The Curiosi.com

₹0.00 0 Cart
  • Digital TLM +
  • English Lab
  • APTET
  • Tools
    • AP New DA Salary Calculator 2026
    • Age Calculator
    • CCE Marks Cal
    • Intl.Marks Cal
    • Ifsc Code Finder
    • Post Office Finder Pro
    • Timer
  • Resources
    • 100 తెలుగు చిన్నారి కథలు
    • Quizzes
    • AP Caste Directory
    • AP Govt Schemes
    • Exam Results
    • Edu Tools
    • Word Calendar
    • Games
    • Stories for Kids
    • తెలుగు భాష ప్రపంచం
    • Maabadi | E-Magazines
  • Shop
  • My account
    • Account details
    • Addresses
    • Downloads
    • Orders
    • About Us
    • Refund and Returns Policy
    • Contact Us
    • Terms and Conditions
  • Class 1
    • Telugu
      • 1. పడవ పాఠం – తెలుగు | TLM | APSCERT | PADAVA
      • 2. చందమామ పాఠం – తెలుగు | TLM | APSCERT | Chandamama | panasa | పనస
      • 3. మేలుకొలుపు పాఠం – తెలుగు | TLM | APSCERT | Melukolupu | గంప
  • Textbooks
  • Digital TLM +
  • English Lab
  • APTET
  • Tools
    • AP New DA Salary Calculator 2026
    • Age Calculator
    • CCE Marks Cal
    • Intl.Marks Cal
    • Ifsc Code Finder
    • Post Office Finder Pro
    • Timer
  • Resources
    • 100 తెలుగు చిన్నారి కథలు
    • Quizzes
    • AP Caste Directory
    • AP Govt Schemes
    • Exam Results
    • Edu Tools
    • Word Calendar
    • Games
    • Stories for Kids
    • తెలుగు భాష ప్రపంచం
    • Maabadi | E-Magazines
  • Shop
  • My account
    • Account details
    • Addresses
    • Downloads
    • Orders
    • About Us
    • Refund and Returns Policy
    • Contact Us
    • Terms and Conditions
  • Class 1
    • Telugu
      • 1. పడవ పాఠం – తెలుగు | TLM | APSCERT | PADAVA
      • 2. చందమామ పాఠం – తెలుగు | TLM | APSCERT | Chandamama | panasa | పనస
      • 3. మేలుకొలుపు పాఠం – తెలుగు | TLM | APSCERT | Melukolupu | గంప
  • Textbooks

Explore Learning Categories

🔢 Math 🔤 English LAB 🧠 Quiz 🎯 Telugu 📘 Alphabet Words(A-Z) 🗓️ Word Calendar 📖 Stories 📅 CCE Marks 🎮 Games 📄 Worksheets 🏆 Results 🧩 Sudoku 📋 AP Caste Directory ⏳ Age Calculator 📚 Tables Book 🌍 Interactive World Map

Home » తెలుగు భాష ప్రపంచం » 100 తెలుగు చిన్నారి కథలు

  • MAHENDRA MANCHIKALAPATI
  • June 2, 2026

100 తెలుగు చిన్నారి కథలు

100 చిన్నారి కథలు

తెలుగు/ఇంగ్లీష్  భాషపై ప్రేమను పెంపొందిస్తూ, విద్యార్థుల పఠన నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన వెబ్ పేజ్  “100 చిన్నారి కథలు”.

ఈ వెబ్ పేజ్ లో చిన్నారుల ఆసక్తిని కలిగించే విధంగా జంతువులు, పక్షులు, ప్రకృతి, పండుగలు, కుటుంబం, పాఠశాల మరియు దైనందిన జీవితానికి సంబంధించిన 100 సరళమైన పేరాగ్రాఫ్ లు ఉన్నాయి. ప్రతి పాఠం విద్యార్థులు సులభంగా చదవగలిగేలా, అర్థం చేసుకోగలిగేలా మరియు క్రమంగా పఠన వేగాన్ని పెంచుకునేలా రూపొందించబడింది. వీటికి దిగువన స్పష్టమైన mp3 Audio ను కూడా జోడించడం జరిగింది. 

ఈ వెబ్ పేజ్ ద్వారా విద్యార్థులు స్పష్టమైన ఉచ్చారణ, పదజాలం, పఠన వేగం మరియు అవగాహన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు తరగతి గదిలో, తల్లిదండ్రులు ఇంటి వద్ద, అలాగే హోమ్‌స్కూలింగ్ మరియు TaRL కార్యక్రమాల్లో ఈ వెబ్ పేజ్ ని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ కొద్దిసేపు పఠనం చేయడం ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవడం నేర్చుకొని, భాషపై బలమైన పట్టు సాధిస్తారు.

🎯 అభ్యసన ఫలితాలు

ఈ వెబ్‌పేజీని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా, విద్యార్థులు:

  • తెలుగు/ఇంగ్లీష్ చదవడంలో అనర్గళతను మెరుగుపరచుకోగలరు.
  • ఉచ్చారణ మరియు పదజాలాన్ని పెంపొందించుకోగలరు.
  • పఠన గ్రహణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలరు.
  • మౌఖిక పఠనంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలరు.
  • ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యాలను పటిష్టం చేసుకోగలరు.

📊 📊 సూచించబడిన పఠన దినచర్య (రోజుకు 10–15 నిమిషాలు)

కార్యకలాపం

సమయం

ఉపాధ్యాయునిచే నమూనా పఠనం

2 నిమిషాలు

విద్యార్థుల మౌఖిక పఠనం

5 నిమిషాలు

పదజాల చర్చ

3 నిమిషాలు

అవగాహన ప్రశ్నలు

3 నిమిషాలు

పునరావృత పఠనం

2 నిమిషాలు

⭐ ఉత్తమ పద్ధతులు

  • సహాయక పఠన వాతావరణాన్ని సృష్టించండి.
  • విద్యార్థులను తప్పులు చేయడానికి మరియు వాటి నుండి నేర్చుకోవడానికి అనుమతించండి.
  • ప్రతిరోజూ చదివే అలవాట్లను ప్రోత్సహించండి.
  • పాఠ్యాంశాలను ఆసక్తికరంగా చేయడానికి భావవ్యక్తీకరణ పఠనాన్ని ఉపయోగించండి.
  • విద్యార్థులు మెరుగుపడిన కొద్దీ, పఠన కష్టతరాన్ని క్రమంగా పెంచండి.

“📖ప్రతి రోజు కొద్దిగా చదవండి – ప్రతి రోజు కొద్దిగా ఎదగండి!” ✨

ఈ కథలను ఇంగ్లీష్ లో కూడా చదవండి

ప్రియమైన వినియోగదారులారా, మీరు The Curiosi.com లోని ఈ తెలుగు చిన్నారి కథలను ఇంగ్లీష్ లో కూడా చదవవచ్చు. గూగుల్ అనువాద ఫీచర్ ను ఉపయోగించి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి అనువదించుకోండి.

Google అనువాద ఫీచర్ తో ఇంగ్లీష్ లో చదవండి

Part 1

  • 1. మా పాఠశాల
  • 2. నా స్నేహితుడు
  • 3. చెట్లు
  • 4. ఆవు
  • 5. వర్షం

1. మా పాఠశాల

మా పాఠశాల చాలా అందంగా ఉంటుంది. పాఠశాలలో పెద్ద మైదానం ఉంది. మేము అక్కడ ఆటలు ఆడుతాము.
మా గురువుగారు మాకు మంచి విషయాలు నేర్పుతారు. నాకు మా పాఠశాల అంటే చాలా ఇష్టం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/మా-పాఠశాల.mp3

ప్రశ్నలు:

  • పాఠశాల ఎలా ఉంది?
  • పిల్లలు ఏమి చేస్తున్నారు?

పదజాలం: 

పాఠశాల, చాలా,  అందం, పెద్ద మైదానం, ఆటలు, అక్కడ, మంచి విషయాలు, గురువుగారు, నేర్పుతారు, ఇష్టం

2. నా స్నేహితుడు

నా స్నేహితుడు రాము. అతను చాలా మంచివాడు. మేము కలిసి చదువుకుంటాము.
కలిసి ఆటలు ఆడుతాము. అతను అందరికీ సహాయం చేస్తాడు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/నా-స్నేహితుడు.mp3

ప్రశ్నలు:

  • రాము ఎలాంటివాడు?
  • నీకు ఇష్టమైన ఆట ఏది?

పదజాలం: 

స్నేహితుడు, రాము, అతను, మంచివాడు, మేము, కలిసి, ఆటలు, అందరికీ, సహాయం, చేస్తాడు

3. చెట్లు

చెట్లు మనకు చాలా ఉపయోగపడతాయి. అవి మనకు నీడ ఇస్తాయి. పండ్లు మరియు పూలు ఇస్తాయి.

చెట్లు గాలిని శుభ్రం చేస్తాయి. మనం ఎక్కువ చెట్లు నాటాలి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/చెట్లు.mp3

ప్రశ్నలు:

  • చెట్ల వల్ల ఉపయోగం ఏమిటి?
  • మనం ఏమి చేయాలి?

పదజాలం: 

చెట్లు, ఉపయోగపడతాయి,  నీడ, పండ్లు, పూలు, ఇస్తాయి, గాలి,  శుభ్రం, చేస్తాయి, నాటాలి.

4. ఆవు

ఆవు ఒక పెంపుడు జంతువు. అది గడ్డి తింటుంది. ఆవు మనకు పాలు ఇస్తుంది.

పాలతో పెరుగు మరియు వెన్న తయారు చేస్తారు. ఆవు చాలా ఉపయోగకరమైన జంతువు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/ఆవు.mp3

ప్రశ్నలు:

  • ఆవు వల్ల ఉపయోగం ఏమిటి?
  • పాలతో ఏమేమి తయారు చేయగలం?

పదజాలం: 

ఆవు, పెంపుడు జంతువు,  గడ్డి, తింటుంది,  ఇస్తుంది, పాలు, పెరుగు, వెన్న, తయారు చేస్తారు, ఉపయోగకరమైన

5. వర్షం

వర్షం పడితే భూమి చల్లబడుతుంది. చెట్లు మరియు మొక్కలు బాగా పెరుగుతాయి. రైతులు సంతోషంగా ఉంటారు.

పిల్లలు వర్షంలో ఆడుకోవడానికి ఇష్టపడతారు. వర్షం మనకు చాలా అవసరం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/వర్షం.mp3

ప్రశ్నలు:

  • వర్షం వల్ల ఉపయోగం ఏమిటి?
  • మీకు వర్షంలో ఆడుకోవడం ఇష్టమా? 

పదజాలం: 

వర్షం, భూమి, చల్లబడుతుంది. చెట్లు,  మొక్కలు, రైతులు, సంతోషం, పిల్లలు, ఆడుకోవడానికి, ఇష్టపడతారు

Part 2

  • 6. పుస్తకాలు
  • 7. సీతాకోకచిలుకలు
  • 8. మా తోట
  • 9. సూర్యుడు
  • 10. చంద్రుడు

6. పుస్తకాలు

పుస్తకాలు మనకు మంచి స్నేహితులు. వాటి ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటాము.
ప్రతిరోజూ కొంత సమయం పుస్తకాలు చదవాలి.
పుస్తకాలు జ్ఞానాన్ని పెంచుతాయి. వాటిని జాగ్రత్తగా ఉంచాలి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/పుస్తకాలు.mp3

ప్రశ్నలు:

  • పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఏమిటి?
  • నీకు ఇష్టమైన పుస్తకం ఏది ?

పదజాలం:

పుస్తకాలు, స్నేహితులు, కొత్త విషయాలు నేర్చుకుంటాము, ప్రతిరోజూ, కొంత, సమయం, జ్ఞానం, పెంచుతాయి, జాగ్రత్త

7. సీతాకోకచిలుకలు

సీతాకోకచిలుకలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. రంగురంగుల రెక్కలతో మెరిసిపోయే ఈ జీవులు పూల మీద వాలడం,
వాటి నుండి తేనెను సేకరించడం చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది.
పిల్లలు వీటిని ఎంతో ఇష్టపడతారు కాబట్టి, మనం వాటిని ఎప్పుడూ ప్రేమగా చూసుకోవాలి. వాటికి ఏ విధమైన హానీ తలపెట్టకూడదు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/సీతాకోకచిలుకలు.mp3

ప్రశ్నలు:

  • సీతాకోకచిలుకలు ఎక్కడ వాలుతాయి, అవి ఏం చేస్తాయి?
  • సీతాకోకచిలుకలను మనం ఎలా చూసుకోవాలి?

పదజాలం: 

సీతాకోకచిలుకలు, అత్యంత, ఆకర్షణీయం, రంగురంగుల, రెక్కలు, తేనె, సేకరించడం, ముచ్చటగా, ప్రేమ, హానీ 

8. మా తోట

మా ఇంటి ముందు చిన్న తోట ఉంది. అందులో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి.
నేను ప్రతిరోజూ ఆ మొక్కలకు నీళ్లు పోస్తాను.
పూలు వికసిస్తే చాలా అందంగా కనిపిస్తాయి.
తోటపని చేయడం నాకు ఎంతో ఇష్టం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Untitled-video.mp3

ప్రశ్నలు:

  • తోటలో పూలు వికసించినప్పుడు ఎలా కనిపిస్తాయి?
  • తోటలోని మొక్కల విషయంలో మీరు రోజూ చేసే పని ఏమిటి?

పదజాలం: 

ముందు, చిన్న తోట, పూల మొక్కలు, నేను, ప్రతిరోజూ, నీళ్లు, పోస్తాను, కనిపిస్తాయి. తోటపని, ఎంతో ఇష్టం.

9. సూర్యుడు

సూర్యుడు ఉదయం తూర్పున ఉదయిస్తాడు. అతను మనకు వెలుతురు ఇస్తాడు.
సూర్యుని వల్ల మొక్కలు పెరుగుతాయి.
పగటిపూట మనం పనులు చేసుకోవచ్చు.
సూర్యుడు ప్రకృతికి ఎంతో అవసరం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Sun.mp3

ప్రశ్నలు:

  • సూర్యుడు ఏ దిశలో ఉదయిస్తాడు?
  • మొక్కలు పెరగడానికి మరియు మన పనులు చేసుకోవడానికి సూర్యుడు ఎలా సహాయపడతాడు?

పదజాలం: 

సూర్యుడు, ఉదయం, తూర్పున, ఉదయిస్తాడు, వెలుతురు, మొక్కలు, పెరుగుతాయి, పగటిపూట, పనులు, ప్రకృతి

10. చంద్రుడు

చంద్రుడు రాత్రి ఆకాశంలో కనిపిస్తాడు. అతను తెల్లగా మెరిసిపోతాడు. పిల్లలు చంద్రుడిని చూడటానికి ఇష్టపడతారు.
పౌర్ణమి రోజున చంద్రుడు చాలా అందంగా ఉంటాడు. చంద్రుని వెలుగు మనసుకు ఆనందాన్ని ఇస్తుంది.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/moon.mp3

ప్రశ్నలు:

  • చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు, అతను ఎలా మెరిసిపోతాడు?
  • పౌర్ణమి రోజున చంద్రుడు ఎలా కనిపిస్తాడు?

పదజాలం: 

చంద్రుడు, రాత్రి, ఆకాశంలో, కనిపిస్తాడు, తెల్లగా, మెరిసిపోతాడు, పిల్లలు, పౌర్ణమి, అందంగా, ఆనందాన్ని

Part 3

  • 11. నీరు
  • 12. పండ్లు
  • 13. పక్షులు
  • 14. రైతు
  • 15. నా కుటుంబం

11. నీరు

మనుషులు, జంతువులకు నీరు ఎంతో అవసరం. మనం రోజూ తగినంత నీటిని తీసుకోవాలి.
శుభ్రత కోసం మరియు స్నానం చేయడానికి నీటిని ఉపయోగిస్తాము. చెట్లు, మొక్కలు పెరగడానికి నీరు చాలా ముఖ్యం.
అట్టి విలువైన నీటిని మనం ఎప్పుడూ వృథా చేయకూడదు
.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Wtaer-importance.mp3

ప్రశ్నలు:

  • జీవులకు అత్యంత అవసరమైనది ఏమిటి?
  • మనం నీటి విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి?

పదజాలం:

నీరు, జీవులకు, అవసరం, ప్రతిరోజూ, తాగాలి, స్నానం, మొక్కలకు, వృథా, చేయకూడదు, చేస్తాము

12. పండ్లు

మనం పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
మామిడి, జామ మరియు అరటి పండ్లు శరీరానికి బలాన్నిస్తాయి.
పండ్లలో పోషక విలువలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.
కాబట్టి, ప్రతిరోజూ పండ్లను తినే మంచి అలవాటును అలవర్చుకోవాలి.
ఇవి మన శరీరాన్ని ఎల్లప్పుడూ చురుకుగా ఉంచుతాయి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Importance-of-Fruits.mp3

ప్రశ్నలు:

  • ఏవైనా నాలుగు పండ్ల పేర్లు చెప్పండి.
  • పండ్లలో మన శరీరానికి అవసరమైన ఏముంటాయి?

పదజాలం: 

పండ్లు, ఆరోగ్యానికి, మంచివి, మామిడి, అరటి, జామ, విటమిన్లు, ప్రతిరోజూ, తినాలి, శరీరాన్ని

13. పక్షులు

పక్షులు ఆకాశంలో ఎంతో ఎత్తుగా ఎగురుతాయి. వాటికి అందమైన రెక్కలు ఉంటాయి.
కొన్ని పక్షులు మిక్కిలి మధురంగా పాడుతాయి. పక్షులు తమ నివాసం కోసం గూళ్లు కట్టుకుంటాయి.
ఇవి ప్రకృతిని మరింత అందంగా మారుస్తాయి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/07/Birds-Imp.mp3

ప్రశ్నలు:

  • పక్షులు ఎక్కడ ఎగురుతాయి మరియు వాటికి ప్రత్యేకంగా ఏముంటాయి?
  • పక్షులు ప్రకృతిని ఎలా మారుస్తాయి?

పదజాలం: 

పక్షులు, ఆకాశంలో, ఎగురుతాయి, రెక్కలు, మధురంగా, పాడుతాయి, గూళ్లు, కట్టుకుంటాయి, ప్రకృతిని, అందంగా

14. రైతు

రైతు మనందరి ఆకలి తీర్చేందుకు నిరంతరం శ్రమిస్తాడు. అతను ప్రతిరోజూ పొలంలో ఎంతో కష్టపడి తన విధులను నిర్వహిస్తాడు.
భూమిలో విత్తనాలు నాటి, పంటలు పండించి మనకు ఆహారాన్ని అందిస్తాడు.
రైతు దేశాభివృద్ధికి మిక్కిలి ముఖ్యమైన వెన్నెముక వంటివాడు. అటువంటి రైతులను మనం ఎల్లప్పుడూ గౌరవించాలి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/07/Farmer-Imp.mp3

ప్రశ్నలు:

  • రైతు మనకు ఏమి పండిస్తాడు?
  • మనం రైతులను ఎందుకు గౌరవించాలి?

పదజాలం: 

రైతు, అన్నం, పండిస్తాడు, పొలంలో, కష్టపడి, విత్తనాలు, పంటలను, దేశానికి, వెన్నెముక, గౌరవించాలి

15. నా కుటుంబం

నా పేరు మాధురి. మా కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. అమ్మ, నాన్న, అక్క మరియు నేను.
మేమంతా కలిసి ఉంటాము. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటాము.
నాకు మా కుటుంబం అంటే ఎంతో ఇష్టం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/07/Our-Family.mp3

ప్రశ్నలు:

  • మాధురి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?
  • కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఎలా ఉంటారు?

పదజాలం: 

కుటుంబంలో, నలుగురు, సభ్యులు, అమ్మ, నాన్న, అక్క, కలిసి, సహాయం, చేసుకుంటాము, ఇష్టం

Part 4

  • 16. పాఠాలు
  • 17. పరిశుభ్రత
  • 18. ఆటలు
  • 19. గ్రంథాలయం
  • 20. జాతీయ జెండా

16. పాఠాలు

ప్రతిరోజూ పాఠాలు చదవడం మిక్కిలి ఉత్తమమైన అలవాటు. క్రమం తప్పకుండా నిర్ణీత సమయానికి విద్యనభ్యసించాలి.
మన గురువుగారు బోధించే విషయాలను ఎంతో శ్రద్ధగా వినాలి. చదువు ద్వారా మనలో జ్ఞానం నిరంతరం పెరుగుతుంది.
విద్య మన భవిష్యత్తును ఎంతో ప్రకాశవంతంగా మారుస్తుంది.

https://thecuriosi.com/wp-content/uploads/2026/07/Lessons-IMP.mp3

ప్రశ్నలు:

  • మనం ప్రతిరోజూ ఎలా చదవాలి మరియు ఎవరి మాటలు వినాలి?
  • చదువు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పదజాలం:

పాఠాలు, చదవడం, అలవాటు, ప్రతిరోజూ, సమయానికి, టీచర్, జ్ఞానం, పెరుగుతుంది, భవిష్యత్తు, ప్రకాశవంతం

17. పరిశుభ్రత

పరిశుభ్రత పాటించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన నివాసాన్ని మరియు పాఠశాల ప్రాంగణాన్ని నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలి.
వ్యర్థాలను ఎల్లప్పుడూ చెత్తబుట్టలోనే వేయాలి. చేతులను తరచుగా శుభ్రపరుచుకోవాలి. పరిశుభ్రంగా ఉండటం ఒక మంచి అలవాటు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Cleanliness.mp3

ప్రశ్నలు:

  • ఆరోగ్యానికి మంచిది ఏమిటి?
  • మనం చెత్తను ఎక్కడ వేయాలి మరియు చేతులను ఎలా కడుక్కోవాలి?

పదజాలం: 

పరిశుభ్రత, ఆరోగ్యానికి, మంచిది, ఇల్లు, పాఠశాలను, శుభ్రంగా, చెత్తను, చెత్తబుట్టలో, చేతులను, అలవాటు

18. ఆటలు

ప్రతిరోజూ ఆటలు ఆడటం వల్ల మనం ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉంటాము.
క్రీడల ద్వారా మన శరీరం మిక్కిలి దృఢముగా మారుతుంది. స్నేహితులతో కలిసి ఆడుకోవడం వల్ల
మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆటలు మన జీవితంలో క్రమశిక్షణను పెంచుతాయి.
కాబట్టి, ప్రతిరోజూ కొంత సమయం ఆటల కోసం కేటాయించడం ఎంతో అవసరం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/07/games-imp.mp3

ప్రశ్నలు:

  • ఆటలు ఆడటం వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగం ఏమిటి?
  • ఆటలు మనకు ఏమి నేర్పుతాయి?

పదజాలం: 

ఆటలు, ఆరోగ్యానికి, మంచిది, శరీరం, దృఢంగా, స్నేహితులతో, ఆనందంగా, క్రమశిక్షణను, నేర్పుతాయి, ప్రతిరోజూ

19. గ్రంథాలయం

గ్రంథాలయంలో చాలా పుస్తకాలు ఉంటాయి. అక్కడ ప్రశాంతంగా చదువుకోవచ్చు.
పుస్తకాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. గ్రంథాలయాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. అది జ్ఞానానికి నిలయం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/The-Library.mp3

ప్రశ్నలు:

  • మనం గ్రంథాలయంలో పుస్తకాలను ఎలా చదువుకోవచ్చు?
  • గ్రంథాలయం దేనికి నిలయంగా ఉంటుంది?

పదజాలం: 

గ్రంథాలయంలో, పుస్తకాలు, ప్రశాంతంగా, చదువుకోవచ్చు, కొత్త, విషయాలు, తెలుసుకోవచ్చు, జాగ్రత్తగా, ఉపయోగించాలి, జ్ఞానానికి

20. జాతీయ జెండా

మన జాతీయ జెండా త్రివర్ణ పతాకం. ఇందులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి.
మధ్యలో అశోక చక్రం ఉంటుంది. జాతీయ జెండాను మనమందరం ఎల్లప్పుడూ గౌరవించాలి.
ఇది మన దేశాభివృద్ధికి మరియు గౌరవానికి చిహ్నం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/07/National-Flag.mp3

ప్రశ్నలు:

  • మన జాతీయ జెండాలో ఉన్న మూడు రంగులు ఏమిటి?
  • జాతీయ జెండా మధ్యలో ఏముంటుంది?

పదజాలం: 

జాతీయ, జెండా, త్రివర్ణ, పతాకం, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, అశోక, చక్రం, గౌరవానికి

Part 5

  • 21. బడి గంట
  • 22. కుక్క
  • 23. తోటలో పూలు
  • 24. బస్సు ప్రయాణం
  • 25. పండుగ

21. బడి గంట

నా పేరు రమ్య. నేను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాను. బడి గంట గణగణ మోగింది.
విద్యార్థులందరూ ఎంతో క్రమశిక్షణతో ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం అందరూ తమ తరగతి గదులకు వెళ్లారు.
మా టీచరుగారు నేడు ఒక మంచి పాఠాన్ని బోధించారు. విద్యార్థులందరూ ఆ విషయాలను మిక్కిలి శ్రద్ధతో ఆలకించారు.
పాఠము ముగిసిన తర్వాత మేమంతా కలిసి ఆటస్థలంలో ఎంతో ఉత్సాహంగా ఆడుకున్నాము.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/School-bell.mp3

ప్రశ్నలు:

  • బడి గంట మోగిన తర్వాత విద్యార్థులు ఎలా తరగతి గదిలోకి చేరుకున్నారు?
  • పాఠం పూర్తయిన తర్వాత పిల్లలు ఎక్కడ, ఎలా ఆడుకున్నారు?

పదజాలం:

ఉదయపు, గంట, విద్యార్థులు, క్రమశిక్షణతో, తరగతి, గదిలోకి, బోధించారు, శ్రద్ధగా, మైదానంలో, ఆనందంగా

22. కుక్క

కుక్క ఎంతో విశ్వాసం కలిగిన జంతువు. ఇది మన ఇంటికి రక్షణగా ఉంటుంది.
కుక్కకు నాలుగు కాళ్లు ఉండి, చాలా వేగంగా పరుగెత్తగలదు.
చాలామంది తమ ఇళ్లలో కుక్కలను ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Dog.mp3

ప్రశ్నలు:

  • కుక్కకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది?
  • కుక్కలకు ఎన్ని కాళ్లు ఉంటాయి, అవి ఎలా పరుగెత్తగలవు?

పదజాలం: 

కుక్క, విశ్వాసం, జంతువు, రక్షణగా, నాలుగు, కాళ్లు, వేగంగా, పరుగెత్తగలదు, ఇష్టంగా, పెంచుకుంటారు

23. తోటలో పూలు

మా తోటలో ఎన్నో పూలు ఉన్నాయి. గులాబీలు చాలా అందంగా ఉన్నాయి. పూలపై సీతాకోకచిలుకలు వాలుతున్నాయి.
తోట అంతటా ఆహ్లాదకరమైన సుగంధము వ్యాపించియున్నది.
సందర్శకులందరూ మా తోట యొక్క సౌందర్యమును విశేషముగా ప్రశంసించుచున్నారు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Flower-Garden.mp3

ప్రశ్నలు:

  • తోటలో ఉన్న పూలపై ఏవి వాలుతున్నాయి?
  • తోటను చూసిన సందర్శకులు ఏమి చేస్తున్నారు?

పదజాలం: 

తోట, పూలు, గులాబీలు, అందంగా, సీతాకోకచిలుకలు, వాలుతున్నాయి, ఆహ్లాదకరమైన, సుగంధము, సందర్శకులు, సౌందర్యము

24. బస్సు ప్రయాణం

మేము బస్సులో గ్రామానికి వెళ్లాము. మార్గమంతా పచ్చని పొలాలు కనిపించాయి. పిల్లలు కిటికీ నుంచి బయట చూశారు.
ప్రయాణం చాలా ఆనందంగా సాగింది. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాము.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Bus-Journey.mp3

ప్రశ్నలు:

  • ఆ కుటుంబం గ్రామానికి దేనిలో ప్రయాణించారు?
  • ప్రయాణంలో మార్గమంతా వారికి ఏమి కనిపించాయి?

పదజాలం: 

బస్సులో, గ్రామానికి, వెళ్లాము, మార్గమంతా, పచ్చని, పొలాలు, కిటికీ, ప్రయాణం, ఆనందంగా, చేరుకున్నాము

25. పండుగ

మా ఊరికి పండుగ ఉత్సాహం వచ్చింది. ఇళ్లన్నీ శుభ్రంగా ముస్తాబయ్యాయి. అందరూ నూతన వస్త్రాలు ధరించి మెరిసిపోయారు.
గుడిలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకను చూసి పిల్లలు ఎంతో ఆనందపడ్డారు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Festival.mp3

ప్రశ్నలు:

  • పండుగ రోజున అందరూ ఎలా తయారయ్యారు?
  • ఈ వేడుకను చూసి పిల్లలు ఎలా స్పందించారు?

పదజాలం: 

ఊరికి, పండుగ, ఉత్సాహం, శుభ్రంగా, ముస్తాబయ్యాయి, నూతన, వస్త్రాలు, పూజా, కార్యక్రమాలు, ఆనందపడ్డారు

Part 6

  • 26. పావురం
  • 27. మా ఊరు
  • 28. పాలు
  • 29. వాన
  • 30. పుస్తకాల ప్రదర్శన

26. పావురం

పావురం చూడముచ్చటైన పక్షి. దీని శరీరం బూడిద రంగులో ఉంటుంది. ఇది ఆహారంగా గింజలను తీసుకుంటుంది.
పావురాలు చాలా వేగంగా ప్రయాణించగలవు. వీటిని ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Pigeon.mp3

ప్రశ్నలు:

  • పావురం శరీరం ఏ రంగులో ఉంటుంది, అది ఆహారంగా ఏమి తీసుకుంటుంది?
  • పావురాల ప్రత్యేకత ఏమిటి?

పదజాలం:

పావురం, చూడముచ్చటైన, పక్షి, శరీరం, బూడిద, రంగులో, ఆహారంగా, గింజలను, వేగంగా, ప్రయాణించగలవు

27. మా ఊరు

మా ఊరు ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. ఇక్కడ ఒక విశాలమైన చెరువు కలదు.
పొలాల్లో రైతులు నిరంతరం శ్రమిస్తుంటారు.
సాయంకాలం వేళ పిల్లల ఆటపాటలతో గ్రామం అంతటా సందడిగా మారుతుంది. నాకైతే మా ఊరు అంటే చాలా ఇష్టం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Our-Village.mp3

ప్రశ్నలు:

  • గ్రామంలో సాయంకాలం వేళ వాతావరణం ఎలా ఉంటుంది?
  • పొలాల్లో రైతులు ఏమి చేస్తుంటారు?

పదజాలం: 

గ్రామం, ప్రశాంతమైన, వాతావరణం, విశాలమైన, చెరువు, రైతులు, నిరంతరం, శ్రమిస్తుంటారు, సందడిగా, ఇష్టం

28. పాలు

పాలు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ పాలు తీసుకోవడం పిల్లలకు చాలా అవసరం.
ఇందులో ఉండే పోషక విలువలు శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి, పిల్లలందరూ రోజూ పాలు తాగే మంచి అలవాటును పెంచుకోవాలి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Milk.mp3

ప్రశ్నలు:

  • పాలు తాగడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనం ఏమిటి?
  • పాలలో ఉండే పోషక విలువలు ఏమి చేస్తాయి?

పదజాలం: 

పాలు, తాగడం, ఆరోగ్యం, మెరుగుపడుతుంది, ప్రతిరోజూ, అవసరం, పోషక, విలువలు, బలాన్ని, అలవాటు

29. వాన

వాన కురిసిన తరువాత భూమి చల్లగా మారింది. చెట్లు మునుపటి కంటే మిక్కిలి పచ్చదనంతో కళకళలాడాయి.
పక్షులు ఆనందంగా ఎగిరాయి. పిల్లలు బయటకు వచ్చి కేరింతలతో ఆడుకున్నారు. ప్రకృతి దృశ్యం అత్యంత రమణీయంగా కనిపించింది.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Rain.mp3

ప్రశ్నలు:

  • వాన కురిసిన తరువాత నేల ఎలా మారింది?
  • వర్షం వచ్చిన తర్వాత పిల్లలు ఎలా ఆడుకున్నారు?

పదజాలం: 

వాన, కురిసిన, భూమి, చల్లగా, పచ్చదనంతో, కళకళలాడాయి, పక్షులు, ఆనందంగా, కేరింతలతో, రమణీయంగా

30. పుస్తకాల ప్రదర్శన

మా పాఠశాలలో ఒక గొప్ప పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. అక్కడ ఎన్నో విలువైన పుస్తకాలు వరుసగా అమర్చారు.
విద్యార్థులందరూ వాటిని ఎంతో ఆసక్తిగా గమనించారు.
కొందరు తమకు నచ్చిన పుస్తకాలను సంతోషంగా కొనుక్కున్నారు. దీనివల్ల అందరికీ ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Book-Exibition.mp3

ప్రశ్నలు:

  • పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఏమి ఉన్నాయి?
  • ఈ పుస్తకాల ప్రదర్శన వల్ల విద్యార్థులకు ఏమి తెలిశాయి?

పదజాలం: 

పాఠశాలలో, పుస్తకాల, ప్రదర్శన, విలువైన, వరుసగా, విద్యార్థులు, ఆసక్తిగా, సంతోషంగా, కొనుక్కున్నారు, విషయాలు

Part 7

  • 31. మామిడి చెట్టు
  • 32. ఉదయం నడక
  • 33. పిల్లి
  • 34. గడియారం
  • 35. నది

31. మామిడి చెట్టు

మా ఇంటి దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. వేసవిలో ఆ చెట్టుకు చాలా మామిడిపండ్లు వస్తాయి. పక్షులు చెట్టుపై కూర్చుంటాయి.
ఆ చెట్టు మంచి నీడను ఇస్తుంది. అందరూ ఆ చెట్టును ఇష్టపడతారు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Mango-tree.mp3

ప్రశ్నలు:

  • మామిడి చెట్టు ఏ కాలంలో ఎక్కువగా పండ్లను ఇస్తుంది?

  • మామిడి చెట్టు వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి?

పదజాలం:

ఇంటి, మామిడి, చెట్టు, వేసవిలో, మామిడిపండ్లు, కాస్తాయి, పక్షులు, కూర్చుంటాయి, నీడను, ఇష్టపడతారు

32. ఉదయం నడక

ఉదయం వేళ నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ సమయంలో గాలి మిక్కిలి స్వచ్ఛముగా ఉంటుంది.
నడవడం వల్ల మన శరీరం దృఢముగా మరియు చురుకుగా మారుతుంది.
ప్రతిరోజూ పార్కులో నడవడం ఒక మంచి అలవాటు. దీనివల్ల మనసు మరియు శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటాయి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/Morning-walk.mp3

ప్రశ్నలు:

  • ఉదయం వేళ నడక వల్ల శరీరానికి కలిగే ఉపయోగాలు ఏమిటి?

  • మనం ప్రతిరోజూ ఎక్కడ నడవడం మంచి అలవాటు?

పదజాలం: 

ఉదయం, నడక, ఆరోగ్యానికి, స్వచ్ఛముగా, శరీరం, దృఢముగా, చురుకుగా, పార్కులో, అలవాటు, ఉత్సాహంగా

33. పిల్లి

పిల్లి ఒక చిన్న పెంపుడు జంతువు. దానికి పాలు తాగడం ఎంతో ఇష్టం. పిల్లి ఎలుకలను చాలా వేగంగా పట్టుకుంటుంది.
ఇది ఎప్పుడూ ఎంతో చురుకుగా కనిపిస్తుంది. పిల్లులతో గడపడానికి పిల్లలు చాలా ఇష్టపడతారు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/cat.mp3

ప్రశ్నలు:

  • పిల్లికి ఆహారంగా దేనిని తాగడం ఇష్టం?

  • పిల్లి దేనిని పట్టుకోవడంలో చాలా వేగంగా ఉంటుంది?

పదజాలం: 

పిల్లి, చిన్న, పెంపుడు, జంతువు, పాలు, ఇష్టం, ఎలుకలను, వేగంగా, పట్టుకుంటుంది, చురుకుగా

34. గడియారం

గడియారం మనకు సమయాన్ని తెలియజేస్తుంది. ప్రతి ఇంట్లోనూ గడియారం ఉంటుంది.
మనం ఎల్లప్పుడూ సమయానికి పనులు చేయాలి.
అమూల్యమైన సమయాన్ని ఎప్పుడూ వృథా చేయకూడదు.
గడియారం మన జీవితంలో క్రమశిక్షణను నేర్పుతుంది.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/clock.mp3

ప్రశ్నలు:

  • గడియారం మనకు ఏమి తెలియజేస్తుంది

  • గడియారం మన జీవితంలో ఏమి నేర్పుతుంది?

పదజాలం: 

గడియారం, సమయాన్ని, తెలియజేస్తుంది, ఇంట్లో, ఎల్లప్పుడూ, పనులు, అమూల్యమైన, వృథా, జీవితంలో, క్రమశిక్షణను

35. నది

నది ఎల్లప్పుడూ నిరంతరాయంగా ముందుకు సాగుతుంది. నదీ జలాలు మిక్కిలి స్వచ్ఛముగా కనిపిస్తాయి.
వ్యవసాయ పనుల కోసం రైతులు ఆ నీటిని వినియోగిస్తారు. అధిక శాతం గ్రామాలు నదీ తీరాలలోనే వెలిశాయి.
అటువంటి నదులను మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/river.mp3

ప్రశ్నలు:

  • నదీ జలాలు ఎలా ఉంటాయి మరియు రైతులు వాటిని దేనికోసం ఉపయోగిస్తారు?

  • మనం నదులను ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలి?

పదజాలం: 

నది, నిరంతరాయంగా, సాగుతుంది, జలాలు, స్వచ్ఛముగా, వ్యవసాయం, రైతులు, వినియోగిస్తారు, గ్రామాలు, కాపాడుకోవాలి

Part 8

  • 36. ఆటస్థలం
  • 37. కోడి
  • 38. ఇంద్రధనస్సు
  • 39. బొమ్మలు
  • 40. చెరువు

36. ఆటస్థలం

మా బడిలో ఒక విశాలమైన ఆటస్థలం ఉన్నది. విద్యార్థులందరూ అక్కడ ఉత్సాహంగా ఆటపాటల్లో మునిగిపోతారు.
కొంతమంది పిల్లలు మైదానమంతా పరుగులు తీస్తూ ఆనందిస్తారు.
ప్రతిరోజూ ఉదయపు వేళలో మేమంతా ఇక్కడ వ్యాయామం చేస్తాము. అట్టి మైదానమంటే మాకందరికీ ఎంతో ఇష్టం.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/ఆటస్థలం.mp3

ప్రశ్నలు:

  • విద్యార్థులందరూ ఎక్కడ ఉత్సాహంగా ఆటపాటల్లో మునిగిపోతారు?

  • ఉదయపు వేళలో విద్యార్థులు మైదానంలో ఏమి చేస్తారు?

పదజాలం:

బడిలో, విశాలమైన, ఆటస్థలం, విద్యార్థులు, ఉత్సాహంగా, ఆటపాటల్లో, మైదానమంతా, పరుగులు, ఉదయపు, వ్యాయామం

37. కోడి

కోడి మన ఇళ్లలో పెంచుకునే పక్షి. ఇది ఆహారంగా గింజలను తీసుకుంటుంది. కోడి మనకు గుడ్లను ఇస్తుంది.
తెల్లవారుజామున కోడి కూత వేయగానే అందరూ నిద్రలేస్తారు. పల్లెటూళ్లలో కోళ్లు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తాయి.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/కోడి.mp3

ప్రశ్నలు:

  • కోడి మనకు ఏమి ఇస్తుంది మరియు అది ఆహారంగా ఏమి తీసుకుంటుంది?

  • ఉదయాన్నే నిద్రలేవడానికి ఏది సహాయపడుతుంది?

పదజాలం: 

కోడి, పెంచుకునే, పక్షి, ఆహారంగా, గింజలను, గుడ్లను, తెల్లవారుజామున, కూత, నిద్రలేస్తారు, పల్లెటూళ్లలో

38. ఇంద్రధనస్సు

వాన కురిసిన తర్వాత ఆకాశంలో ఇంద్రధనస్సు వికసిస్తుంది. ఇందులో సప్త వర్ణాలు ఎంతో రమణీయంగా ఉంటాయి.
పిల్లలు దీనిని చూసి మిక్కిలి ఆనందపడతారు. ఈ దృశ్యం ప్రకృతిలో ఒక అపురూపమైన వింతగా కనిపిస్తుంది.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/ఇంద్రధనస్సు.mp3

ప్రశ్నలు:

  • వాన కురిసిన తర్వాత ఆకాశంలో ఏమి వికసిస్తుంది?

  • ఇంద్రధనస్సులో ఎన్ని వర్ణాలు ఉంటాయి?

పదజాలం: 

వాన, కురిసిన, ఆకాశంలో, ఇంద్రధనస్సు, వికసిస్తుంది, సప్త, వర్ణాలు, రమణీయంగా, ఆనందపడతారు, అపురూపమైన

39. బొమ్మలు

చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకోవడానికి మిక్కిలి ఇష్టపడతారు.
రకరకాల బొమ్మలతో ఆడుకోవడం వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
కొన్ని బొమ్మలు శబ్దాలు చేస్తాయి, మరికొన్ని చక్కగా కదులుతాయి.
ఈ బొమ్మల వల్ల పిల్లలకు ఎంతో ఆనందం కలుగుతుంది. బొమ్మలు పిల్లల బాల్యానికి మంచి స్నేహితులు.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/బొమ్మలు.mp3

ప్రశ్నలు:

  • చిన్న పిల్లలు దేనితో ఆడుకోవడానికి ఇష్టపడతారు?

  • పిల్లల బాల్యానికి మంచి స్నేహితులు ఎవరు?

పదజాలం: 

చిన్న, పిల్లలు, బొమ్మలతో, ఆడుకోవడం, సంతోషాన్ని, శబ్దాలు, కదులుతాయి, ఆనందం, బాల్యానికి, స్నేహితులు

40. చెరువు

మా గ్రామంలో ఒక విశాలమైన చెరువు కలదు. ఆ చెరువు నిండుగా జలకళతో కనిపిస్తుంది. వివిధ రకాల పక్షులు అక్కడికి చేరుకుంటాయి.
వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు ఆ నీటిని వాడుకుంటారు. అట్టి చెరువు ఊరి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది.

https://thecuriosi.com/wp-content/uploads/2026/06/చెరువు-.mp3

ప్రశ్నలు:

  • ఆ ఊరి చెరువు నిండుగా దేనితో కనిపిస్తుంది?

  • చెరువులోని నీటిని రైతులు దేని కోసం వాడుకుంటారు?

పదజాలం: 

గ్రామంలో, విశాలమైన, చెరువు, జలకళతో, పక్షులు, చేరుకుంటాయి, వ్యవసాయం, రైతులు, వాడుకుంటారు, ప్రజలకు

📖 ఈ తెలుగు 100 తెలుగు చిన్నారి కథలు పేజ్ దేనికోసం?

ఈ 100 తెలుగు చిన్నారి కథలు పేజ్ ‌లో 100 చిన్న మరియు ఆసక్తికరమైన చిన్నచిన్న కథలు ఉన్నాయి. విద్యార్థుల పఠన నైపుణ్యాలు, ఉచ్చారణ, పదజాలం మరియు అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో ప్రకృతి, జంతువులు, పండుగలు, కుటుంబం, పాఠశాల మరియు దైనందిన జీవితానికి సంబంధించిన సులభమైన పాఠాలు ఉన్నాయి. ఈ వెబ్ పేజ్ ప్రాథమిక విద్యార్థులు తెలుగు చదవడంలో నైపుణ్యం సాధించడానికి సహాయపడుతుంది.

🌟 ప్రతిరోజూ తెలుగు కథలు పఠనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ప్రతిరోజూ తెలుగు పఠనం చేయడం ద్వారా విద్యార్థుల చదివే వేగం, స్పష్టమైన ఉచ్చారణ మరియు భాషా అవగాహన మెరుగుపడుతుంది. కొత్త పదాలను నేర్చుకోవడం ద్వారా పదజాలం పెరుగుతుంది. నిరంతర పఠనాభ్యాసం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, విద్యార్థులు స్వతంత్రంగా చదవగలుగుతారు. పఠనం ద్వారా జ్ఞానం పెరగడంతో పాటు సృజనాత్మక ఆలోచన కూడా అభివృద్ధి చెందుతుంది.

👨‍🎓 ఈ తెలుగు చిన్నారి కథలను ఎవరు ఉపయోగించవచ్చు?

ఈ పేజ్ 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ట్యూషన్ సెంటర్లు, హోమ్‌స్కూలింగ్ కుటుంబాలు మరియు పఠనాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు దీనిని ఉపయోగించవచ్చు. తెలుగు చదవడంలో వెనుకబడిన విద్యార్థులకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

📝 ప్రాథమిక విద్యార్థుల కోసం తెలుగు కథలు పఠన కార్యకలాపాలు

ఈ వెబ్ పేజ్ లోని పాఠాలను ఉపయోగించి వివిధ రకాల పఠన కార్యకలాపాలు నిర్వహించవచ్చు. గళాంతర పఠనం, జంట పఠనం, సమూహ పఠనం, పదాల గుర్తింపు, కొత్త పదాల అర్థాలు తెలుసుకోవడం మరియు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆసక్తిని పెంచుతాయి. ప్రతి పాఠం తర్వాత చిన్న చర్చలు నిర్వహించడం ద్వారా అవగాహన మరింత మెరుగుపడుతుంది.

🚀 పఠన వేగం మరియు అవగాహనను మెరుగుపరచండి

ఈ పుస్తకంలోని చిన్న పేరాలు విద్యార్థులకు సులభంగా చదవడానికి అనువుగా ఉంటాయి. ఒకే పాఠాన్ని పలుమార్లు చదవడం ద్వారా పఠన వేగం పెరుగుతుంది. కథ లేదా పేరా యొక్క భావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా అవగాహన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తే విద్యార్థులు మరింత నైపుణ్యంతో చదవగలుగుతారు.

📚 1 నుండి 5 తరగతుల విద్యార్థుల కోసం TaRL పఠన అభ్యాసం

ఈ పేజ్ Teaching at the Right Level (TaRL) విధానానికి అనుగుణంగా రూపొందించబడింది. విద్యార్థుల ప్రస్తుత పఠన స్థాయిని గుర్తించి, వారికి తగిన పఠనాభ్యాసం అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. పఠనంలో వెనుకబడిన విద్యార్థులను క్రమంగా మెరుగైన స్థాయికి తీసుకువెళ్లేందుకు ఈ వెబ్ పేజ్ సహాయపడుతుంది.

👩‍🏫 ఉపాధ్యాయుల కోసం – తరగతి గది వినియోగం

ఉపాధ్యాయులు ఈ పేజ్ ను తమ రోజువారీ పఠన కార్యక్రమాలు, పఠన అంచనాలు, సమూహ కార్యకలాపాలు మరియు పునరావృత పఠన సాధన కోసం ఉపయోగించవచ్చు. ప్రతి పాఠం తర్వాత ప్రశ్నలు అడిగి విద్యార్థుల అవగాహనను పరీక్షించవచ్చు. అదనంగా, పఠన పురోగతిని నమోదు చేసి విద్యార్థుల అభివృద్ధిని పరిశీలించవచ్చు.

🏠 ఇంటి వద్ద అభ్యాసం మరియు హోమ్‌స్కూలింగ్‌కు సహాయం

తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ప్రతిరోజూ ఒక పాఠం చదివించవచ్చు. ఇంటి వద్ద 10 నుండి 15 నిమిషాల పఠనాభ్యాసం ద్వారా పిల్లల పఠన నైపుణ్యాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. హోమ్‌స్కూలింగ్ చేస్తున్న కుటుంబాలకు ఇది ఒక సమగ్ర తెలుగు పఠన వనరుగా ఉపయోగపడుతుంది. పిల్లలు స్వయంగా చదవడం, అర్థం చేసుకోవడం మరియు కొత్త పదాలు నేర్చుకోవడం కోసం ఈ పేజ్ ఎంతో సహాయకారిగా ఉంటుంది.

👩‍🏫 ఈ వర్క్‌బుక్‌ను ఉపయోగించడం కోసం ఉపాధ్యాయుల సూచనలు

1. బిగ్గరగా చదవడంతో ప్రారంభించండి

విద్యార్థులను పేరాను బిగ్గరగా చదవమని అడగండి. వారి ఉచ్చారణ, అనర్గళత మరియు ఆత్మవిశ్వాసాన్ని జాగ్రత్తగా గమనించండి.

2. వేలితో అనుసరించడాన్ని ప్రోత్సహించండి

చదవడం ప్రారంభించేవారిని, చదివేటప్పుడు ప్రతి పదాన్ని వేలుతో చూపించమని ప్రోత్సహించండి. ఇది పదాలను గుర్తించడాన్ని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

3. ముందుగా కలిసి చదవండి

పేరాను ఒకసారి చదవడం ద్వారా అనర్గళంగా చదవడాన్ని ప్రదర్శించండి. ఆ తర్వాత విద్యార్థులను దానిని మళ్లీ స్వతంత్రంగా చదవమని అడగండి.

4. పునరావృత పఠనాన్ని ఉపయోగించండి

విద్యార్థులను ఒకే పేరాను 2–3 సార్లు చదవనివ్వండి. పునరావృత పఠనం వేగం, కచ్చితత్వం మరియు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది.

5. కొత్త పదాలను చర్చించండి

చదవడానికి ముందు, పరిచయం లేని పదాలను గుర్తించి వాటి అర్థాలను వివరించండి. ఈ పదాలను వాక్యాలలో ఉపయోగించమని విద్యార్థులను ప్రోత్సహించండి.

6. సులభమైన ప్రశ్నలు అడగండి

చదివిన తర్వాత, అవగాహనను సరిచూసుకోవడానికి 2–3 ప్రశ్నలు అడగండి.

ఉదాహరణలు:

  • ఈ కథలో ఎవరి గురించి చెప్పబడింది?
  • జంతువు ఏమి తింటుంది?
  • పిల్లలు ఏమి చేశారు?

7. అర్థంపై దృష్టి పెట్టండి

కేవలం పదాలను సరిగ్గా చదవడమే కాకుండా, పేరాను అర్థం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించండి.

8. జంటగా చదివే కార్యకలాపాలు

చక్కగా చదవగలిగే విద్యార్థులను, చదవడం నేర్చుకుంటున్న విద్యార్థులతో జత చేయండి. విద్యార్థులు వంతులవారీగా చదువుతూ, ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు.

9. పురోగతిని గమనించండి

ప్రతి విద్యార్థికి సంబంధించిన పఠన రికార్డును నిర్వహించండి. ఈ క్రింది వాటిలో మెరుగుదలలను గమనించండి:

ఖచ్చితత్వం
ధారాళత
ఉచ్చారణ
అవగాహన
10. విజయాన్ని జరుపుకోండి

విద్యార్థుల ప్రయత్నాలను మరియు మెరుగుదలలను ప్రశంసించండి. సానుకూల స్పందన పిల్లలను మరింత చదవడానికి ప్రేరేపిస్తుంది.

Share this
PrevPreviousRefund and Returns Policy
NextHistory & Leaders Quiz for KidsNext
Branches of Psychology

Branches of Psychology

06/09/2026 No Comments
Read More »

Developmental milestones & Hazards

06/09/2026 No Comments
Read More »
New DA Salary Calculator

AP New DA Salary Calculator 2026

06/09/2026 No Comments
Read More »
Factors influencing development

Factors influencing development: Notes, Examples & MCQs

06/09/2026 No Comments
Read More »
Principles of developement

Principles of Development Notes, Examples & MCQs

06/09/2026 No Comments
Read More »
Branches of Psychology

Branches of Psychology

06/09/2026 No Comments
Read More »

Developmental milestones & Hazards

06/09/2026 No Comments
Read More »
New DA Salary Calculator

AP New DA Salary Calculator 2026

06/09/2026 No Comments
Read More »
Factors influencing development

Factors influencing development: Notes, Examples & MCQs

06/09/2026 No Comments
Read More »
Principles of developement

Principles of Development Notes, Examples & MCQs

06/09/2026 No Comments
Read More »
Republic Day quiz

Join the No: 1 Fun: Republic Day Quiz and Win a Free Gift!

17/01/2026 No Comments
Read More »
Illustration showing Republic Day speech ideas for LKG to Class 5 with students speaking, Dr. B. R. Ambedkar, and the Constitution of India

Powerful Republic Day Speech Ideas

13/01/2026 No Comments
Read More »

Where Are We

06/03/2025 No Comments
Read More »

Earth to Space

05/03/2025 No Comments
Read More »

The Journey of India for Freedom | Class 5 | Evs Textbook | Solutions

04/03/2025 No Comments
Read More »

Follow Us

Facebook Youtube Whatsapp

Contact Information

  • Phone: +91 9493580270
  • mail: mahi.mkpati@gmail.com
  • Address: Nellore, AP, India 524002
arrow

© The Curiosi.com. All Rights Reserved.

All content, including text, images, worksheets, games, and digital tools, is the property of The Curiosi.com and is protected by applicable copyright laws. Unauthorized use or reproduction is strictly prohibited.