మూర్తిమత్వ మాపన పద్ధతులు: ప్రక్షేపక మరియు అప్రక్షేపక పరీక్షలు
వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివిధ మాపన పద్ధతులను అభివృద్ధి చేశారు. వీటిని ప్రధానంగా అప్రక్షేపక పద్ధతులు (Non-Projective Methods) మరియు ప్రక్షేపక పద్ధతులు (Projective Methods)అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు.
1. అప్రక్షేపక పద్ధతులు (Non-Projective Methods)
అప్రక్షేపక పద్ధతులలో వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను, తెలిసిన విషయాలను లేదా స్వయంగా వారు వెల్లడించే సమాచారాన్ని ప్రత్యక్షంగా అంచనా వేస్తారు. వీటిని రెండు విభాగాలుగా వర్గీకరిస్తారు:
అ) విషయనిష్ఠ / ఆత్మాశ్రయ పద్ధతులు (Subjective Methods):
- వ్యక్తిచరిత్ర అధ్యయనం (Case Study): వ్యక్తి గత చరిత్ర, కుటుంబ నేపథ్యం మరియు సమస్యల సమగ్ర అధ్యయనం.
- పరిపృచ్ఛ (Interview): ముఖాముఖి సంభాషణ ద్వారా సమాచారాన్ని సేకరించడం.
- ప్రశ్నావళి (Questionnaire) & స్వీయ చరిత్ర (Autobiography): వ్యక్తి తన గురించి రాతపూర్వకంగా ఇచ్చే సమాధానాల ఆధారంగా అంచనా వేయడం.
- పరిశీలనా పద్ధతి (Observation) & సంఘటన రచనలు (Anecdotal Records): వ్యక్తి ప్రవర్తనా రీతులను ప్రత్యక్షంగా గమనించడం.
ఆ) వస్తునిష్ఠ పద్ధతులు (Objective Methods):
- నిర్ధారణ మాపనులు (Rating Scales): వ్యక్తిలో ఉన్న ప్రత్యేక లక్షణాంశాల స్థాయిని ఇతరులు (పరిశీలకులు) అంచనా వేయడానికి ఇవి ఉపయోగపడతాయి.
- ప్రసిద్ధ మాపనులు: హాగర్టీ ఆల్సన్ విల్‌మన్ రేటింగ్ స్కేల్, విన్‌లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ఫేల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్, విటెన్ బర్నెస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్.
- నిర్ధారణ మాపనులలో దొర్లే దోషాలు: హలో ప్రభావం (Halo Effect) – పూర్వాభిప్రాయంతో అంచనా వేయడం; ఔదార్య దోషం (Generosity Error) – ఎక్కువ స్థాయిని గుర్తించడం; కేంద్రీయ ప్రవృత్తి దోషం (Central Tendency Error) – అతిగా లేదా తక్కువగా కాకుండా మధ్యస్థ స్థాయికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం.
- మూర్తిమత్వ శోధికలు / ఆవిష్కారికలు (Personality Inventories): వ్యక్తి తన లక్షణాంశాలను తనంతట తాను స్వీయ అంచనా వేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
- బెల్ అనుగుణ్యత శోధిక (Bell Adjustment Inventory): గృహ, ఆరోగ్య, ఉద్వేగ, వృత్తి మరియు సామాజిక సర్దుబాటు అనే 5 అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తుంది.
- మిన్నెసోటా మల్టీ ఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ (MMPI): హతేవే మరియు మెకిన్లీ రూపొందించారు. దీనిలో 550 ప్రశ్నలు ఉంటాయి. ఇది డిప్రెషన్, హిస్టీరియా, పారనోయా, స్కిజోఫ్రేనియా, సైకోపతిక్ డివియేషన్స్ వంటి 10 రకాల అంశాలను విశ్లేషిస్తుంది.
- సన్నివేశ / స్థితి పరీక్షలు (Situational Tests): ముందే రూపొందించిన కొన్ని సన్నివేశాల్లో వ్యక్తిని ఉంచి వారి నాయకత్వం, ధైర్యం, నిజాయితీ వంటి లక్షణాలను అంచనా వేస్తారు.
- ఉదాహరణలు: మే మరియు హార్ట్ షోర్న్ రూపొందించిన నిజాయితీ పరీక్ష, జె.ఎల్. మొరీనో రూపొందించిన సాంఘికమితి (Sociometry / Sociogram), OSS (Officers of Strategic Service) పరీక్ష, మరియు సైకోడ్రామా (మనోప్రక్షేపక నాటిక).
2. ప్రక్షేపక పద్ధతులు (Projective Methods)
- ఆవిర్భావం: ‘ప్రక్షేపణం’ (Projection) అనే పదాన్ని మొదట ప్రతిపాదించినది సిగ్మండ్ ఫ్రాయిడ్ కాగా, మూర్తిమత్వ మాపనంలో ప్రక్షేపక పరీక్షలను ఉపయోగించినది ఫ్రాంక్.
- పనిచేసే విధానం: ప్రక్షేపక పరీక్షల్లో వ్యక్తికి స్పష్టమైన ఆకారం లేని అస్పష్టమైన ఉద్దీపనలను (సిరా మరకలు, అస్పష్టమైన చిత్రాలు) అందిస్తారు. వ్యక్తి తనకు తెలియకుండానే తన అచేతనంలో దాగి ఉన్న తీరని కోరికలు, వైఖరులు, ఆందోళనలు, సంఘర్షణలను ఆ ఉద్దీపనలకు ఆపాదిస్తూ (ప్రక్షేపిస్తూ) వెల్లడిస్తాడు.
ప్రధాన ప్రక్షేపక పరీక్షలు:
- రోషాక్ సిరా మరకల పరీక్ష (Rorschach Inkblot Test):
- రూపొందించినవారు: హెర్మాన్ రోషాక్ (స్విట్జర్లాండ్).
- కార్డులు: మొత్తం 10 కార్డులు ఉంటాయి.
- 5 కార్డులు: నలుపు మరియు తెలుపు
- 2 కార్డులు: నలుపు మరియు ఎరుపు
- 3 కార్డులు: బహుళ వర్ణాలు (పలు రంగులు)
- ఉపయోగం: వయోజనుల అచేతన మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉద్దేశించబడింది.
- విశ్లేషణ: స్థానము (W, D, d, s), విషయము (H, A, Hd, Ad, N, O), నిర్ణయకాలు (C, K, F, M) మరియు మౌళికాంశాల ఆధారంగా వ్యాఖ్యానిస్తారు.
- ఇతివృత్త గ్రహణ నికష (Thematic Apperception Test – TAT):
- రూపొందించినవారు: హెన్రీ ముర్రే మరియు మోర్గాన్.
- కార్డులు: మొత్తం 30 చిత్రాల కార్డులు + 1 ఖాళీ కార్డు ఉంటాయి (పురుషులు లేదా స్త్రీలకు ప్రత్యేకంగా గరిష్టంగా 20 కార్డులు ఉపయోగిస్తాయి).
- పద్ధతి: బొమ్మలను చూసి కథ అల్లామని చెప్తారు. కథానాయకుడు, కథాసారాంశం మరియు పరిణామాల ద్వారా వ్యక్తి లోపలి నిగూఢ వైఖరులు, ప్రేరణలు, సంఘర్షణలను అంచనా వేస్తారు.
- పిల్లల అపర్‌సెప్షన్ టెస్ట్ (Children Apperception Test – CAT):
- రూపొందించినవారు: ఎల్. బెల్లాక్ మరియు ఎస్.ఎస్. బెల్లాక్.
- వయోపరిమితి: 3 నుండి 10 సంవత్సరాల పిల్లల కోసం ఉద్దేశించబడింది.
- కార్డులు: జంతువుల బొమ్మలు ఉన్న 10 కార్డులు ఉంటాయి.
- వాక్య పూరణ పరీక్షలు (Sentence Completion Tests):
- మొదటిసారి మూర్తిమత్వ ప్రక్షేపక పరీక్షగా ఉపయోగించినవారు పేనీ మరియు టెండ్లర్ (ఎబ్బింగ్‌హాస్ ప్రజ్ఞకు వాడగా, వీరు మూర్తిమత్వానికి వాడారు).
- అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయడం ద్వారా వ్యక్తి యొక్క విషమయోజనాన్ని, మానసిక వైఖరులను గ్రహిస్తారు. (ఉదా: The Rhode’s sentence completion test, The Rotter incomplete sentence blank).
- ఇతర ప్రక్షేపక పరీక్షలు:
- పద సంసర్గ పరీక్ష (Word Association Test): గాల్టన్ మొదట తయారు చేయగా, కెంట్ మరియు రోషన్ ఆఫ్ మూర్తిమత్వానికి ఉపయోగించారు.
- కథా పూరణ పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష మొదలైనవి.
Practice Time:
Related Pages: