The Curiosi.com

₹0.00 0 Cart
  • Maths TLMs (50+)
  • English Lab
  • APTET
  • Tools
    • Free Classroom Toolkit (14)
    • AP New DA Salary Calculator 2026
    • Age Calculator
    • CCE Marks Cal
    • Intl.Marks Cal
    • Ifsc Code Finder
    • Post Office Finder Pro
    • Timer
  • Quizzes
  • Puzzles
  • Resources
    • 100 తెలుగు చిన్నారి కథలు
    • AP Caste Directory
    • AP Govt Schemes
    • Exam Results
    • Edu Tools
    • Word Calendar
    • Games
    • Stories for Kids
    • తెలుగు భాష ప్రపంచం
    • Maabadi | E-Magazines
  • Shop
  • My account
    • Account details
    • Addresses
    • Downloads
    • Orders
    • About Us
    • Refund and Returns Policy
    • Contact Us
    • Terms and Conditions
  • Class 1
    • Telugu
      • 1. పడవ
      • 2. చందమామ
      • 3. మేలుకొలుపు
      • 4. ఉడత
  • Textbooks
  • Maths TLMs (50+)
  • English Lab
  • APTET
  • Tools
    • Free Classroom Toolkit (14)
    • AP New DA Salary Calculator 2026
    • Age Calculator
    • CCE Marks Cal
    • Intl.Marks Cal
    • Ifsc Code Finder
    • Post Office Finder Pro
    • Timer
  • Quizzes
  • Puzzles
  • Resources
    • 100 తెలుగు చిన్నారి కథలు
    • AP Caste Directory
    • AP Govt Schemes
    • Exam Results
    • Edu Tools
    • Word Calendar
    • Games
    • Stories for Kids
    • తెలుగు భాష ప్రపంచం
    • Maabadi | E-Magazines
  • Shop
  • My account
    • Account details
    • Addresses
    • Downloads
    • Orders
    • About Us
    • Refund and Returns Policy
    • Contact Us
    • Terms and Conditions
  • Class 1
    • Telugu
      • 1. పడవ
      • 2. చందమామ
      • 3. మేలుకొలుపు
      • 4. ఉడత
  • Textbooks

Explore Learning Categories

🔢 Math 🔤 English LAB 🧠 Quiz 🎯 Telugu 📘 Alphabet Words(A-Z) 🗓️ Word Calendar 📖 Stories 📅 CCE Marks 🎮 Games 📄 Worksheets 🏆 Results 🧩 Sudoku 📋 AP Caste Directory ⏳ Age Calculator 📚 Tables Book 🌍 Interactive World Map

Home » AP TET 2026 » Child Development And Pedagogy » Mental Health, Adjustment and Guidance

  • MAHENDRA MANCHIKALAPATI
  • September 15, 2026

Mental Health, Adjustment and Guidance

Mental Health, Adjustment and Guidance

Mental Health, Adjustment, Defence mechanisms, Conflicts, Frustration, Stress, Anxiety, Maladjustment, Guidance and counselling

మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, మరియు వర్తన విజ్ఞానం: సమగ్ర విశ్లేషణ

మానవ ప్రవర్తన మరియు మూర్తిమత్వ వికాసంలో మానసిక ఆరోగ్యం, సర్దుబాటు మరియు వాటికి సంబంధించిన వివిధ మానసిక ప్రక్రియలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. మారుతున్న పరిసరాలకు అనుగుణంగా మారడమే ప్రకృతి ధర్మం; అయితే ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినప్పుడు మానసిక మరియు శారీరక రుగ్మతలు ఏర్పడతాయి.


1. మానసిక ఆరోగ్యం (Mental Health)

మానసిక ఆరోగ్యం అనేది కేవలం శారీరక వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదు; వ్యక్తి తన సామర్థ్యాలను సక్రమంగా వినియోగించుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని గడపడం.

  • నిర్వచనం: బెర్నార్డ్ ప్రకారం, “వ్యక్తి తనకు తానుగా మొత్తం ప్రపంచంతో అనుగుణ్యత చెంది సమర్థవంతంగా, సంతృప్తికరంగా, సంతోషదాయకంగా సామాజిక అనుకూలమైన ప్రవర్తనను నెలకొల్పుకొని నిత్య జీవితంలోని పరిస్థితులను ఎదుర్కొని అంగీకరించడమే మానసిక ఆరోగ్యం”.
  • చారిత్రక నేపథ్యం: మానసిక అనారోగ్యానికి దెయ్యాలు, భూతాలు కారణం కాదని ఖండించి, చికిత్సలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త పీనెల్.
  • మానసిక ఆరోగ్య ఉద్యమం: ఈ ఉద్యమానికి మూలపురుషుడు క్లిఫ్ఫర్డ్ బీర్స్ (Clifford Beers). ఈయన 1908లో “A Mind That Found Itself” అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించారు. దీని ఫలితంగా 1909లో National Committee for Mental Health, 1930లో అంతర్జాతీయ మానసిక కాంగ్రెస్, మరియు 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), UNICEF లు స్థాపించబడి మానసిక ఆరోగ్యంపై విస్తృత కృషి చేశాయి.
  • మానసిక ఆరోగ్యంలో ప్రధాన అంశాలు:
    1. ధనాత్మక అంశం: సక్రమ మానసిక ఆరోగ్యానికి కావలసిన అనుకూల పరిస్థితులను నెలకొల్పుకోవడం.
    2. నిరోధించే అంశాలు: మానసిక అనారోగ్యం కలగకుండా అరికట్టే పద్ధతులను పాటించడం.
    3. రోగ నివారణ అంశం: అనారోగ్యానికి గురైన వారికి తగిన చికిత్స అందించడం.
  • మానసిక అనారోగ్య కారకాలు: ఇవి 2 రకాలు — దీర్ఘకాలికంగా బాధిస్తూ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రోత్సహించే కారకాలు (అభద్రతా భావం, న్యూనతా భావం), మరియు హఠాత్తుగా సంభవించే ప్రోగు చేసే కారకాలు (ఆర్థిక నష్టం, ప్రియమైన వారిని కోల్పోవడం).
  • లక్షణాలు: మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి శారీరక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత, ఆరోగ్యవంతమైన ఆత్మభావన, సామాజిక పరిపక్వత మరియు ఆశావాద జీవిత దృక్పథాన్ని కలిగి ఉంటాడు.

2. సర్దుబాటు (Adjustment)

గర్భస్థ శిశువు దశ నుండి మరణించే వరకు జీవితంలో సర్దుబాటు అనేది ఒక నిరంతర ప్రక్రియ.

  • నిర్వచనాలు:
    • గేట్స్ మరియు జెర్సిల్డ్ (1948): “తనకూ, తన పరిసరాలకూ మధ్య మరింత సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడం కోసం నిరంతరం తన ప్రవర్తనను మార్చుకోవడమే సర్దుబాటు”.
    • లారెన్స్ షాఫర్ (1961): “జీవి అవసరాలకూ, ఆ అవసరాలను సంతృప్తిపరచడాన్ని ప్రభావితం చేసే పరిస్థితులకు మధ్య సమతుల్యమే సర్దుబాటు”.
  • ఆటంకాలు (Obstacles): వ్యక్తి తన అవసరాలను తీర్చుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలు రెండు రకాలు:
    1. వ్యక్తిగత ఆటంకాలు: శారీరక లోపాలు (అంధత్వం, చెవుడు) లేదా మానసిక లోపాలు (తక్కువ ప్రజ్ఞ).
    2. పరిసర ఆటంకాలు: భౌతిక పరిసరాలు (కొండలు, ఎడారులు) లేదా సామాజిక పరిసరాలు (కట్టుబాట్లు, కుల మత అడ్డంకులు).

3. సంఘర్షణలు (Conflicts)

వ్యక్తి ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఎంచుకోవలసి వచ్చినప్పుడు మానసిక ఉద్రిక్తతకు గురవుతాడు.

  • నిర్వచనం: డగ్లస్ మరియు హాలండ్ ప్రకారం, “రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తణ్యత వల్ల కలిగే బాధాపూరితమైన ఉద్వేగస్థితియే సంఘర్షణ”.
  • కర్ట్ లెవిన్ వర్గీకరణ (4 రకాల సంఘర్షణలు):
    1. ఉపగమ – ఉపగమ (Approach – Approach): రెండు ఆకర్షణీయమైన లక్ష్యాలలో ఒకదానిని మాత్రమే ఎంచుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. (ఉదాహరణ: ఒకే సమయంలో చాక్లెట్ లేదా ఐస్‌క్రీమ్ లలో ఒకదాన్నే ఎంచుకోవడం).
    2. పరిహార – పరిహార (Avoidance – Avoidance): రెండు ఆకర్షణీయం కాని (అనిష్టమైన) పరిస్థితులలో ఒకదానిని తప్పనిసరిగా ఎంచుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. (ఉదాహరణ: ఇష్టం లేని ఉద్యోగంలో రీజాయిన్ కావడం లేదా ట్రాన్స్‌ఫర్ కావడం).
    3. ఉపగమ – పరిహార (Approach – Avoidance): ఒకే లక్ష్యం పట్ల ఒకే సమయంలో ఆకర్షణ మరియు వికర్షణ (భయం/సిగ్గు) రెండూ కలగడం. (ఉదాహరణ: చెట్టుపై ఉన్న జామపండు తినాలని ఆశ ఉన్నా, కింద పడతాననే భయం ఉండటం).
    4. ద్వి – ఉపగమ పరిహార (Double Approach – Avoidance): రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయమైన మరియు అనాకర్షణీయమైన అంశాలు ఉన్న లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవడం. (ఉదాహరణ: ఎక్కువ జీతం ఉండి ఎక్కువ దూరం ఉన్న ఉద్యోగం లేదా తక్కువ జీతం ఉండి దగ్గరగా ఉన్న ఉద్యోగం మధ్య ఎంపిక).

4. కుంఠనం (Frustration)

లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురై కోరికలు తీరనప్పుడు వ్యక్తిలో నాటుకుపోయే నిరాశ నిస్పృహల స్థితిని కుంఠనం అంటారు.

  • నిర్వచనాలు:
    • గుడ్: “మానవుని ఆశయం గానీ, అవసరం గానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కుంఠనం”.
    • కరోల్: “కుంఠనం అంటే వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం”.
  • కారణాలు: తమ సామర్థ్యానికి మించిన లక్ష్యాలను ఎంచుకోవడం, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సంబంధాలు నెలకొల్పుకోలేకపోవడం మరియు మారే పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం.
  • పర్యవసానాలు: తీవ్రమైన కుంఠనం వల్ల వ్యక్తి లక్ష్యాన్ని విరమించుకోవడం, శారీరక-మానసిక అనారోగ్యం పాలవడం, దాష్టీకానికి (Aggression) ఒడిగట్టడం, లేదా పగటికలలు (స్వైరకల్పనం) కనడం వంటి ప్రతికూల చర్యలకు పూనుకుంటారు.

5. ఒత్తిడి మరియు ఒత్తిడి నిర్వహణ (Stress & Stress Management)

ఆధునిక జీవనశైలిలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.

  • నిర్వచనం: ఒక సవాలుకు లేదా నూతన పరిస్థితికి వ్యక్తి శారీరకంగా, మానసికంగా స్పందించడమే ఒత్తిడి.
  • ఇస్త్రీ పెట్టె (Iron Box) ఉదాహరణ: బట్టల ముడతలు పోవడానికి ఇస్త్రీ పెట్టెకు తగినంత వేడి అవసరం; వేడి ఎక్కువైతే బట్టలు కాలుతాయి, తక్కువైతే ముడతలు పోవు. అదే విధంగా, వ్యక్తికి తగినంత (పరిమిత) ఒత్తిడి ఉంటేనే పనిలో ప్రేరణ పొంది రాణిస్తాడు; ఒత్తిడి అధికమైతే ఆలోచనా స్థబ్దత, జ్ఞాపకశక్తి క్షీణత మరియు చిరాకు కలుగుతాయి.
  • లక్షణాలు: తరచూ తలనొప్పి, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం మరియు బాధ్యతల నుండి తప్పుకోవడం.
  • ఒత్తిడి నిర్వహణ: శ్వాసక్రియ నియంత్రణ, యోగా, ధ్యానం, ప్రశాంత నిద్ర, సమయపాలన, వాస్తవిక దృక్పథం, మరియు ఉల్లాసకరమైన క్రీడలు లేదా సంగీతం ద్వారా ఒత్తిడిని సమర్థవంతంగా జయించవచ్చు.

6. ఆందోళన / వ్యాకులత (Anxiety)

ఒత్తిడి పర్యవసానంగా ఏర్పడే ప్రతికూల ప్రవర్తనా స్థితిని ఆందోళన లేదా వ్యాకులత అంటారు.

  • స్వభావం: “కారణరహితమైన భయం వల్ల ఏదో కీడు జరగబోతుందన్న ఊహలు పదే పదే రావడం వల్ల కలిగే మానసిక స్థితి”. (ఉదాహరణ: పరీక్షలంటే తీవ్రమైన భయంతో జ్వరం రావడం, వణుకు, లేదా చెమటలు పట్టే నికషా వ్యాకులత).
  • పరిష్కారం: విద్యార్థులకు కఠినమైన టార్గెట్లు విధించకుండా, వారిలో ఆత్మస్థైర్యం నింపడం, స్నేహపూర్వక వాతావరణం కల్పించడం మరియు నిరంతరం పరీక్షల భయాన్ని తొలగించడం ద్వారా ఆందోళనను నివారించవచ్చు.

7. రక్షక తంత్రాలు (Defense Mechanisms)

వ్యక్తికి జీవితంలో ఎదురయ్యే సంఘర్షణలు, కుంఠనాల వల్ల ఏర్పడే తీవ్రమైన మనో వ్యాకులతను (Anxiety) తగ్గించుకోవడానికి, తన అహాన్ని (Ego) కాపాడుకోవడానికి అచేతనంగా ఉపయోగించే ఆత్మవంచన ప్రక్రియలనే రక్షక తంత్రాలు (Defense Mechanisms) అంటారు. ఈ భావనను మొదటగా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రవేశపెట్టారు.

  • పరిణామ క్రమం: సంఘర్షణలు → కుంఠనాలు → ఒత్తిడి → మనో వ్యాకులత → విషమయోజనం → మానసిక రుగ్మత.
  • ప్రక్రియ: కుంఠనాల వల్ల కలిగే తీవ్ర మనో వ్యాకులతను తగ్గించుకోవడానికి వ్యక్తి అచేతనంగా ఉపయోగించే ఆత్మవంచన ప్రక్రియలే రక్షక తంత్రాలు.
  • ప్రధాన రక్షక తంత్రాలు:
  • 1. దమనం (Repression):
    • వివరణ: బాధాకరమైన విషయాలను, అపజయాలను లేదా అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మరచిపోవడానికి చేసే ప్రయత్నాన్ని దమనం అంటారు. దీనిని ‘ప్రేరేపిత విస్మృతి’ అని కూడా పిలుస్తారు.
    • ఉదాహరణ: బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందనే భయంతో చేసిన అప్పులను బలవంతంగా మరచిపోవడం.
  • 2. ప్రక్షేపణం (Projection):
    • వివరణ: వ్యక్తి తనలోని లోపాలను, అపజయాలను లేదా అసంతృప్తి భావాలను ఇతరులపైకి లేదా బాహ్య వస్తువులపైకి ఆపాదించడాన్ని ప్రక్షేపణం అంటారు.
    • ఉదాహరణ: పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి తన బాధ్యతారాహిత్యాన్ని ఒప్పుకోకుండా, ఉపాధ్యాయుడు సరిగ్గా బోధించకపోవడం వల్లే ఫెయిల్ అయ్యానని చెప్పడం.
  • 3. హేతుకీకరణం (Rationalization):
    • వివరణ: లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన వైఫల్యాన్ని సమాజం ఆమోదించే సప్రేతుకమైన, తప్పుడు కారణాలతో సమర్థించుకోవడాన్ని హేతుకీకరణం అంటారు.
    • ఉదాహరణ: నక్క తనకు దక్కని ద్రాక్షపళ్లను చూసి ‘అందని ద్రాక్ష పుల్లన’ అని తనకు తాను సరిపెట్టుకోవడం.
  • 4. విస్థాపనం (Displacement):
    • వివరణ: తన కోపాన్ని లేదా ఉద్వేగాన్ని మూల కారణమైన బలమైన వ్యక్తిపై చూపలేక వేరొక బలహీనమైన వ్యక్తిపై లేదా వస్తువుపై ప్రదర్శించడాన్ని విస్థాపనం అంటారు.
    • ఉదాహరణ: ఆఫీసర్‌పై ఉన్న కోపాన్ని గుమస్తా తన భార్యపై చూపించడం లేదా అత్తపై ఉన్న కోపాన్ని వస్తువులపై ప్రదర్శించడం.
  • 5. ప్రతిగమనం (Regression):
    • వివరణ: సమస్యలు ఎదురైనప్పుడు వయోజనుడిలా ఆలోచించి పరిష్కరించలేక, చిన్ననాటి శైశవ ప్రవర్తనా స్థితికి వెళ్లి పసిపిల్లల వలె ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు.
    • ఉదాహరణ: ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి ఆ పరిస్థితిని ఎదుర్కొనే బదులు పిల్లలవలె పట్టుకుని ఏడవడం.
  • 6. తదాతీకరణము (Identification):
    • వివరణ: వ్యక్తి తన మూర్తిమత్వంలో ఇతరుల ఆశయాలను లేదా విజయాలను చేర్చుకుని, వారు సాధించిన విజయాన్ని తానే సాధించినట్లుగా అనుభూతి చెందడాన్ని తదాతీకరణం అంటారు.
    • ఉదాహరణ: బస్సు కండక్టర్ కొడుకు కలెక్టర్ అయినప్పుడు, ఆ కండక్టర్ తానే గొప్ప విజయం సాధించినట్లు గర్వపడటం.
  • 7. పరిహారము (Compensation):
    • వివరణ: ఒక రంగంలో లేదా విషయంలో రాణించలేకపోయిన వ్యక్తి ప్రత్యామ్నాయంగా మరొక రంగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఆ లోపాన్ని భర్తీ చేసుకోవడాన్ని పరిహారము అంటారు.
    • ఉదాహరణ: చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటలలో విశేష ప్రతిభ కనబరిచి పేరు తెచ్చుకోవడం.
  • 8. ఉదాతీకరణం (Sublimation):
    • వివరణ: సమాజం ఆమోదించని ఉద్వేగాలను లేదా ఆలోచనలను సమాజానికి ఉపయోగపడే నిర్మాణాత్మకమైన, కళాత్మక క్రియల్లోకి మళ్లించడాన్ని ఉదాతీకరణం అంటారు.
    • ఉదాహరణ: ప్రేయసికి దూరమైన ప్రేమికుడు తన బాధను కవితలుగా రాస్తూ గొప్ప కవిగా లేదా చిత్రకారుడిగా మారడం.
  • 9. స్వైరకల్పనం (Fantasy):
    • వివరణ: నిజ జీవితంలో తీరని కోరికలను పగటికలలు (Day dreams) కనడం ద్వారా సంతృప్తిపరచుకోవడం.
  • 10. నిరాకరించుట (Denial):
    • వివరణ: సహించలేని చేదు వాస్తవాన్ని నిజం కాదని త్రోసిపుచ్చి తాత్కాలిక ఉపశమనాన్ని పొందడం.
    • ఉదాహరణ: భార్య మరణవార్త విన్న భర్త అది నిజం కాదని నమ్మకపోవడం.
  • 11. ఉపసంహరణ (Withdrawal):
    • వివరణ: అవమానం జరుగుతుందేమోననే భయంతో ఆయా పరిసరాలు లేదా సన్నివేశాల నుండి తప్పుకుని దూరంగా ఉండటం.
    • ఉదాహరణ: పేరంటానికి వెళ్తే అక్కడ అవమానం జరుగుతుందేమోనన్న భయంతో మహిళలు వెళ్లకుండా ఉండిపోవడం.
  • 12. ప్రేరక తారుమారు:
    • వివరణ: తనలోని నిజమైన భావానికి పూర్తిగా వ్యతిరేకమైన ప్రవర్తనను బయటకు ప్రదర్శించి ఉపశమనం పొందడం.
    • ఉదాహరణ: ఉపాధ్యాయుడు దండించిన తర్వాత లోపల తీవ్ర బాధ ఉన్నప్పటికీ బయటకు “నాకేమీ బాధగా లేదు” అని చెప్పడం.
  • మనో వ్యాకులతను తగ్గించుకోవడానికి రక్షక తంత్రాలు తాత్కాలికంగా సహాయపడినప్పటికీ, వాటిపై పదే పదే ఆధారపడితే వ్యక్తి సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోయి విషమయోజనానికి (Maladjustment) గురవుతాడు.

8. విషమయోజనం (Maladjustment)

పరిసరాలతో ఏమాత్రం సర్దుబాటు చేసుకోలేని ప్రతికూల స్థితిని విషమయోజనం అంటారు.

  • అట్కిన్సన్ నిర్వచనం: “ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరుచుకోవడాన్ని విషమయోజనం అంటారు”.
  • కారణాలు:
    1. వ్యక్తిగత కారకాలు: శారీరక ఆకృతి సరిగా లేకపోవడం, శారీరక బలహీనత, ఆత్మవిశ్వాస లోపం, మరియు తమ ప్రజ్ఞా సామర్థ్యాలకు మించిన ఆశయాలు ఏర్పరుచుకోవడం.
    2. పరిసర కారకాలు: కుటుంబంలో కఠినమైన నిబంధనలు, ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధాలు సరిగా లేకపోవడం, పాఠ్యప్రణాళిక భారం మరియు సామాజిక-సాంస్కృతిక విలువల్లో వ్యత్యాసాలు.
  • లక్షణాలు: ఆలోచనలు-చేతలకు పొంతన లేకపోవడం, తీవ్ర మనోవ్యాకులత, అవధాన లోపం, నిద్రలేమి, న్యూనతా భావాలు మరియు రక్షక తంత్రాలపై పదే పదే ఆధారపడటం.

9. మార్గదర్శకత్వం మరియు మంత్రణం (Guidance and Counselling)

విషమయోజనం మరియు మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను కాపాడటానికి పాఠశాలలు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు క్రింది చర్యలు తీసుకోవాలి:

  • సమగ్ర మార్గదర్శకత్వం: విద్యార్థుల సహజ సామర్థ్యాలు, అభిరుచులు మరియు ప్రజ్ఞను గుర్తించి వారికి తగిన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత మార్గదర్శకత్వాన్ని (Educational & Vocational Guidance) అందించాలి.
  • ప్రజాస్వామిక వాతావరణం: పాఠశాలలో నిరంకుశ లేదా దండనాపూరిత వాతావరణం లేకుండా, విద్యార్థుల సలహాలకు విలువ ఇచ్చే ప్రోత్సాహపూరిత ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాలి.
  • మంత్రణం (Counselling): తీవ్రమైన విషమయోజనం మరియు వ్యాకులత కలిగిన పిల్లలను ప్రత్యేకంగా గుర్తించి, నిపుణులైన కౌన్సెలర్ల ద్వారా భద్రతా భావాన్ని నెలకొల్పుతూ, సమస్యలను స్వతంత్రంగా పరిష్కరించుకునే నైపుణ్యాలను పెంపొందించాలి.

ముగింపు

వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసానికి మరియు సంతోషకరమైన జీవితానికి మానసిక ఆరోగ్యం అత్యంత ప్రధానమైనది. విద్యార్థులలో ఎదురయ్యే సంఘర్షణలు, ఒత్తిడులు మరియు ఆందోళనలను సమర్థవంతంగా అధిగమింపజేస్తూ, సరైన మార్గదర్శకత్వం ద్వారా వారిలో సమగ్ర లేదా సమైక్య మూర్తిమత్వాన్ని (Integrated Personality) వికసింపజేయడం ఉపాధ్యాయులు మరియు సమాజం యొక్క ప్రాథమిక బాధ్యత.


Practice Time:

ప్రశ్నల పట్టిక (Questions)

సమాధానం ఇచ్చినవి
దాటవేసినవి
చూడనివి
The Curiosi.com Magic Vault APTET/CTET – Mental Health, Adjustment and Guidance
00:00

Related Pages:

Observation, Interviews, Reflective Journals, Anecdotal records and Narratives, Introspection, Experimental method, Questionnaire, Case Study, Rating Scales, Longitudinal and Cross-Cultural Approaches, Action Research in Education
(పరిశీలన, ఇంటర్వ్యూలు, ప్రతిబింబిత జర్నల్స్, ఉదంతాల రికార్డులు మరియు కథనాలు, ఆత్మపరిశీలన, ప్రయోగాత్మక పద్ధతి, ప్రశ్నావళి, కేస్ స్టడీ, రేటింగ్ స్కేల్స్, దీర్ఘకాలిక మరియు బహుళ-సాంస్కృతిక విధానాలు, విద్యలో కార్యాచరణ పరిశోధన)

Title
LG Essential Series, 0.8 Ton 2 Star,New star rated, Smart Inverte…
Carrier 1.5 Ton 3 Star,New Star rated, Wi-Fi Smart Flexicool Inve…
Daikin 1.5 Ton 3 Star, New Star rated, Inverter Split AC (Copper,…
LG 1.5 Ton 5 Star,New star rated, DUAL Inverter Split AC (Copper,…
Thumbnail
LG Essential Series, 0.8 Ton 2 Star,New star rated, Smart Inverter Split AC (Copper, Convertible 6-in-1 Cooling, Faster Cooling & Energy Saving, HD Filter with AntiVirus Protection, AS-Q11KNVE, White)
Carrier 1.5 Ton 3 Star,New Star rated, Wi-Fi Smart Flexicool Inverter Split AC (Copper, Convertible 6-in-1 with Wi-Fi with Geo-Fencing, Smart Energy Display, ESTER EDGE Gxi WiFi-CAI18EE3R36W0, White)
Daikin 1.5 Ton 3 Star, New Star rated, Inverter Split AC (Copper, PM2.5 Filter, MTKL50XV16, White)
LG 1.5 Ton 5 Star,New star rated, DUAL Inverter Split AC (Copper, AI Convertible 6-in-1,VIRAAT Mode,Faster Cooling & Energy Saving,4 Way Swing, HD Filter with Anti-Virus Protection, US-Q19YNZE3,White)
Price
₹26,490
₹35,490
₹36,990
₹42,990
More information
Buy on Amazon
Buy on Amazon
Buy on Amazon
Buy on Amazon
Title
LG Essential Series, 0.8 Ton 2 Star,New star rated, Smart Inverte…
Thumbnail
LG Essential Series, 0.8 Ton 2 Star,New star rated, Smart Inverter Split AC (Copper, Convertible 6-in-1 Cooling, Faster Cooling & Energy Saving, HD Filter with AntiVirus Protection, AS-Q11KNVE, White)
Price
₹26,490
More information
Buy on Amazon
Title
Carrier 1.5 Ton 3 Star,New Star rated, Wi-Fi Smart Flexicool Inve…
Thumbnail
Carrier 1.5 Ton 3 Star,New Star rated, Wi-Fi Smart Flexicool Inverter Split AC (Copper, Convertible 6-in-1 with Wi-Fi with Geo-Fencing, Smart Energy Display, ESTER EDGE Gxi WiFi-CAI18EE3R36W0, White)
Price
₹35,490
More information
Buy on Amazon
Title
Daikin 1.5 Ton 3 Star, New Star rated, Inverter Split AC (Copper,…
Thumbnail
Daikin 1.5 Ton 3 Star, New Star rated, Inverter Split AC (Copper, PM2.5 Filter, MTKL50XV16, White)
Price
₹36,990
More information
Buy on Amazon
Title
LG 1.5 Ton 5 Star,New star rated, DUAL Inverter Split AC (Copper,…
Thumbnail
LG 1.5 Ton 5 Star,New star rated, DUAL Inverter Split AC (Copper, AI Convertible 6-in-1,VIRAAT Mode,Faster Cooling & Energy Saving,4 Way Swing, HD Filter with Anti-Virus Protection, US-Q19YNZE3,White)
Price
₹42,990
More information
Buy on Amazon
Share this
PrevPreviousAssessment of Personality – Projective and non-projective techniques
Assessment of Personality

Assessment of Personality – Projective and non-projective techniques

15/09/2026 No Comments
Read More »
Theories of Personality

Theories of Personality (మూర్తిమత్వ సిద్ధాంతాలు)

15/09/2026 No Comments
Read More »
Factors influencing personality

Factors influencing personality, Physical and Socio-cultural factors

15/09/2026 No Comments
Read More »
Personality

Meaning, Definition, Characteristics and Elements of Personality

14/09/2026 No Comments
Read More »
ఉడత

4. ఉడత ఉడత హూచ్ పాఠం – తెలుగు | TLM | APSCERT | Udatha Udatha hooch | Class 1 | Udatha

14/09/2026 No Comments
Read More »

AP D.El.Ed, D.Ed & B.Ed Textbooks PDF Download 2026–27

13/09/2026 No Comments
Read More »

Cognition and Cognitive Development Practice MCQs

13/09/2026 No Comments
Read More »
Experiential Learning

అనుభవపూర్వక అభ్యాసం (Experiential Learning)

13/09/2026 No Comments
Read More »
Childrens Thoughts

Children’s Thoughts and Conceptual Structure – Comprehensive Educational Report

13/09/2026 No Comments
Read More »
Climate change

Chapter 2 Climate Change Quiz | Class 5 EVS MCQ

13/09/2026 No Comments
Read More »
Republic Day quiz

Join the No: 1 Fun: Republic Day Quiz and Win a Free Gift!

17/01/2026 No Comments
Read More »
Illustration showing Republic Day speech ideas for LKG to Class 5 with students speaking, Dr. B. R. Ambedkar, and the Constitution of India

Powerful Republic Day Speech Ideas

13/01/2026 No Comments
Read More »

Where Are We

06/03/2025 No Comments
Read More »

Earth to Space

05/03/2025 No Comments
Read More »

The Journey of India for Freedom | Class 5 | Evs Textbook | Solutions

04/03/2025 No Comments
Read More »

Follow Us

Facebook Youtube Whatsapp

Contact Information

  • Phone: +91 9493580270
  • mail: mahi.mkpati@gmail.com
  • Address: Nellore, AP, India 524002
arrow

© The Curiosi.com. All Rights Reserved.

All content, including text, images, worksheets, games, and digital tools, is the property of The Curiosi.com and is protected by applicable copyright laws. Unauthorized use or reproduction is strictly prohibited.