# Mental Health, Adjustment and Guidance

- Link: https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/
- Published: 2026-09-15T07:32:19+05:30
- Author: MAHENDRA MANCHIKALAPATI

## Mental Health, Adjustment, Defence mechanisms, Conflicts, Frustration, Stress, Anxiety, Maladjustment, Guidance and counselling

## మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, మరియు వర్తన విజ్ఞానం: సమగ్ర విశ్లేషణ

 * [మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, మరియు వర్తన విజ్ఞానం: సమగ్ర విశ్లేషణ](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#మానసిక-ఆరోగ్యం-సర్దుబాటు-మరియు-వర్తన-విజ్ఞానం-సమగ్ర-విశ్లేషణ)
 * [1. మానసిక ఆరోగ్యం (Mental Health)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#1-మానసిక-ఆరోగ్యం-mental-health)
 * [2. సర్దుబాటు (Adjustment)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#2-సర్దుబాటు-adjustment)
 * [3. సంఘర్షణలు (Conflicts)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#3-సంఘర్షణలు-conflicts)
 * [4. కుంఠనం (Frustration)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#4-కుంఠనం-frustration)
 * [5. ఒత్తిడి మరియు ఒత్తిడి నిర్వహణ (Stress & Stress Management)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#5-ఒత్తిడి-మరియు-ఒత్తిడి-నిర్వహణ-stress-stress-management)
 * [6. ఆందోళన / వ్యాకులత (Anxiety)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#6-ఆందోళన-వ్యాకులత-anxiety)
 * [7. రక్షక తంత్రాలు (Defense Mechanisms)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#7-రక్షక-తంత్రాలు-defense-mechanisms)
 * [8. విషమయోజనం (Maladjustment)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#8-విషమయోజనం-maladjustment)
 * [9. మార్గదర్శకత్వం మరియు మంత్రణం (Guidance and Counselling)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#9-మార్గదర్శకత్వం-మరియు-మంత్రణం-guidance-and-counselling)
 * [ముగింపు](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#ముగింపు)
 * [Practice Time:](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#practice-time)
 * [Related Pages:](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/#related-pages)

మానవ ప్రవర్తన మరియు మూర్తిమత్వ వికాసంలో మానసిక ఆరోగ్యం, సర్దుబాటు మరియు వాటికి సంబంధించిన
వివిధ మానసిక ప్రక్రియలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. మారుతున్న పరిసరాలకు అనుగుణంగా 
మారడమే ప్రకృతి ధర్మం; అయితే ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినప్పుడు మానసిక
మరియు శారీరక రుగ్మతలు ఏర్పడతాయి.

---

## 1. మానసిక ఆరోగ్యం (Mental Health)

మానసిక ఆరోగ్యం అనేది కేవలం శారీరక వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదు; వ్యక్తి తన సామర్థ్యాలను
సక్రమంగా వినియోగించుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని గడపడం.

 * **నిర్వచనం:** బెర్నార్డ్ ప్రకారం, “వ్యక్తి తనకు తానుగా మొత్తం ప్రపంచంతో అనుగుణ్యత
   చెంది సమర్థవంతంగా, సంతృప్తికరంగా, సంతోషదాయకంగా సామాజిక అనుకూలమైన ప్రవర్తనను నెలకొల్పుకొని
   నిత్య జీవితంలోని పరిస్థితులను ఎదుర్కొని అంగీకరించడమే మానసిక ఆరోగ్యం”.
 * **చారిత్రక నేపథ్యం:** మానసిక అనారోగ్యానికి దెయ్యాలు, భూతాలు కారణం కాదని ఖండించి,
   చికిత్సలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త **పీనెల్**.
 * **మానసిక ఆరోగ్య ఉద్యమం:** ఈ ఉద్యమానికి మూలపురుషుడు **క్లిఫ్ఫర్డ్ బీర్స్** (Clifford
   Beers). ఈయన 1908లో _“A Mind That Found Itself”_ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు.
   దీని ఫలితంగా 1909లో National Committee for Mental Health, 1930లో అంతర్జాతీయ మానసిక
   కాంగ్రెస్, మరియు 1948లో [ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)](https://www.google.com/url?sa=t&source=web&rct=j&opi=89978449&url=https://www.who.int/&ved=2ahUKEwi4vvb50_SWAxWXm-EIHRJyO84QFnoECCoQAQ&usg=AOvVaw3w5WZMkYep0vzSNC95FZZ9),
   [UNICEF](https://www.google.com/url?sa=t&source=web&rct=j&opi=89978449&url=https://www.unicef.org/&ved=2ahUKEwjLoNmF1PSWAxUrjOEIHYQ7B3AQFnoECBwQAQ&usg=AOvVaw1O2uknYQB73GM2vRXK9mri)
   లు స్థాపించబడి మానసిక ఆరోగ్యంపై విస్తృత కృషి చేశాయి.
 * **మానసిక ఆరోగ్యంలో ప్రధాన అంశాలు:**
    1. **ధనాత్మక అంశం:** సక్రమ మానసిక ఆరోగ్యానికి కావలసిన అనుకూల పరిస్థితులను నెలకొల్పుకోవడం.
    2. **నిరోధించే అంశాలు:** మానసిక అనారోగ్యం కలగకుండా అరికట్టే పద్ధతులను పాటించడం.
    3. **రోగ నివారణ అంశం:** అనారోగ్యానికి గురైన వారికి తగిన చికిత్స అందించడం.
 * **మానసిక అనారోగ్య కారకాలు:** ఇవి 2 రకాలు — దీర్ఘకాలికంగా బాధిస్తూ ఆత్మవిశ్వాసాన్ని
   తగ్గించే **ప్రోత్సహించే కారకాలు** (అభద్రతా భావం, న్యూనతా భావం), మరియు హఠాత్తుగా
   సంభవించే **ప్రోగు చేసే కారకాలు** (ఆర్థిక నష్టం, ప్రియమైన వారిని కోల్పోవడం).
 * **లక్షణాలు:** మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి శారీరక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత,
   ఆరోగ్యవంతమైన ఆత్మభావన, సామాజిక పరిపక్వత మరియు ఆశావాద జీవిత దృక్పథాన్ని కలిగి 
   ఉంటాడు.

---

## 2. సర్దుబాటు (Adjustment)

గర్భస్థ శిశువు దశ నుండి మరణించే వరకు జీవితంలో సర్దుబాటు అనేది ఒక నిరంతర ప్రక్రియ.

 * **నిర్వచనాలు:**
    - **గేట్స్ మరియు జెర్సిల్డ్ (1948):** “తనకూ, తన పరిసరాలకూ మధ్య మరింత సామరస్యమైన
      సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతరం తన ప్రవర్తనను మార్చుకోవడమే సర్దుబాటు”.
    - **లారెన్స్ షాఫర్ (1961):** “జీవి అవసరాలకూ, ఆ అవసరాలను సంతృప్తిపరచడాన్ని ప్రభావితం
      చేసే పరిస్థితులకు మధ్య సమతుల్యమే సర్దుబాటు”.
 * **ఆటంకాలు (Obstacles):** వ్యక్తి తన అవసరాలను తీర్చుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలు
   రెండు రకాలు:
    1. **వ్యక్తిగత ఆటంకాలు:** శారీరక లోపాలు (అంధత్వం, చెవుడు) లేదా మానసిక లోపాలు (తక్కువ
       ప్రజ్ఞ).
    2. **పరిసర ఆటంకాలు:** భౌతిక పరిసరాలు (కొండలు, ఎడారులు) లేదా సామాజిక పరిసరాలు (కట్టుబాట్లు,
       కుల మత అడ్డంకులు).

---

## 3. సంఘర్షణలు (Conflicts)

వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఎంచుకోవలసి వచ్చినప్పుడు 
మానసిక ఉద్రిక్తతకు గురవుతాడు.

 * **నిర్వచనం:** డగ్లస్ మరియు హాలండ్ ప్రకారం, “రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే 
   తణ్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగస్థితియే సంఘర్షణ”.
 * **కర్ట్ లెవిన్ వర్గీకరణ (4 రకాల సంఘర్షణలు):**
    1. **ఉపగమ – ఉపగమ (Approach – Approach):** రెండు ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఒకదానిని
       మాత్రమే ఎంచుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. _(ఉదాహరణ: ఒకే సమయంలో చాక్లెట్
       లేదా ఐస్‌క్రీమ్ లలో ఒకదాన్నే ఎంచుకోవడం)_.
    2. **పరిహార – పరిహార (Avoidance – Avoidance):** రెండు ఆకర్షణీయం కాని (అనిష్టమైన)
       పరిస్థితులలో ఒకదానిని తప్పనిసరిగా ఎంచుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. _(ఉదాహరణ:
       ఇష్టం లేని ఉద్యోగంలో రీజాయిన్ కావడం లేదా ట్రాన్స్‌ఫర్ కావడం)_.
    3. **ఉపగమ – పరిహార (Approach – Avoidance):** ఒకే లక్ష్యం పట్ల ఒకే సమయంలో ఆకర్షణ
       మరియు వికర్షణ (భయం/సిగ్గు) రెండూ కలగడం. _(ఉదాహరణ: చెట్టుపై ఉన్న జామపండు తినాలని
       ఆశ ఉన్నా, కింద పడతాననే భయం ఉండటం)_.
    4. **ద్వి – ఉపగమ పరిహార (Double Approach – Avoidance):** రెండు లేదా అంతకంటే ఎక్కువ
       ఆకర్షణీయమైన మరియు అనాకర్షణీయమైన అంశాలు ఉన్న లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవడం. _(
       ఉదాహరణ: ఎక్కువ జీతం ఉండి ఎక్కువ దూరం ఉన్న ఉద్యోగం లేదా తక్కువ జీతం ఉండి దగ్గరగా
       ఉన్న ఉద్యోగం మధ్య ఎంపిక)_.

---

## 4. కుంఠనం (Frustration)

లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురై కోరికలు తీరనప్పుడు వ్యక్తిలో నాటుకుపోయే నిరాశ నిస్పృహల
స్థితిని కుంఠనం అంటారు.

 * **నిర్వచనాలు:**
    - **గుడ్:** “మానవుని ఆశయం గానీ, అవసరం గానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు
      ఉద్భవించే భావనే కుంఠనం”.
    - **కరోల్:** “కుంఠనం అంటే వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం”.
 * **కారణాలు:** తమ సామర్థ్యానికి మించిన లక్ష్యాలను ఎంచుకోవడం, ఆర్థిక ఇబ్బందులు, 
   సామాజిక సంబంధాలు నెలకొల్పుకోలేకపోవడం మరియు మారే పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం.
 * **పర్యవసానాలు:** తీవ్రమైన కుంఠనం వల్ల వ్యక్తి లక్ష్యాన్ని విరమించుకోవడం, శారీరక-
   మానసిక అనారోగ్యం పాలవడం, దాష్టీకానికి (Aggression) ఒడిగట్టడం, లేదా పగటికలలు (
   స్వైరకల్పనం) కనడం వంటి ప్రతికూల చర్యలకు పూనుకుంటారు.

---

## 5. ఒత్తిడి మరియు ఒత్తిడి నిర్వహణ (Stress & Stress Management)

ఆధునిక జీవనశైలిలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

 * **నిర్వచనం:** ఒక సవాలుకు లేదా నూతన పరిస్థితికి వ్యక్తి శారీరకంగా, మానసికంగా స్పందించడమే
   ఒత్తిడి.
 * **ఇస్త్రీ పెట్టె (Iron Box) ఉదాహరణ:** బట్టల ముడతలు పోవడానికి ఇస్త్రీ పెట్టెకు
   తగినంత వేడి అవసరం; వేడి ఎక్కువైతే బట్టలు కాలుతాయి, తక్కువైతే ముడతలు పోవు. అదే
   విధంగా, **వ్యక్తికి తగినంత (పరిమిత) ఒత్తిడి ఉంటేనే పనిలో ప్రేరణ పొంది రాణిస్తాడు**;
   ఒత్తిడి అధికమైతే ఆలోచనా స్థబ్దత, జ్ఞాపకశక్తి క్షీణత మరియు చిరాకు కలుగుతాయి.
 * **లక్షణాలు:** తరచూ తలనొప్పి, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి,
   ఏకాగ్రత లోపించడం మరియు బాధ్యతల నుండి తప్పుకోవడం.
 * **ఒత్తిడి నిర్వహణ:** శ్వాసక్రియ నియంత్రణ, యోగా, ధ్యానం, ప్రశాంత నిద్ర, సమయపాలన,
   వాస్తవిక దృక్పథం, మరియు ఉల్లాసకరమైన క్రీడలు లేదా సంగీతం ద్వారా ఒత్తిడిని సమర్థవంతంగా
   జయించవచ్చు.

---

## 6. ఆందోళన / వ్యాకులత (Anxiety)

ఒత్తిడి పర్యవసానంగా ఏర్పడే ప్రతికూల ప్రవర్తనా స్థితిని ఆందోళన లేదా వ్యాకులత అంటారు.

 * **స్వభావం:** “కారణరహితమైన భయం వల్ల ఏదో కీడు జరగబోతుందన్న ఊహలు పదే పదే రావడం వల్ల
   కలిగే మానసిక స్థితి”. _(ఉదాహరణ: పరీక్షలంటే తీవ్రమైన భయంతో జ్వరం రావడం, వణుకు,
   లేదా చెమటలు పట్టే నికషా వ్యాకులత)_.
 * **పరిష్కారం:** విద్యార్థులకు కఠినమైన టార్గెట్లు విధించకుండా, వారిలో ఆత్మస్థైర్యం
   నింపడం, స్నేహపూర్వక వాతావరణం కల్పించడం మరియు నిరంతరం పరీక్షల భయాన్ని తొలగించడం
   ద్వారా ఆందోళనను నివారించవచ్చు.

---

## 7. రక్షక తంత్రాలు (Defense Mechanisms)

వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే **సంఘర్షణలు, కుంఠనాల వల్ల ఏర్పడే తీవ్రమైన మనో వ్యాకులతను(
Anxiety) తగ్గించుకోవడానికి**, తన **అహాన్ని (Ego)** కాపాడుకోవడానికి అచేతనంగా ఉపయోగించే
ఆత్మవంచన ప్రక్రియలనే **రక్షక తంత్రాలు (Defense Mechanisms)** అంటారు. ఈ భావనను మొదటగా**
సిగ్మండ్ ఫ్రాయిడ్** ప్రవేశపెట్టారు.

 * **పరిణామ క్రమం:** **సంఘర్షణలు → కుంఠనాలు → ఒత్తిడి → మనో వ్యాకులత → విషమయోజనం
   → మానసిక రుగ్మత**.
 * **ప్రక్రియ:** కుంఠనాల వల్ల కలిగే తీవ్ర మనో వ్యాకులతను తగ్గించుకోవడానికి వ్యక్తి
   అచేతనంగా ఉపయోగించే ఆత్మవంచన ప్రక్రియలే రక్షక తంత్రాలు.
 * **ప్రధాన రక్షక తంత్రాలు:**
 * **1. దమనం (Repression):**
    - **వివరణ:** బాధాకరమైన విషయాలను, అపజయాలను లేదా అవమానకరమైన అనుభవాలను బలవంతంగా
      మరచిపోవడానికి చేసే ప్రయత్నాన్ని దమనం అంటారు. దీనిని **‘ప్రేరేపిత విస్మృతి’**
      అని కూడా పిలుస్తారు.
    - **ఉదాహరణ:** బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందనే భయంతో చేసిన అప్పులను బలవంతంగా
      మరచిపోవడం.
 * **2. ప్రక్షేపణం (Projection):**
    - **వివరణ:** వ్యక్తి తనలోని లోపాలను, అపజయాలను లేదా అసంతృప్తి భావాలను ఇతరులపైకి
      లేదా బాహ్య వస్తువులపైకి ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటారు.
    - **ఉదాహరణ:** పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి తన బాధ్యతారాహిత్యాన్ని ఒప్పుకోకుండా,
      ఉపాధ్యాయుడు సరిగ్గా బోధించకపోవడం వల్లే ఫెయిల్ అయ్యానని చెప్పడం.
 * **3. హేతుకీకరణం (Rationalization):**
    - **వివరణ:** లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన వైఫల్యాన్ని సమాజం ఆమోదించే సప్రేతుకమైన,
      తప్పుడు కారణాలతో సమర్థించుకోవడాన్ని హేతుకీకరణం అంటారు.
    - **ఉదాహరణ:** నక్క తనకు దక్కని ద్రాక్షపళ్లను చూసి **‘అందని ద్రాక్ష పుల్లన’**
      అని తనకు తాను సరిపెట్టుకోవడం.
 * **4. విస్థాపనం (Displacement):**
    - **వివరణ:** తన కోపాన్ని లేదా ఉద్వేగాన్ని మూల కారణమైన బలమైన వ్యక్తిపై చూపలేక
      వేరొక బలహీనమైన వ్యక్తిపై లేదా వస్తువుపై ప్రదర్శించడాన్ని విస్థాపనం అంటారు.
    - **ఉదాహరణ:** ఆఫీసర్‌పై ఉన్న కోపాన్ని గుమస్తా తన భార్యపై చూపించడం లేదా అత్తపై
      ఉన్న కోపాన్ని వస్తువులపై ప్రదర్శించడం.
 * **5. ప్రతిగమనం (Regression):**
    - **వివరణ:** సమస్యలు ఎదురైనప్పుడు వయోజనుడిలా ఆలోచించి పరిష్కరించలేక, చిన్ననాటి
      శైశవ ప్రవర్తనా స్థితికి వెళ్లి పసిపిల్లల వలె ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు.
    - **ఉదాహరణ:** ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఆ పరిస్థితిని ఎదుర్కొనే బదులు పిల్లలవలె
      పట్టుకుని ఏడవడం.
 * **6. తదాతీకరణము (Identification):**
    - **వివరణ:** వ్యక్తి తన మూర్తిమత్వంలో ఇతరుల ఆశయాలను లేదా విజయాలను చేర్చుకుని,
      వారు సాధించిన విజయాన్ని తానే సాధించినట్లుగా అనుభూతి చెందడాన్ని తదాతీకరణం అంటారు.
    - **ఉదాహరణ:** బస్సు కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు, ఆ కండక్టర్ తానే గొప్ప
      విజయం సాధించినట్లు గర్వపడటం.
 * **7. పరిహారము (Compensation):**
    - **వివరణ:** ఒక రంగంలో లేదా విషయంలో రాణించలేకపోయిన వ్యక్తి ప్రత్యామ్నాయంగా మరొక
      రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఆ లోపాన్ని భర్తీ చేసుకోవడాన్ని పరిహారము 
      అంటారు.
    - **ఉదాహరణ:** చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటలలో విశేష ప్రతిభ కనబరిచి పేరు తెచ్చుకోవడం.
 * **8. ఉదాతీకరణం (Sublimation):**
    - **వివరణ:** సమాజం ఆమోదించని ఉద్వేగాలను లేదా ఆలోచనలను సమాజానికి ఉపయోగపడే నిర్మాణాత్మకమైన,
      కళాత్మక క్రియల్లోకి మళ్లించడాన్ని ఉదాతీకరణం అంటారు.
    - **ఉదాహరణ:** ప్రేయసికి దూరమైన ప్రేమికుడు తన బాధను కవితలుగా రాస్తూ గొప్ప కవిగా
      లేదా చిత్రకారుడిగా మారడం.
 * **9. స్వైరకల్పనం (Fantasy):**
    - **వివరణ:** నిజ జీవితంలో తీరని కోరికలను పగటికలలు (Day dreams) కనడం ద్వారా సంతృప్తిపరచుకోవడం.
 * **10. నిరాకరించుట (Denial):**
    - **వివరణ:** సహించలేని చేదు వాస్తవాన్ని నిజం కాదని త్రోసిపుచ్చి తాత్కాలిక ఉపశమనాన్ని
      పొందడం.
    - **ఉదాహరణ:** భార్య మరణవార్త విన్న భర్త అది నిజం కాదని నమ్మకపోవడం.
 * **11. ఉపసంహరణ (Withdrawal):**
    - **వివరణ:** అవమానం జరుగుతుందేమోననే భయంతో ఆయా పరిసరాలు లేదా సన్నివేశాల నుండి
      తప్పుకుని దూరంగా ఉండటం.
    - **ఉదాహరణ:** పేరంటానికి వెళ్తే అక్కడ అవమానం జరుగుతుందేమోనన్న భయంతో మహిళలు వెళ్లకుండా
      ఉండిపోవడం.
 * **12. ప్రేరక తారుమారు:**
    - **వివరణ:** తనలోని నిజమైన భావానికి పూర్తిగా వ్యతిరేకమైన ప్రవర్తనను బయటకు ప్రదర్శించి
      ఉపశమనం పొందడం.
    - **ఉదాహరణ:** ఉపాధ్యాయుడు దండించిన తర్వాత లోపల తీవ్ర బాధ ఉన్నప్పటికీ బయటకు “
      నాకేమీ బాధగా లేదు” అని చెప్పడం.
 * మనో వ్యాకులతను తగ్గించుకోవడానికి రక్షక తంత్రాలు తాత్కాలికంగా సహాయపడినప్పటికీ,
   వాటిపై పదే పదే ఆధారపడితే వ్యక్తి సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోయి విషమయోజనానికి(
   Maladjustment) గురవుతాడు.

---

## 8. విషమయోజనం (Maladjustment)

పరిసరాలతో ఏమాత్రం సర్దుబాటు చేసుకోలేని ప్రతికూల స్థితిని విషమయోజనం అంటారు.

 * **అట్కిన్సన్ నిర్వచనం:** “ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరుచుకోవడాన్ని
   విషమయోజనం అంటారు”.
 * **కారణాలు:**
    1. **వ్యక్తిగత కారకాలు:** శారీరక ఆకృతి సరిగా లేకపోవడం, శారీరక బలహీనత, ఆత్మవిశ్వాస
       లోపం, మరియు తమ ప్రజ్ఞా సామర్థ్యాలకు మించిన ఆశయాలు ఏర్పరుచుకోవడం.
    2. **పరిసర కారకాలు:** కుటుంబంలో కఠినమైన నిబంధనలు, ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధాలు 
       సరిగా లేకపోవడం, పాఠ్యప్రణాళిక భారం మరియు సామాజిక-సాంస్కృతిక విలువల్లో వ్యత్యాసాలు.
 * **లక్షణాలు:** ఆలోచనలు-చేతలకు పొంతన లేకపోవడం, తీవ్ర మనోవ్యాకులత, అవధాన లోపం, నిద్రలేమి,
   న్యూనతా భావాలు మరియు రక్షక తంత్రాలపై పదే పదే ఆధారపడటం.

---

## 9. మార్గదర్శకత్వం మరియు మంత్రణం (Guidance and Counselling)

విషమయోజనం మరియు మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను కాపాడటానికి పాఠశాలలు, 
ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు క్రింది చర్యలు తీసుకోవాలి:

 * **సమగ్ర మార్గదర్శకత్వం:** విద్యార్థుల సహజ సామర్థ్యాలు, అభిరుచులు మరియు ప్రజ్ఞను
   గుర్తించి వారికి తగిన **విద్యా మరియు ఉద్యోగ సంబంధిత మార్గదర్శకత్వాన్ని (Educational&
   Vocational Guidance)** అందించాలి.
 * **ప్రజాస్వామిక వాతావరణం:** పాఠశాలలో నిరంకుశ లేదా దండనాపూరిత వాతావరణం లేకుండా,
   విద్యార్థుల సలహాలకు విలువ ఇచ్చే **ప్రోత్సాహపూరిత ప్రజాస్వామిక వాతావరణాన్ని** 
   నెలకొల్పాలి.
 * **మంత్రణం (Counselling):** తీవ్రమైన విషమయోజనం మరియు వ్యాకులత కలిగిన పిల్లలను 
   ప్రత్యేకంగా గుర్తించి, నిపుణులైన కౌన్సెలర్ల ద్వారా భద్రతా భావాన్ని నెలకొల్పుతూ,
   సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించుకునే నైపుణ్యాలను పెంపొందించాలి.

---

## ముగింపు

వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసానికి మరియు సంతోషకరమైన జీవితానికి మానసిక ఆరోగ్యం అత్యంత
ప్రధానమైనది. విద్యార్థులలో ఎదురయ్యే సంఘర్షణలు, ఒత్తిడులు మరియు ఆందోళనలను సమర్థవంతంగా
అధిగమింపజేస్తూ, సరైన మార్గదర్శకత్వం ద్వారా వారిలో **సమగ్ర లేదా సమైక్య మూర్తిమత్వాన్ని(
Integrated Personality)** వికసింపజేయడం ఉపాధ్యాయులు మరియు సమాజం యొక్క ప్రాథమిక బాధ్యత.

---

## Practice Time:

### ప్రశ్నల పట్టిక (Questions)

 సమాధానం ఇచ్చినవి

 దాటవేసినవి

 చూడనివి

 _The Curiosi.com_ Magic Vault APTET/CTET – Mental Health, Adjustment and Guidance

  00:00

## Related Pages:

[Observation, Interviews, Reflective Journals, Anecdotal records and Narratives, Introspection, Experimental method, Questionnaire, Case Study, Rating Scales, Longitudinal and Cross-Cultural Approaches, Action Research in Education](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/methods-and-techniques-of-data-collection/)

[(పరిశీలన, ఇంటర్వ్యూలు, ప్రతిబింబిత జర్నల్స్, ఉదంతాల రికార్డులు మరియు కథనాలు, ఆత్మపరిశీలన, ప్రయోగాత్మక పద్ధతి, ప్రశ్నావళి, కేస్ స్టడీ, రేటింగ్ స్కేల్స్, దీర్ఘకాలిక మరియు బహుళ-సాంస్కృతిక విధానాలు, విద్యలో కార్యాచరణ పరిశోధన)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/methods-and-techniques-of-data-collection/)

 Title

 [LG Essential Series, 0.8 Ton 2 Star,New star rated, Smart Inverte…](https://www.amazon.in/dp/B0GF1779H2?tag=thecuriosi10b-21)

 [Carrier 1.5 Ton 3 Star,New Star rated, Wi-Fi Smart Flexicool Inve…](https://www.amazon.in/dp/B0GCDZCJ7K?tag=thecuriosi10b-21)

 [Daikin 1.5 Ton 3 Star, New Star rated, Inverter Split AC (Copper,…](https://www.amazon.in/dp/B0GRV2DWP3?tag=thecuriosi10b-21)

 [LG 1.5 Ton 5 Star,New star rated, DUAL Inverter Split AC (Copper,…](https://www.amazon.in/dp/B0G58WMC69?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊LG Essential Series, 0.8 Ton 2 Star,New star rated, Smart Inverter Split AC (Copper, Convertible 6-in-1 Cooling, Faster Cooling & Energy Saving, HD Filter with AntiVirus Protection, AS-Q11KNVE, White)⌉](https://www.amazon.in/dp/B0GF1779H2?tag=thecuriosi10b-21)

 [⌊Carrier 1.5 Ton 3 Star,New Star rated, Wi-Fi Smart Flexicool Inverter Split AC (Copper, Convertible 6-in-1 with Wi-Fi with Geo-Fencing, Smart Energy Display, ESTER EDGE Gxi WiFi-CAI18EE3R36W0, White)⌉](https://www.amazon.in/dp/B0GCDZCJ7K?tag=thecuriosi10b-21)

 [⌊Daikin 1.5 Ton 3 Star, New Star rated, Inverter Split AC (Copper, PM2.5 Filter, MTKL50XV16, White)⌉](https://www.amazon.in/dp/B0GRV2DWP3?tag=thecuriosi10b-21)

 [⌊LG 1.5 Ton 5 Star,New star rated, DUAL Inverter Split AC (Copper, AI Convertible 6-in-1,VIRAAT Mode,Faster Cooling & Energy Saving,4 Way Swing, HD Filter with Anti-Virus Protection, US-Q19YNZE3,White)⌉](https://www.amazon.in/dp/B0G58WMC69?tag=thecuriosi10b-21)

 Price

 ₹26,490

 ₹35,490

 ₹36,990

 ₹42,990

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0GF1779H2?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0GCDZCJ7K?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0GRV2DWP3?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0G58WMC69?tag=thecuriosi10b-21)

 Title

 [LG Essential Series, 0.8 Ton 2 Star,New star rated, Smart Inverte…](https://www.amazon.in/dp/B0GF1779H2?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊LG Essential Series, 0.8 Ton 2 Star,New star rated, Smart Inverter Split AC (Copper, Convertible 6-in-1 Cooling, Faster Cooling & Energy Saving, HD Filter with AntiVirus Protection, AS-Q11KNVE, White)⌉](https://www.amazon.in/dp/B0GF1779H2?tag=thecuriosi10b-21)

 Price

 ₹26,490

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0GF1779H2?tag=thecuriosi10b-21)

 Title

 [Carrier 1.5 Ton 3 Star,New Star rated, Wi-Fi Smart Flexicool Inve…](https://www.amazon.in/dp/B0GCDZCJ7K?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Carrier 1.5 Ton 3 Star,New Star rated, Wi-Fi Smart Flexicool Inverter Split AC (Copper, Convertible 6-in-1 with Wi-Fi with Geo-Fencing, Smart Energy Display, ESTER EDGE Gxi WiFi-CAI18EE3R36W0, White)⌉](https://www.amazon.in/dp/B0GCDZCJ7K?tag=thecuriosi10b-21)

 Price

 ₹35,490

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0GCDZCJ7K?tag=thecuriosi10b-21)

 Title

 [Daikin 1.5 Ton 3 Star, New Star rated, Inverter Split AC (Copper,…](https://www.amazon.in/dp/B0GRV2DWP3?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Daikin 1.5 Ton 3 Star, New Star rated, Inverter Split AC (Copper, PM2.5 Filter, MTKL50XV16, White)⌉](https://www.amazon.in/dp/B0GRV2DWP3?tag=thecuriosi10b-21)

 Price

 ₹36,990

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0GRV2DWP3?tag=thecuriosi10b-21)

 Title

 [LG 1.5 Ton 5 Star,New star rated, DUAL Inverter Split AC (Copper,…](https://www.amazon.in/dp/B0G58WMC69?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊LG 1.5 Ton 5 Star,New star rated, DUAL Inverter Split AC (Copper, AI Convertible 6-in-1,VIRAAT Mode,Faster Cooling & Energy Saving,4 Way Swing, HD Filter with Anti-Virus Protection, US-Q19YNZE3,White)⌉](https://www.amazon.in/dp/B0G58WMC69?tag=thecuriosi10b-21)

 Price

 ₹42,990

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0G58WMC69?tag=thecuriosi10b-21)

Share this
