపడుతుంది.
 * **నిర్ధారణ మాపనులు (Rating Scales):** చెక్‌లిస్ట్ కేవలం లక్షణం ఉందో లేదో చెబితే,
   రేటింగ్ స్కేల్ ఆ లక్షణం లేదా భావనావగాహన విద్యార్థిలో ఏ స్థాయిలో (ఉదాహరణకు: 3-
   పాయింట్, 5-పాయింట్ లేదా 7-పాయింట్ స్కేలు) ఉందో కొలవడానికి తోడ్పడుతుంది.
 * **పోర్ట్‌ఫోలియోలు (Portfolios):** ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థి చేసిన అత్యుత్తమ
   కృత్యాలు, వ్రాసిన వ్యాసాలు, వేసిన బొమ్మలు, ప్రాజెక్టు నివేదికలు మరియు విశేష ప్రతిభ
   పత్రాలను సేకరించి భద్రపరిచే సంచికనే పోర్ట్‌ఫోలియో అంటారు. ఇది విద్యార్థి క్రమానుగత
   వికాసానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.
 * **మేధో చిత్రణ (Mind Mapping):** ఒక విషయ భావనపై విద్యార్థికి ఉన్న పూర్వజ్ఞానాన్ని,
   ఆలోచనా విస్తృతిని అంచనా వేయడానికి మేధో చిత్రణ ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది.
 * **మౌఖిక మరియు వ్రాత పరీక్షలు (Oral & Written Tests):** విద్యార్థుల భావవ్యక్తీకరణ,
   ఉచ్ఛారణ మరియు తక్షణ స్పందనలను మౌఖిక పరీక్షల ద్వారా; అలాగే విశ్లేషణ, తార్కిక ఆలోచన,
   రచనా నైపుణ్యాలను వ్రాత పరీక్షల (Paper-Pencil Tests) ద్వారా మూల్యాంకనం చేస్తారు.

---

### ముగింపు (Conclusion)

మూల్యాంకనం అనేది విద్యార్థులను భయపెట్టే లేదా ర్యాంకుల ఆధారంగా వేరుచేసే సాధనం కాకూడదు.
మదింపును బోధనా-అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం చేస్తూ, నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)
ద్వారా ప్రతీ విద్యార్థి యొక్క వైయుక్తిక సామర్థ్యాలను, స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించినప్పుడే
విద్యా లక్ష్యాలు పరిపూర్ణంగా సిద్ధస్తాయి.

---

## Practice Time

### ప్రశ్నల పట్టిక (Questions)

 సమాధానం ఇచ్చినవి

 దాటవేసినవి

 చూడనివి

 _The Curiosi.com_ Magic Vault APTET/CTET – Assessment, Evaluation types, Tools 
of assessment, CCE

  00:00

## Related Pages

 * [Range of physical resources and objects: Digital resources; Films and media etc. (భౌతిక మరియు డిజిటల్ వనరులు, చలనచిత్రాలు మరియు ప్రసార మాధ్యమాలు – బోధనాశాస్త్రంలో వాటి ప్రాముఖ్యత మరియు అన్వయం)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/physical-resources-and-digital-tools/)
 * [Connecting Children’s Pre-school Knowledge with School Subjects (_పాఠశాల పూర్వ జ్ఞానాన్ని పాఠ్యాంశాలతో అనుసంధానించడం)_](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/connecting-childrens-preschool-knowledge-with-school-subjects/)
 * [Classroom organization and management: Changing pedagogies and Classroom management (తరగతి గది వ్యవస్థాపన మరియు నిర్వహణ: మారుతున్న బోధనా విధానాలు)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/classroom-organization-and-management/)

 Title

 [Aquaguard Enrich Ritz Pro RO+UV+Copper+Alkaline Water Purifier | …](https://www.amazon.in/dp/B0FCFQDNMW?tag=thecuriosi10b-21)

 [Aquaguard Enrich Glory RO+UV+UF Water Purifier with Copper & Alka…](https://www.amazon.in/dp/B0F5Q1HT9S?tag=thecuriosi10b-21)

 [Aquatec Plus – Advance plus 12 ltr RO+UV+UF+TDS Water purifier fo…](https://www.amazon.in/dp/B07B2CCW8Z?tag=thecuriosi10b-21)

 [AQUA D PURE Alkaline RO Water Purifier 12L RO+UV+UF+TDS Control w…](https://www.amazon.in/dp/B0B79QLL1K?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Aquaguard Enrich Ritz Pro RO+UV+Copper+Alkaline Water Purifier | 2-Year Warranty & Filter Life | Stainless Steel Tank | Smart Purifier with Service Alerts & TDS Display | 5th Gen UV LED | 12-Stage⌉](https://www.amazon.in/dp/B0FCFQDNMW?tag=thecuriosi10b-21)

 [⌊Aquaguard Enrich Glory RO+UV+UF Water Purifier with Copper & Alkaline Booster| 12-Stage Purification| 2-Year Filter Life| 4 Year Free Service | 40%+ Water Recovery| Suitable for All Water Sources⌉](https://www.amazon.in/dp/B0F5Q1HT9S?tag=thecuriosi10b-21)

 [⌊Aquatec Plus - Advance plus 12 ltr RO+UV+UF+TDS Water purifier for home (white blue) work up to 3000 tds⌉](https://www.amazon.in/dp/B07B2CCW8Z?tag=thecuriosi10b-21)

 [⌊AQUA D PURE Alkaline RO Water Purifier 12L RO+UV+UF+TDS Control with Goodness of copper 12 Liter Large Storage Tank, Suitable for all type of water supply. (color: Black)⌉](https://www.amazon.in/dp/B0B79QLL1K?tag=thecuriosi10b-21)

 Price

 ₹16,999

 ₹15,499

 ₹7,334

 ₹5,005

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0FCFQDNMW?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0F5Q1HT9S?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B07B2CCW8Z?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0B79QLL1K?tag=thecuriosi10b-21)

 Title

 [Aquaguard Enrich Ritz Pro RO+UV+Copper+Alkaline Water Purifier | …](https://www.amazon.in/dp/B0FCFQDNMW?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Aquaguard Enrich Ritz Pro RO+UV+Copper+Alkaline Water Purifier | 2-Year Warranty & Filter Life | Stainless Steel Tank | Smart Purifier with Service Alerts & TDS Display | 5th Gen UV LED | 12-Stage⌉](https://www.amazon.in/dp/B0FCFQDNMW?tag=thecuriosi10b-21)

 Price

 ₹16,999

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0FCFQDNMW?tag=thecuriosi10b-21)

 Title

 [Aquaguard Enrich Glory RO+UV+UF Water Purifier with Copper & Alka…](https://www.amazon.in/dp/B0F5Q1HT9S?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Aquaguard Enrich Glory RO+UV+UF Water Purifier with Copper & Alkaline Booster| 12-Stage Purification| 2-Year Filter Life| 4 Year Free Service | 40%+ Water Recovery| Suitable for All Water Sources⌉](https://www.amazon.in/dp/B0F5Q1HT9S?tag=thecuriosi10b-21)

 Price

 ₹15,499

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0F5Q1HT9S?tag=thecuriosi10b-21)

 Title

 [Aquatec Plus – Advance plus 12 ltr RO+UV+UF+TDS Water purifier fo…](https://www.amazon.in/dp/B07B2CCW8Z?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Aquatec Plus - Advance plus 12 ltr RO+UV+UF+TDS Water purifier for home (white blue) work up to 3000 tds⌉](https://www.amazon.in/dp/B07B2CCW8Z?tag=thecuriosi10b-21)

 Price

 ₹7,334

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B07B2CCW8Z?tag=thecuriosi10b-21)

 Title

 [AQUA D PURE Alkaline RO Water Purifier 12L RO+UV+UF+TDS Control w…](https://www.amazon.in/dp/B0B79QLL1K?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊AQUA D PURE Alkaline RO Water Purifier 12L RO+UV+UF+TDS Control with Goodness of copper 12 Liter Large Storage Tank, Suitable for all type of water supply. (color: Black)⌉](https://www.amazon.in/dp/B0B79QLL1K?tag=thecuriosi10b-21)

 Price

 ₹5,005

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0B79QLL1K?tag=thecuriosi10b-21)

Share this
