# Theories of Learning & Classroom Applications

- Link: https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/
- Published: 2026-09-16T07:50:27+05:30
- Author: MAHENDRA MANCHIKALAPATI

## **అభ్యసన సిద్ధాంతాలు మరియు తరగతి గది అన్వయాలు **⏎ **(Theories of Learning & Classroom Applications)**

 * [అభ్యసన సిద్ధాంతాలు మరియు తరగతి గది అన్వయాలు (Theories of Learning & Classroom Applications)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#అభ్యసన-సిద్ధాంతాలు-మరియు-తరగతి-గది-అన్వయాలు-theories-of-learning-classroom-applications)
    - [1. యత్న దోష అభ్యసన సిద్ధాంతం (Trial and Error Learning)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#1-యత్న-దోష-అభ్యసన-సిద్ధాంతం-trial-and-error-learning)
    - [2. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం (Classical Conditioning)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#2-శాస్త్రీయ-నిబంధన-సిద్ధాంతం-classical-conditioning)
    - [3. కార్యసాధక నిబంధన సిద్ధాంతం (Operant Conditioning)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#3-కార్యసాధక-నిబంధన-సిద్ధాంతం-operant-conditioning)
    - [4. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం (Insightful Learning)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#4-అంతర్దృష్టి-అభ్యసన-సిద్ధాంతం-insightful-learning)
    - [5. పరిశీలనా అభ్యసనం / సామాజిక అభ్యసనం (Social Learning / Observation)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#5-పరిశీలనా-అభ్యసనం-సామాజిక-అభ్యసనం-social-learning-observation)
    - [6. బ్రూనర్ బోధనా సిద్ధాంతం (Bruner’s Theory of Instruction)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#6-బ్రూనర్-బోధనా-సిద్ధాంతం-bruners-theory-of-instruction)
    - [7. నిర్మాణాత్మకవాదం మరియు విద్యా అన్వయాలు (Constructivism & Pedagogical Applications)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#7-నిర్మాణాత్మకవాదం-మరియు-విద్యా-అన్వయాలు-constructivism-pedagogical-applications)
    - [పియాజే vs వైగోట్‌స్కీ నిర్మాణాత్మకవాదం (Cognitive vs Social Constructivism)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#పియాజే-vs-వైగోట్-స్కీ-నిర్మాణాత్మకవాదం-cognitive-vs-social-constructivism)
       * [అ) పియాజే సంజ్ఞానాత్మక నిర్మాణాత్మకవాదం (Jean Piaget – Cognitive Constructivism):](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#అ-పియాజే-సంజ్ఞానాత్మక-నిర్మాణాత్మకవాదం-jean-piaget-cognitive-constructivism)
       * [ఆ) వైగోట్‌స్కీ సామాజిక నిర్మాణాత్మకవాదం (Lev Vygotsky – Social Constructivism):](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#ఆ-వైగోట్-స్కీ-సామాజిక-నిర్మాణాత్మకవాదం-lev-vygotsky-social-constructivism)
    - [నిర్మాణాత్మకవాదం (Constructivism) మరియు తరగతి గదిలో ఉపాధ్యాయుడి పాత్ర](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#నిర్మాణాత్మకవాదం-constructivism-మరియు-తరగతి-గదిలో-ఉపాధ్యాయుడి-పాత్ర)
    - [8. పరస్పర బోధన మరియు భాగస్వామ్య అభ్యసనం (Reciprocal Teaching & Collaborative Learning)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#8-పరస్పర-బోధన-మరియు-భాగస్వామ్య-అభ్యసనం-reciprocal-teaching-collaborative-learning)
       * [అ) పరస్పర బోధన (Reciprocal Teaching):](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#అ-పరస్పర-బోధన-reciprocal-teaching)
       * [ఆ) భాగస్వామ్య అభ్యసనం (Collaborative / Cooperative Learning):](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#ఆ-భాగస్వామ్య-అభ్యసనం-collaborative-cooperative-learning)
    - [9. జ్ఞాన నిర్మాణం – 5E నమూనా (Construction of Knowledge – 5E Method)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#9-జ్ఞాన-నిర్మాణం-5-e-నమూనా-construction-of-knowledge-5-e-method)
    - [10. భాష యొక్క పాత్ర మరియు ఉపాధ్యాయుడి తరగతిగది అన్వయాలు (Role of Language & Teacher)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#10-భాష-యొక్క-పాత్ర-మరియు-ఉపాధ్యాయుడి-తరగతిగది-అన్వయాలు-role-of-language-teacher)
       * [అ) భాష యొక్క పాత్ర (Role of Language):](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#అ-భాష-యొక్క-పాత్ర-role-of-language)
       * [ఆ) ఉపాధ్యాయుడి పాత్ర (Role of Teacher in Constructivist Classroom):](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#ఆ-ఉపాధ్యాయుడి-పాత్ర-role-of-teacher-in-constructivist-classroom)
 * [Practice Time:](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#p)
 * [Related Pages:](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#re)
    - [ Personality](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-learning-classroom-applications/#personality)

అభ్యసనం (Learning) అనేది అనుభవం మరియు శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు ప్రక్రియ.
మానవులలో అభ్యసన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వివరించడానికి వివిధ మానసిక శాస్త్రవేత్తలు
కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలను ప్రతిపాదించారు.

---

### **1. యత్న దోష అభ్యసన సిద్ధాంతం (Trial and Error Learning)**

 * **సిద్ధాంతకర్త:** ఈ సిద్ధాంతాన్ని **ఇ.ఎల్. థార్న్‌డైక్ (E.L. Thorndike)** పిల్లిపై
   చేసిన ప్రయోగాల ఆధారంగా ప్రతిపాదించారు. దీనిని **‘సంసర్గవాదం’ (Connectionism)**
   అని కూడా అంటారు.
 * **ప్రధాన సూత్రం:** అభ్యసనం అనేది ఉద్దీపన (Stimulus – S) మరియు ప్రతిస్పందన (Response–
   R) ల మధ్య ఏర్పడే బలమైన బంధం (S-R Connection) పై ఆధారపడి ఉంటుంది.
 * **ముఖ్యమైన నియమాలు:**
    1. **సన్నద్ధతా నియమం (Law of Readiness):** ఒక పని చేయడానికి అభ్యాసకుడు శారీరకంగా,
       మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది.
    2. **అభ్యాస నియమం (Law of Frequency / Exercise):** పునరావృతం, సాధన (Drill, Homework,
       Review) చేయడం వల్ల ఉద్దీపన-ప్రతిస్పందనల బంధం బలపడుతుంది.
    3. **ఫలిత నియమం (Law of Effect):** అభ్యసనం వల్ల కలిగే సంతృప్తికరమైన ఫలితం (Joyful
       Learning, Assignments) అభ్యసనాన్ని బలపరుస్తుంది.

---

### **2. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం (Classical Conditioning)**

 * **సిద్ధాంతకర్త:** రష్యన్ శాస్త్రవేత్త **ఇవాన్ పావ్లోవ్ (Ivan Pavlov)** కుక్కపై
   చేసిన ప్రయోగం ద్వారా దీనిని ప్రతిపాదించారు. దీనిని **‘Type S’ నిబంధనం** అని అంటారు.
 * **నిర్వచనం:** డ్రెవర్ (Drever) ప్రకారం — ఒక ఉద్దీపనకు వచ్చే సహజ ప్రతిస్పందనను
   వేరొక ఉద్దీపనకు రాబట్టే ప్రక్రియనే నిబంధనం అంటారు.
 * **ప్రయోగ అంశాలు:** నిర్నిబంధిత ఉద్దీపన (UCS – ఆహారం), నిర్నిబంధిత ప్రతిస్పందన(
   UCR – లాలాజలం), నిబంధిత ఉద్దీపన (CS – గంట శబ్దం), నిబంధిత ప్రతిస్పందన (CR – లాలాజలం).
 * **ముఖ్య భావనలు:** **పునర్బలన నియమం (Law of Reinforcement)**, **విలుప్తీకరణ (Extinction)**,**
   అప్రయత్న స్వాస్థ్యం (Spontaneous recovery)**, **సామాన్యీకరణ (Generalization)**,**
   విచక్షణ (Discrimination)**, మరియు **ఉన్నత క్రమ నిబంధనం (Higher order conditioning)**.

---

### **3. కార్యసాధక నిబంధన సిద్ధాంతం (Operant Conditioning)**

 * **సిద్ధాంతకర్త:** **బి.ఎఫ్. స్కిన్నర్ (B.F. Skinner)** ఎలుకలపై ప్రయోగాలు చేసి
   దీనిని ప్రతిపాదించారు. దీనిని **పరికరాత్మక అభ్యసనం (Instrumental Learning)** 
   లేదా **‘Type R’ నిబంధనం** అని పిలుస్తారు.
 * **ప్రధాన సూత్రం:** ఇందులో ప్రతిస్పందన (R) కు మరియు పునర్బలకాలకు (Reinforcers)
   ప్రాధాన్యం ఉంటుంది.
 * **తరగతి గది అన్వయం:** క్లిష్టమైన పాఠ్యాంశాలను చిన్న చిన్న భాగాలుగా (Frames) విభజించి,
   స్వయంగా నేర్చుకునేలా చేసే **కార్యక్రమయుత అభ్యసనం (Programmed Learning / Self-
   learning)** దీని ఆధారంగానే రూపొందింది.

---

### **4. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం (Insightful Learning)**

 * **సిద్ధాంతకర్త:** గెస్టాల్ట్ (Gestaltism) వాది అయిన **కోహ్లర్ (Kohler)** టెనెరీఫ్
   దీవుల్లో ‘సుల్తాన్’ అనే చింపాంజీపై ప్రయోగాలు చేసి దీనిని వివరించారు. తన పరిశోధనలను_“
   The Mentality of Apes”_ గ్రంథంలో ప్రచురించారు.
 * **ప్రధాన సూత్రం:** సమస్యను చిన్న చిన్న విడిభాగాలుగా కాకుండా సమగ్రంగా (Organized
   whole / Configuration) చూసి, అకస్మాత్తుగా (‘Like a flash’) సమస్య పరిష్కారాన్ని
   కనుగొనడమే అంతర్దృష్టి అభ్యసనం.

---

### **5. పరిశీలనా అభ్యసనం / సామాజిక అభ్యసనం (Social Learning / Observation)**

 * **సిద్ధాంతకర్త:** **ఆల్బర్ట్ బండూరా** దీనిని ప్రతిపాదించారు. దీనిని **అనుకరణ (
   Imitation)** లేదా **నమూనా అభ్యసనం (Modeling)** అని కూడా అంటారు.
 * **సోపానాలు:** పరిశీలనా అభ్యసనంలో నాలుగు ప్రధాన దశలు ఉన్నాయి: **అవధానం (Attention)**,**
   ధారణ (Retention)**, **పునరుత్పత్తి (Performance)**, మరియు **పునర్బలనం (Reinforcement)**.

---

### **6. బ్రూనర్ బోధనా సిద్ధాంతం (Bruner’s Theory of Instruction)**

 * **సిద్ధాంతకర్త:** **జెరోమ్ బ్రూనర్ (Jerome Bruner)** తన _“The Process of Education”_
   గ్రంథంలో ఆవిష్కరణ అభ్యసనం (Discovery Learning) మరియు బోధనా సిద్ధాంతాన్ని రూపొందించారు.
 * **ముఖ్య అంశాలు:** అభ్యసన సన్నద్ధత (Learning readiness), విషయ నిర్మాణం (Content
   Construction), విషయ క్రమీకరణ (Content Seriation), మరియు పునర్బలనం (Reinforcement)
   ఇందులో ప్రాధానాంశాలు.

---

### **7. నిర్మాణాత్మకవాదం మరియు విద్యా అన్వయాలు **⏎ **(Constructivism & Pedagogical Applications)**

---

మానవ వికాసంలో అభ్యాసకులు సమాచారాన్ని కేవలం నిష్క్రియాత్మకంగా గ్రహించకుండా, తమ సొంత
అనుభవాల ద్వారా జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకుంటారని **నిర్మాణాత్మకవాదం (Constructivism)**
వివరిస్తుంది.

---

### **పియాజే vs వైగోట్‌స్కీ నిర్మాణాత్మకవాదం (Cognitive vs Social Constructivism)**

#### **అ) పియాజే సంజ్ఞానాత్మక నిర్మాణాత్మకవాదం (Jean Piaget – Cognitive Constructivism):**

 * **ప్రధాన సూత్రం:** పిల్లలు భౌతిక పరిసరాలతో జరిపే స్వయం పరస్పర చర్యల ద్వారా జ్ఞానాన్ని
   నిర్మించుకుంటారు. పిల్లవానిని ఒక **‘చిన్న పరిశోధకుడు’ (Little Scientist)** గా
   పియాజే అభివర్ణించారు.
 * **జ్ఞాన నిర్మాణ ప్రక్రియ:**
    1. **స్కీమాలు (Schemas):** మెదడులో సమాచారాన్ని నిల్వ చేసే జ్ఞాన నిర్మాణాలు.
    2. **సామీకరణం (Assimilation):** నూతన అనుభవాలను పాత స్కీమాలకు జోడించడం.
    3. **వ్యాకూలీకరణం (Accommodation):** కొత్త అనుభవాలకు అనుగుణంగా పాత స్కీమాలను మార్చుకోవడం.
    4. **సమతుల్యత (Equilibration):** ఆలోచనలలో స్థిరత్వాన్ని సాధించడం.

#### **ఆ) వైగోట్‌స్కీ సామాజిక నిర్మాణాత్మకవాదం (Lev Vygotsky – Social Constructivism):**

 * **ప్రధాన సూత్రం:** జ్ఞాన నిర్మాణం అనేది వ్యక్తిగతంగా కాక సామాజిక సంస్కృతి, పరస్పర
   చర్యలు మరియు సహకారం ద్వారా జరుగుతుంది.
 * **ముఖ్య భావనలు:**
    1. **సమీప వికాస మండలం (Zone of Proximal Development – ZPD):** చిన్నారి స్వయంగా 
       చేయగలిగే పనికి, ఇతరుల సహాయంతో చేయగలిగే పనికి మధ్య ఉన్న వ్యత్యాసం.
    2. **స్కాఫోల్డింగ్ (Scaffolding):** పిల్లవాడు ఒక పనిని నేర్చుకునేటప్పుడు ఉపాధ్యాయుడు
       లేదా పెద్దలు అందించే **తాత్కాలిక సహాయం/ఆసరా**.
    3. **మరింత జ్ఞానమున్న ఇతరులు (More Knowledgeable Other – MKO):** అభ్యాసకుని కంటే
       ఎక్కువ జ్ఞానం లేదా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుడు, తోటి విద్యార్థి లేదా పెద్దలు.

### **నిర్మాణాత్మకవాదం (Constructivism) మరియు తరగతి గదిలో ఉపాధ్యాయుడి పాత్ర**

 * నిర్మాణాత్మకవాదం (Constructivism) అభ్యసన సిద్ధాంతాలలో ఒకటిగా పేర్కొనబడింది.
 * **ఉపాధ్యాయుడి పాత్ర & తరగతి గది అన్వయాలు:**
    - ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక **రోల్ మోడల్ (Role Model)** గా ఉంటూ ఆహ్లాదకరమైన
      వాతావరణాన్ని కల్పించాలి.
    - **నమ్య ప్రణాళిక (Flexible Planning):** చదువంటే కేవలం మార్కులు, బట్టీ పట్టడం,
      గైడ్ల నుంచి కాపీ కొట్టడం కాకుండా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతులను
      మార్చుకోవాలి.
    - బోధన సమయంలో ఉపాధ్యాయుడు కుర్చీకే పరిమితం కాకుండా పిల్లల మధ్యలోకి వెళ్లి బోధించాలి.
    - ఆకర్షణీయమైన, తక్కువ ఖర్చుతో కూడిన బోధనా సామగ్రిని (**Low cost or no cost material**)
      ఉపయోగించాలి.
    - విద్యార్థుల **పూర్వ జ్ఞానాన్ని** పరిశీలించి బోధన ప్రారంభించాలి మరియు వైయుక్తిక,
      సమూహ చర్చల ద్వారా స్వీయ అభ్యసనాన్ని, స్నేహ సంబంధాలను ప్రోత్సహించాలి.

---

### **8. పరస్పర బోధన మరియు భాగస్వామ్య అభ్యసనం (Reciprocal Teaching & Collaborative Learning)**

#### **అ) పరస్పర బోధన (Reciprocal Teaching):**

 * పాలిన్సర్ మరియు బ్రౌన్ (Palincsar & Brown) రూపకల్పన చేసిన ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు
   మరియు విద్యార్థులు చిన్న సమూహాలుగా ఏర్పడి, వచనాన్ని అర్థం చేసుకోవడానికి ఒకరితో
   ఒకరు సంభాషిస్తారు.
 * **నాలుగు ప్రాథమిక వ్యూహాలు:**
    1. **సారాంశం చెప్పడం (Summarizing):** చదివిన అంశంలోని ముఖ్య విషయాలను సంగ్రహంగా 
       చెప్పడం.
    2. **ప్రశ్నలు అడగడం (Questioning):** పాఠ్యాంశంపై ప్రశ్నలు వేయడం.
    3. **స్పష్టత నివ్వడం (Clarifying):** కష్టమైన పదాలు లేదా భావనలకు స్పష్టత తెచ్చుకోవడం.
    4. **ఊహించడం / ముందుగా అంచనా వేయడం (Predicting):** తర్వాత ఏమి జరగబోతుందో అంచనా 
       వేయడం.

#### **ఆ) భాగస్వామ్య అభ్యసనం (Collaborative / Cooperative Learning):**

 * విద్యార్థులు చిన్న చిన్న జట్లుగా ఏర్పడి ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఒకరికొకరు
   సహకరించుకుంటూ నేర్చుకుంటారు.
 * ఇది విద్యార్థులలో సామాజిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మరియు విమర్శనాత్మక ఆలోచనను
   పెంపొందిస్తుంది.

---

### **9. జ్ఞాన నిర్మాణం – 5E నమూనా (Construction of Knowledge – 5E Method)**

రాజర్ బైబీ (Roger Bybee) మరియు BSCS బృందం రూపొందించిన **5E బోధనా నమూనా** నిర్మాణాత్మక
తరగతి గదిలో అభ్యసనాన్ని ఐదు దశల్లో నిర్వహిస్తుంది:

 1. **Engage (నిమగ్నం చేయడం):** విద్యార్థుల అవధానాన్ని ఆకర్షించడం, ఆసక్తిని రేకెత్తించడం
    మరియు వారి పూర్వజ్ఞానాన్ని వెలికితీసే ప్రశ్నలు అడగడం.
 2. **Explore (అన్వేషించడం):** ప్రత్యక్ష కృత్యాలు, ప్రయోగాలు మరియు పరిశీలనల ద్వారా 
    విద్యార్థులు స్వయంగా విషయాలను అన్వేషించే అవకాశం ఇవ్వడం.
 3. **Explain (వివరించడం):** విద్యార్థులు తమ అన్వేషణల ద్వారా గ్రహించిన విషయాలను సొంత
    మాటల్లో వివరిస్తారు; ఉపాధ్యాయుడు సాంకేతిక పదాలను మరియు స్పష్టతను జోడిస్తాడు.
 4. **Elaborate (విస్తరించడం / వివదీకరించడం):** ఆర్జించిన జ్ఞానాన్ని నూతన మరియు నిత్యజీవిత
    పరిస్థితులకు వర్తింపజేసి అవగాహనను లోతుగా మార్చుకోవడం.
 5. **Evaluate (మూల్యాంకనం చేయడం):** ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు అభ్యసన స్థాయిని,
    నైపుణ్యాలను అంచనా వేయడం.

---

### **10. భాష యొక్క పాత్ర మరియు ఉపాధ్యాయుడి తరగతిగది అన్వయాలు (Role of Language & Teacher)**

#### **అ) భాష యొక్క పాత్ర (Role of Language):**

వైగోట్‌స్కీ ప్రకారం భాష అనేది కేవలం సమాచార మార్పిడికి మాత్రమే కాక ఆలోచనా వికాసానికి
మరియు సంజ్ఞానాత్మక వికాసానికి ప్రధాన సాధనం. ఇందులో మూడు రూపాలు ఉంటాయి:

 1. **సామాజిక భాష (Social Speech):** 2 సంవత్సరాల వయస్సు నుండి ఇతరులతో మాట్లాడటానికి
    ఉపయోగించే భాష.
 2. **వ్యక్తిగత / రహస్య భాష (Private Speech):** 3 సంవత్సరాల వయస్సు నుండి పిల్లలు తమ
    స్వంత ఆలోచనలు మరియు ప్రవర్తనను నియంత్రించుకోవడానికి బిగ్గరగా తమలో తామే మాట్లాడుకోవడం.
 3. **అంతర్గత నిశ్శబ్ద భాష (Silent Inner Speech):** 7 సంవత్సరాల నుండి భాష ఆలోచనగా మారి
    నిశ్శబ్దంగా మెదడులోనే సాగుతుంది.

#### **ఆ) ఉపాధ్యాయుడి పాత్ర (Role of Teacher in Constructivist Classroom):**

 * **సౌకర్యకర్త (Facilitator):** ఉపాధ్యాయుడు కేవలం సమాచారాన్ని అందించే ప్రసంగీకుడు
   కాదు; జ్ఞాన నిర్మాణానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించే సౌకర్యకర్త.
 * **మార్గాదర్శకుడు & స్కాఫోల్డర్:** విద్యార్థులు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు అవసరమైన
   సూచనలు, ప్రదర్శనలు ఇస్తూ స్కాఫోల్డింగ్ (సహాయం) అందిస్తారు.
 * **సహ-అభ్యాసకుడు (Co-learner):** తరగతి గదిలో విద్యార్థులతో కలిసి అన్వేషణలో భాగస్వామి
   అవుతారు.

---

## Practice Time:

### ప్రశ్నల పట్టిక (Questions)

 సమాధానం ఇచ్చినవి

 దాటవేసినవి

 చూడనివి

 _The Curiosi.com_ Magic Vault APTET/CTET – Theories of Learning & Classroom Applications

  00:00

## Related Pages:

###  Personality

 * [Meaning, Definition, Characteristics and Elements of Personality (మూర్తిమత్వం (Personality) యొక్క అర్థం, నిర్వచనాలు, ప్రాథమిక లక్షణాలు మరియు మూలకాలపై రూపొందించిన సమగ్ర వ్యాసం)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/meaning-definition-characteristics-and-elements-of-personality/)
 * [Factors influencing personality, Physical and Socio-cultural factors (వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు, శారీరక మరియు సామాజిక-సాంస్కృతిక కారకాలు)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/factors-influencing-personality-physical-and-socio-cultural-factors/)
 * [Theories of Personality (మూర్తిమత్వ సిద్ధాంతాలు)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/theories-of-personality/)
 * [Assessment of Personality – Projective and non-projective techniques (మూర్తిమత్వ మాపన పద్ధతులు: ప్రక్షేపక మరియు అప్రక్షేపక పరీక్షలు)](https://thecuriosi.com/assessment-of-personality-projective-and-non-projective-techniques/)
 * [Mental Health, Adjustment, Defence mechanisms, Conflicts, Frustration, Stress, Anxiety, Maladjustment, Guidance and counselling (మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, రక్షణ యంత్రాంగాలు, సంఘర్షణలు, నిరాశ, ఒత్తిడి, ఆందోళన, అసమర్థత, మార్గదర్శనం మరియు కౌన్సెలింగ్)](https://thecuriosi.com/ap-tet-2026/child-development-and-pedagogy/mental-health-adjustment-and-guidance/)

 Title

 [Easymart Wooden Learning Educational ABCD Board for Kids, Activit…](https://www.amazon.in/dp/B0FHPYXN44?tag=thecuriosi10b-21)

 [Wooden Learning Educational Game Board – ABCD Wooden Board for Ki…](https://www.amazon.in/dp/B0G53KJ941?tag=thecuriosi10b-21)

 [3 in 1 Wooden Puzzles for Toddlers | Educational Board Game ABCD …](https://www.amazon.in/dp/B0FQJS1PXC?tag=thecuriosi10b-21)

 [Yetli Wooden Educational Puzzle Set, ABC Letters, Numbers and Sha…](https://www.amazon.in/dp/B0DY1393GW?tag=thecuriosi10b-21)

 [Wooden Puzzle English Alphabet ABCD Children Knob Educational Boa…](https://www.amazon.in/dp/B09N6FCXG1?tag=thecuriosi10b-21)

 [M2K HUB® Wooden ABCD Alphabet Number Shape Explorative Puzzles To…](https://www.amazon.in/dp/B0F6TNLKGM?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Easymart Wooden Learning Educational ABCD Board for Kids, Activity Toys for Toddlers & Preschoolers | ABCD Puzzle Set | Puzzle Toys for 2 Years Old Boys & Girls (Alphabets, Numbers & Shapes)⌉](https://www.amazon.in/dp/B0FHPYXN44?tag=thecuriosi10b-21)

 [⌊Wooden Learning Educational Game Board – ABCD Wooden Board for Kids, Alphabet, Numbers & Shapes Puzzle Toy for 2+ Years⌉](https://www.amazon.in/dp/B0G53KJ941?tag=thecuriosi10b-21)

 [⌊3 in 1 Wooden Puzzles for Toddlers | Educational Board Game ABCD Alphabets, Numbers & Shapes Puzzles | Toddler Learning Puzzle Toys for Kids 1-3 Years Old | Early Education Gift for Kids⌉](https://www.amazon.in/dp/B0FQJS1PXC?tag=thecuriosi10b-21)

 [⌊Yetli Wooden Educational Puzzle Set, ABC Letters, Numbers and Shapes Board, Learning Toys for Toddlers 2+ Years⌉](https://www.amazon.in/dp/B0DY1393GW?tag=thecuriosi10b-21)

 [⌊Wooden Puzzle English Alphabet ABCD Children Knob Educational Board with Letters Blocks and Knobs Learning Puzzles for Baby Kids Years 2 and 3 Toy Design 2 Multicolor⌉](https://www.amazon.in/dp/B09N6FCXG1?tag=thecuriosi10b-21)

 [⌊M2K HUB® Wooden ABCD Alphabet Number Shape Explorative Puzzles Toddler Learning Puzzles,Educational Activity Boards Toys for Child Boys and Girls (2 Pack ABCD+1234)⌉](https://www.amazon.in/dp/B0F6TNLKGM?tag=thecuriosi10b-21)

 Price

 ₹129

 ₹238

 ₹299

 ₹228

 ₹122

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0FHPYXN44?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0G53KJ941?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0FQJS1PXC?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0DY1393GW?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B09N6FCXG1?tag=thecuriosi10b-21)

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0F6TNLKGM?tag=thecuriosi10b-21)

 Title

 [Easymart Wooden Learning Educational ABCD Board for Kids, Activit…](https://www.amazon.in/dp/B0FHPYXN44?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Easymart Wooden Learning Educational ABCD Board for Kids, Activity Toys for Toddlers & Preschoolers | ABCD Puzzle Set | Puzzle Toys for 2 Years Old Boys & Girls (Alphabets, Numbers & Shapes)⌉](https://www.amazon.in/dp/B0FHPYXN44?tag=thecuriosi10b-21)

 Price

 ₹129

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0FHPYXN44?tag=thecuriosi10b-21)

 Title

 [Wooden Learning Educational Game Board – ABCD Wooden Board for Ki…](https://www.amazon.in/dp/B0G53KJ941?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Wooden Learning Educational Game Board – ABCD Wooden Board for Kids, Alphabet, Numbers & Shapes Puzzle Toy for 2+ Years⌉](https://www.amazon.in/dp/B0G53KJ941?tag=thecuriosi10b-21)

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0G53KJ941?tag=thecuriosi10b-21)

 Title

 [3 in 1 Wooden Puzzles for Toddlers | Educational Board Game ABCD …](https://www.amazon.in/dp/B0FQJS1PXC?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊3 in 1 Wooden Puzzles for Toddlers | Educational Board Game ABCD Alphabets, Numbers & Shapes Puzzles | Toddler Learning Puzzle Toys for Kids 1-3 Years Old | Early Education Gift for Kids⌉](https://www.amazon.in/dp/B0FQJS1PXC?tag=thecuriosi10b-21)

 Price

 ₹238

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0FQJS1PXC?tag=thecuriosi10b-21)

 Title

 [Yetli Wooden Educational Puzzle Set, ABC Letters, Numbers and Sha…](https://www.amazon.in/dp/B0DY1393GW?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Yetli Wooden Educational Puzzle Set, ABC Letters, Numbers and Shapes Board, Learning Toys for Toddlers 2+ Years⌉](https://www.amazon.in/dp/B0DY1393GW?tag=thecuriosi10b-21)

 Price

 ₹299

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0DY1393GW?tag=thecuriosi10b-21)

 Title

 [Wooden Puzzle English Alphabet ABCD Children Knob Educational Boa…](https://www.amazon.in/dp/B09N6FCXG1?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊Wooden Puzzle English Alphabet ABCD Children Knob Educational Board with Letters Blocks and Knobs Learning Puzzles for Baby Kids Years 2 and 3 Toy Design 2 Multicolor⌉](https://www.amazon.in/dp/B09N6FCXG1?tag=thecuriosi10b-21)

 Price

 ₹228

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B09N6FCXG1?tag=thecuriosi10b-21)

 Title

 [M2K HUB® Wooden ABCD Alphabet Number Shape Explorative Puzzles To…](https://www.amazon.in/dp/B0F6TNLKGM?tag=thecuriosi10b-21)

 Thumbnail

 [⌊M2K HUB® Wooden ABCD Alphabet Number Shape Explorative Puzzles Toddler Learning Puzzles,Educational Activity Boards Toys for Child Boys and Girls (2 Pack ABCD+1234)⌉](https://www.amazon.in/dp/B0F6TNLKGM?tag=thecuriosi10b-21)

 Price

 ₹122

 More information

 [ Buy on Amazon](https://www.amazon.in/dp/B0F6TNLKGM?tag=thecuriosi10b-21)

Share this
