The Curiosi.com

₹0.00 0 Cart
  • Maths TLMs (50+)
  • English Lab
  • APTET
  • Tools
    • Free Classroom Toolkit (14)
    • AP New DA Salary Calculator 2026
    • Age Calculator
    • CCE Marks Cal
    • Intl.Marks Cal
    • Ifsc Code Finder
    • Post Office Finder Pro
    • Timer
  • Quizzes
  • Puzzles
  • Resources
    • 100 తెలుగు చిన్నారి కథలు
    • AP Caste Directory
    • AP Govt Schemes
    • Exam Results
    • Edu Tools
    • Word Calendar
    • Games
    • Stories for Kids
    • తెలుగు భాష ప్రపంచం
    • Maabadi | E-Magazines
  • Shop
  • My account
    • Account details
    • Addresses
    • Downloads
    • Orders
    • About Us
    • Refund and Returns Policy
    • Contact Us
    • Terms and Conditions
  • Class 1
    • Telugu
      • 1. పడవ
      • 2. చందమామ
      • 3. మేలుకొలుపు
      • 4. ఉడత
  • Textbooks
  • Maths TLMs (50+)
  • English Lab
  • APTET
  • Tools
    • Free Classroom Toolkit (14)
    • AP New DA Salary Calculator 2026
    • Age Calculator
    • CCE Marks Cal
    • Intl.Marks Cal
    • Ifsc Code Finder
    • Post Office Finder Pro
    • Timer
  • Quizzes
  • Puzzles
  • Resources
    • 100 తెలుగు చిన్నారి కథలు
    • AP Caste Directory
    • AP Govt Schemes
    • Exam Results
    • Edu Tools
    • Word Calendar
    • Games
    • Stories for Kids
    • తెలుగు భాష ప్రపంచం
    • Maabadi | E-Magazines
  • Shop
  • My account
    • Account details
    • Addresses
    • Downloads
    • Orders
    • About Us
    • Refund and Returns Policy
    • Contact Us
    • Terms and Conditions
  • Class 1
    • Telugu
      • 1. పడవ
      • 2. చందమామ
      • 3. మేలుకొలుపు
      • 4. ఉడత
  • Textbooks

Explore Learning Categories

🔢 Math 🔤 English LAB 🧠 Quiz 🎯 Telugu 📘 Alphabet Words(A-Z) 🗓️ Word Calendar 📖 Stories 📅 CCE Marks 🎮 Games 📄 Worksheets 🏆 Results 🧩 Sudoku 📋 AP Caste Directory ⏳ Age Calculator 📚 Tables Book 🌍 Interactive World Map

Home » AP TET 2026 » Child Development And Pedagogy » Theories of Learning & Classroom Applications

  • MAHENDRA MANCHIKALAPATI
  • September 16, 2026

Theories of Learning & Classroom Applications

Theories of learning

అభ్యసన సిద్ధాంతాలు మరియు తరగతి గది అన్వయాలు
(Theories of Learning & Classroom Applications)

Table of Contents

  • అభ్యసన సిద్ధాంతాలు మరియు తరగతి గది అన్వయాలు (Theories of Learning & Classroom Applications)
    • 1. యత్న దోష అభ్యసన సిద్ధాంతం (Trial and Error Learning)
    • 2. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం (Classical Conditioning)
    • 3. కార్యసాధక నిబంధన సిద్ధాంతం (Operant Conditioning)
    • 4. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం (Insightful Learning)
    • 5. పరిశీలనా అభ్యసనం / సామాజిక అభ్యసనం (Social Learning / Observation)
    • 6. బ్రూనర్ బోధనా సిద్ధాంతం (Bruner’s Theory of Instruction)
    • 7. నిర్మాణాత్మకవాదం మరియు విద్యా అన్వయాలు (Constructivism & Pedagogical Applications)
    • పియాజే vs వైగోట్‌స్కీ నిర్మాణాత్మకవాదం (Cognitive vs Social Constructivism)
      • అ) పియాజే సంజ్ఞానాత్మక నిర్మాణాత్మకవాదం (Jean Piaget – Cognitive Constructivism):
      • ఆ) వైగోట్‌స్కీ సామాజిక నిర్మాణాత్మకవాదం (Lev Vygotsky – Social Constructivism):
    • నిర్మాణాత్మకవాదం (Constructivism) మరియు తరగతి గదిలో ఉపాధ్యాయుడి పాత్ర
    • 8. పరస్పర బోధన మరియు భాగస్వామ్య అభ్యసనం (Reciprocal Teaching & Collaborative Learning)
      • అ) పరస్పర బోధన (Reciprocal Teaching):
      • ఆ) భాగస్వామ్య అభ్యసనం (Collaborative / Cooperative Learning):
    • 9. జ్ఞాన నిర్మాణం – 5E నమూనా (Construction of Knowledge – 5E Method)
    • 10. భాష యొక్క పాత్ర మరియు ఉపాధ్యాయుడి తరగతిగది అన్వయాలు (Role of Language & Teacher)
      • అ) భాష యొక్క పాత్ర (Role of Language):
      • ఆ) ఉపాధ్యాయుడి పాత్ర (Role of Teacher in Constructivist Classroom):
  • Practice Time:
  • Related Pages:
    •  Personality

అభ్యసనం (Learning) అనేది అనుభవం మరియు శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు ప్రక్రియ. మానవులలో అభ్యసన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వివరించడానికి వివిధ మానసిక శాస్త్రవేత్తలు కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలను ప్రతిపాదించారు.


1. యత్న దోష అభ్యసన సిద్ధాంతం (Trial and Error Learning)

  • సిద్ధాంతకర్త: ఈ సిద్ధాంతాన్ని ఇ.ఎల్. థార్న్‌డైక్ (E.L. Thorndike) పిల్లిపై చేసిన ప్రయోగాల ఆధారంగా ప్రతిపాదించారు. దీనిని ‘సంసర్గవాదం’ (Connectionism) అని కూడా అంటారు.
  • ప్రధాన సూత్రం: అభ్యసనం అనేది ఉద్దీపన (Stimulus – S) మరియు ప్రతిస్పందన (Response – R) ల మధ్య ఏర్పడే బలమైన బంధం (S-R Connection) పై ఆధారపడి ఉంటుంది.
  • ముఖ్యమైన నియమాలు:
    1. సన్నద్ధతా నియమం (Law of Readiness): ఒక పని చేయడానికి అభ్యాసకుడు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది.
    2. అభ్యాస నియమం (Law of Frequency / Exercise): పునరావృతం, సాధన (Drill, Homework, Review) చేయడం వల్ల ఉద్దీపన-ప్రతిస్పందనల బంధం బలపడుతుంది.
    3. ఫలిత నియమం (Law of Effect): అభ్యసనం వల్ల కలిగే సంతృప్తికరమైన ఫలితం (Joyful Learning, Assignments) అభ్యసనాన్ని బలపరుస్తుంది.

2. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం (Classical Conditioning)

  • సిద్ధాంతకర్త: రష్యన్ శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్ (Ivan Pavlov) కుక్కపై చేసిన ప్రయోగం ద్వారా దీనిని ప్రతిపాదించారు. దీనిని ‘Type S’ నిబంధనం అని అంటారు.
  • నిర్వచనం: డ్రెవర్ (Drever) ప్రకారం — ఒక ఉద్దీపనకు వచ్చే సహజ ప్రతిస్పందనను వేరొక ఉద్దీపనకు రాబట్టే ప్రక్రియనే నిబంధనం అంటారు.
  • ప్రయోగ అంశాలు: నిర్నిబంధిత ఉద్దీపన (UCS – ఆహారం), నిర్నిబంధిత ప్రతిస్పందన (UCR – లాలాజలం), నిబంధిత ఉద్దీపన (CS – గంట శబ్దం), నిబంధిత ప్రతిస్పందన (CR – లాలాజలం).
  • ముఖ్య భావనలు: పునర్బలన నియమం (Law of Reinforcement), విలుప్తీకరణ (Extinction), అప్రయత్న స్వాస్థ్యం (Spontaneous recovery), సామాన్యీకరణ (Generalization), విచక్షణ (Discrimination), మరియు ఉన్నత క్రమ నిబంధనం (Higher order conditioning).

3. కార్యసాధక నిబంధన సిద్ధాంతం (Operant Conditioning)

  • సిద్ధాంతకర్త: బి.ఎఫ్. స్కిన్నర్ (B.F. Skinner) ఎలుకలపై ప్రయోగాలు చేసి దీనిని ప్రతిపాదించారు. దీనిని పరికరాత్మక అభ్యసనం (Instrumental Learning) లేదా ‘Type R’ నిబంధనం అని పిలుస్తారు.
  • ప్రధాన సూత్రం: ఇందులో ప్రతిస్పందన (R) కు మరియు పునర్బలకాలకు (Reinforcers) ప్రాధాన్యం ఉంటుంది.
  • తరగతి గది అన్వయం: క్లిష్టమైన పాఠ్యాంశాలను చిన్న చిన్న భాగాలుగా (Frames) విభజించి, స్వయంగా నేర్చుకునేలా చేసే కార్యక్రమయుత అభ్యసనం (Programmed Learning / Self-learning) దీని ఆధారంగానే రూపొందింది.

4. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం (Insightful Learning)

  • సిద్ధాంతకర్త: గెస్టాల్ట్ (Gestaltism) వాది అయిన కోహ్లర్ (Kohler) టెనెరీఫ్ దీవుల్లో ‘సుల్తాన్’ అనే చింపాంజీపై ప్రయోగాలు చేసి దీనిని వివరించారు. తన పరిశోధనలను “The Mentality of Apes” గ్రంథంలో ప్రచురించారు.
  • ప్రధాన సూత్రం: సమస్యను చిన్న చిన్న విడిభాగాలుగా కాకుండా సమగ్రంగా (Organized whole / Configuration) చూసి, అకస్మాత్తుగా (‘Like a flash’) సమస్య పరిష్కారాన్ని కనుగొనడమే అంతర్దృష్టి అభ్యసనం.

5. పరిశీలనా అభ్యసనం / సామాజిక అభ్యసనం (Social Learning / Observation)

  • సిద్ధాంతకర్త: ఆల్బర్ట్ బండూరా దీనిని ప్రతిపాదించారు. దీనిని అనుకరణ (Imitation) లేదా నమూనా అభ్యసనం (Modeling) అని కూడా అంటారు.
  • సోపానాలు: పరిశీలనా అభ్యసనంలో నాలుగు ప్రధాన దశలు ఉన్నాయి: అవధానం (Attention), ధారణ (Retention), పునరుత్పత్తి (Performance), మరియు పునర్బలనం (Reinforcement).

6. బ్రూనర్ బోధనా సిద్ధాంతం (Bruner’s Theory of Instruction)

  • సిద్ధాంతకర్త: జెరోమ్ బ్రూనర్ (Jerome Bruner) తన “The Process of Education” గ్రంథంలో ఆవిష్కరణ అభ్యసనం (Discovery Learning) మరియు బోధనా సిద్ధాంతాన్ని రూపొందించారు.
  • ముఖ్య అంశాలు: అభ్యసన సన్నద్ధత (Learning readiness), విషయ నిర్మాణం (Content Construction), విషయ క్రమీకరణ (Content Seriation), మరియు పునర్బలనం (Reinforcement) ఇందులో ప్రాధానాంశాలు.

7. నిర్మాణాత్మకవాదం మరియు విద్యా అన్వయాలు
(Constructivism & Pedagogical Applications)


మానవ వికాసంలో అభ్యాసకులు సమాచారాన్ని కేవలం నిష్క్రియాత్మకంగా గ్రహించకుండా, తమ సొంత అనుభవాల ద్వారా జ్ఞానాన్ని స్వయంగా నిర్మించుకుంటారని నిర్మాణాత్మకవాదం (Constructivism) వివరిస్తుంది.


పియాజే vs వైగోట్‌స్కీ నిర్మాణాత్మకవాదం (Cognitive vs Social Constructivism)

అ) పియాజే సంజ్ఞానాత్మక నిర్మాణాత్మకవాదం (Jean Piaget – Cognitive Constructivism):

  • ప్రధాన సూత్రం: పిల్లలు భౌతిక పరిసరాలతో జరిపే స్వయం పరస్పర చర్యల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. పిల్లవానిని ఒక ‘చిన్న పరిశోధకుడు’ (Little Scientist) గా పియాజే అభివర్ణించారు.
  • జ్ఞాన నిర్మాణ ప్రక్రియ:
    1. స్కీమాలు (Schemas): మెదడులో సమాచారాన్ని నిల్వ చేసే జ్ఞాన నిర్మాణాలు.
    2. సామీకరణం (Assimilation): నూతన అనుభవాలను పాత స్కీమాలకు జోడించడం.
    3. వ్యాకూలీకరణం (Accommodation): కొత్త అనుభవాలకు అనుగుణంగా పాత స్కీమాలను మార్చుకోవడం.
    4. సమతుల్యత (Equilibration): ఆలోచనలలో స్థిరత్వాన్ని సాధించడం.

ఆ) వైగోట్‌స్కీ సామాజిక నిర్మాణాత్మకవాదం (Lev Vygotsky – Social Constructivism):

  • ప్రధాన సూత్రం: జ్ఞాన నిర్మాణం అనేది వ్యక్తిగతంగా కాక సామాజిక సంస్కృతి, పరస్పర చర్యలు మరియు సహకారం ద్వారా జరుగుతుంది.
  • ముఖ్య భావనలు:
    1. సమీప వికాస మండలం (Zone of Proximal Development – ZPD): చిన్నారి స్వయంగా చేయగలిగే పనికి, ఇతరుల సహాయంతో చేయగలిగే పనికి మధ్య ఉన్న వ్యత్యాసం.
    2. స్కాఫోల్డింగ్ (Scaffolding): పిల్లవాడు ఒక పనిని నేర్చుకునేటప్పుడు ఉపాధ్యాయుడు లేదా పెద్దలు అందించే తాత్కాలిక సహాయం/ఆసరా.
    3. మరింత జ్ఞానమున్న ఇతరులు (More Knowledgeable Other – MKO): అభ్యాసకుని కంటే ఎక్కువ జ్ఞానం లేదా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుడు, తోటి విద్యార్థి లేదా పెద్దలు.

నిర్మాణాత్మకవాదం (Constructivism) మరియు తరగతి గదిలో ఉపాధ్యాయుడి పాత్ర

  • నిర్మాణాత్మకవాదం (Constructivism) అభ్యసన సిద్ధాంతాలలో ఒకటిగా పేర్కొనబడింది.
  • ఉపాధ్యాయుడి పాత్ర & తరగతి గది అన్వయాలు:
    • ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఒక రోల్ మోడల్ (Role Model) గా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి.
    • నమ్య ప్రణాళిక (Flexible Planning): చదువంటే కేవలం మార్కులు, బట్టీ పట్టడం, గైడ్ల నుంచి కాపీ కొట్టడం కాకుండా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకోవాలి.
    • బోధన సమయంలో ఉపాధ్యాయుడు కుర్చీకే పరిమితం కాకుండా పిల్లల మధ్యలోకి వెళ్లి బోధించాలి.
    • ఆకర్షణీయమైన, తక్కువ ఖర్చుతో కూడిన బోధనా సామగ్రిని (Low cost or no cost material) ఉపయోగించాలి.
    • విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరిశీలించి బోధన ప్రారంభించాలి మరియు వైయుక్తిక, సమూహ చర్చల ద్వారా స్వీయ అభ్యసనాన్ని, స్నేహ సంబంధాలను ప్రోత్సహించాలి.

8. పరస్పర బోధన మరియు భాగస్వామ్య అభ్యసనం (Reciprocal Teaching & Collaborative Learning)

అ) పరస్పర బోధన (Reciprocal Teaching):

  • పాలిన్సర్ మరియు బ్రౌన్ (Palincsar & Brown) రూపకల్పన చేసిన ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు చిన్న సమూహాలుగా ఏర్పడి, వచనాన్ని అర్థం చేసుకోవడానికి ఒకరితో ఒకరు సంభాషిస్తారు.
  • నాలుగు ప్రాథమిక వ్యూహాలు:
    1. సారాంశం చెప్పడం (Summarizing): చదివిన అంశంలోని ముఖ్య విషయాలను సంగ్రహంగా చెప్పడం.
    2. ప్రశ్నలు అడగడం (Questioning): పాఠ్యాంశంపై ప్రశ్నలు వేయడం.
    3. స్పష్టత నివ్వడం (Clarifying): కష్టమైన పదాలు లేదా భావనలకు స్పష్టత తెచ్చుకోవడం.
    4. ఊహించడం / ముందుగా అంచనా వేయడం (Predicting): తర్వాత ఏమి జరగబోతుందో అంచనా వేయడం.

ఆ) భాగస్వామ్య అభ్యసనం (Collaborative / Cooperative Learning):

  • విద్యార్థులు చిన్న చిన్న జట్లుగా ఏర్పడి ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఒకరికొకరు సహకరించుకుంటూ నేర్చుకుంటారు.
  • ఇది విద్యార్థులలో సామాజిక నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు మరియు విమర్శనాత్మక ఆలోచనను పెంపొందిస్తుంది.

9. జ్ఞాన నిర్మాణం – 5E నమూనా (Construction of Knowledge – 5E Method)

రాజర్ బైబీ (Roger Bybee) మరియు BSCS బృందం రూపొందించిన 5E బోధనా నమూనా నిర్మాణాత్మక తరగతి గదిలో అభ్యసనాన్ని ఐదు దశల్లో నిర్వహిస్తుంది:

  1. Engage (నిమగ్నం చేయడం): విద్యార్థుల అవధానాన్ని ఆకర్షించడం, ఆసక్తిని రేకెత్తించడం మరియు వారి పూర్వజ్ఞానాన్ని వెలికితీసే ప్రశ్నలు అడగడం.
  2. Explore (అన్వేషించడం): ప్రత్యక్ష కృత్యాలు, ప్రయోగాలు మరియు పరిశీలనల ద్వారా విద్యార్థులు స్వయంగా విషయాలను అన్వేషించే అవకాశం ఇవ్వడం.
  3. Explain (వివరించడం): విద్యార్థులు తమ అన్వేషణల ద్వారా గ్రహించిన విషయాలను సొంత మాటల్లో వివరిస్తారు; ఉపాధ్యాయుడు సాంకేతిక పదాలను మరియు స్పష్టతను జోడిస్తాడు.
  4. Elaborate (విస్తరించడం / వివదీకరించడం): ఆర్జించిన జ్ఞానాన్ని నూతన మరియు నిత్యజీవిత పరిస్థితులకు వర్తింపజేసి అవగాహనను లోతుగా మార్చుకోవడం.
  5. Evaluate (మూల్యాంకనం చేయడం): ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు అభ్యసన స్థాయిని, నైపుణ్యాలను అంచనా వేయడం.

10. భాష యొక్క పాత్ర మరియు ఉపాధ్యాయుడి తరగతిగది అన్వయాలు (Role of Language & Teacher)

అ) భాష యొక్క పాత్ర (Role of Language):

వైగోట్‌స్కీ ప్రకారం భాష అనేది కేవలం సమాచార మార్పిడికి మాత్రమే కాక ఆలోచనా వికాసానికి మరియు సంజ్ఞానాత్మక వికాసానికి ప్రధాన సాధనం. ఇందులో మూడు రూపాలు ఉంటాయి:

  1. సామాజిక భాష (Social Speech): 2 సంవత్సరాల వయస్సు నుండి ఇతరులతో మాట్లాడటానికి ఉపయోగించే భాష.
  2. వ్యక్తిగత / రహస్య భాష (Private Speech): 3 సంవత్సరాల వయస్సు నుండి పిల్లలు తమ స్వంత ఆలోచనలు మరియు ప్రవర్తనను నియంత్రించుకోవడానికి బిగ్గరగా తమలో తామే మాట్లాడుకోవడం.
  3. అంతర్గత నిశ్శబ్ద భాష (Silent Inner Speech): 7 సంవత్సరాల నుండి భాష ఆలోచనగా మారి నిశ్శబ్దంగా మెదడులోనే సాగుతుంది.

ఆ) ఉపాధ్యాయుడి పాత్ర (Role of Teacher in Constructivist Classroom):

  • సౌకర్యకర్త (Facilitator): ఉపాధ్యాయుడు కేవలం సమాచారాన్ని అందించే ప్రసంగీకుడు కాదు; జ్ఞాన నిర్మాణానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించే సౌకర్యకర్త.
  • మార్గాదర్శకుడు & స్కాఫోల్డర్: విద్యార్థులు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు అవసరమైన సూచనలు, ప్రదర్శనలు ఇస్తూ స్కాఫోల్డింగ్ (సహాయం) అందిస్తారు.
  • సహ-అభ్యాసకుడు (Co-learner): తరగతి గదిలో విద్యార్థులతో కలిసి అన్వేషణలో భాగస్వామి అవుతారు.

Practice Time:

ప్రశ్నల పట్టిక (Questions)

సమాధానం ఇచ్చినవి
దాటవేసినవి
చూడనివి
The Curiosi.com Magic Vault APTET/CTET – Theories of Learning & Classroom Applications
00:00

Related Pages:

 Personality

  • Meaning, Definition, Characteristics and Elements of Personality (మూర్తిమత్వం (Personality) యొక్క అర్థం, నిర్వచనాలు, ప్రాథమిక లక్షణాలు మరియు మూలకాలపై రూపొందించిన సమగ్ర వ్యాసం)
  • Factors influencing personality, Physical and Socio-cultural factors (వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు, శారీరక మరియు సామాజిక-సాంస్కృతిక కారకాలు)
  • Theories of Personality (మూర్తిమత్వ సిద్ధాంతాలు)
  • Assessment of Personality – Projective and non-projective techniques (మూర్తిమత్వ మాపన పద్ధతులు: ప్రక్షేపక మరియు అప్రక్షేపక పరీక్షలు)
  • Mental Health, Adjustment, Defence mechanisms, Conflicts, Frustration, Stress, Anxiety, Maladjustment, Guidance and counselling (మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, రక్షణ యంత్రాంగాలు, సంఘర్షణలు, నిరాశ, ఒత్తిడి, ఆందోళన, అసమర్థత, మార్గదర్శనం మరియు కౌన్సెలింగ్)
Title
Easymart Wooden Learning Educational ABCD Board for Kids, Activit…
Wooden Learning Educational Game Board – ABCD Wooden Board for Ki…
3 in 1 Wooden Puzzles for Toddlers | Educational Board Game ABCD …
Yetli Wooden Educational Puzzle Set, ABC Letters, Numbers and Sha…
Wooden Puzzle English Alphabet ABCD Children Knob Educational Boa…
M2K HUB® Wooden ABCD Alphabet Number Shape Explorative Puzzles To…
Thumbnail
Easymart Wooden Learning Educational ABCD Board for Kids, Activity Toys for Toddlers & Preschoolers | ABCD Puzzle Set | Puzzle Toys for 2 Years Old Boys & Girls (Alphabets, Numbers & Shapes)
Wooden Learning Educational Game Board – ABCD Wooden Board for Kids, Alphabet, Numbers & Shapes Puzzle Toy for 2+ Years
3 in 1 Wooden Puzzles for Toddlers | Educational Board Game ABCD Alphabets, Numbers & Shapes Puzzles | Toddler Learning Puzzle Toys for Kids 1-3 Years Old | Early Education Gift for Kids
Yetli Wooden Educational Puzzle Set, ABC Letters, Numbers and Shapes Board, Learning Toys for Toddlers 2+ Years
Wooden Puzzle English Alphabet ABCD Children Knob Educational Board with Letters Blocks and Knobs Learning Puzzles for Baby Kids Years 2 and 3 Toy Design 2 Multicolor
M2K HUB® Wooden ABCD Alphabet Number Shape Explorative Puzzles Toddler Learning Puzzles,Educational Activity Boards Toys for Child Boys and Girls (2 Pack ABCD+1234)
Price
₹189
₹238
₹299
₹228
₹144
More information
Buy on Amazon
Buy on Amazon
Buy on Amazon
Buy on Amazon
Buy on Amazon
Buy on Amazon
Title
Easymart Wooden Learning Educational ABCD Board for Kids, Activit…
Thumbnail
Easymart Wooden Learning Educational ABCD Board for Kids, Activity Toys for Toddlers & Preschoolers | ABCD Puzzle Set | Puzzle Toys for 2 Years Old Boys & Girls (Alphabets, Numbers & Shapes)
Price
₹189
More information
Buy on Amazon
Title
Wooden Learning Educational Game Board – ABCD Wooden Board for Ki…
Thumbnail
Wooden Learning Educational Game Board – ABCD Wooden Board for Kids, Alphabet, Numbers & Shapes Puzzle Toy for 2+ Years
More information
Buy on Amazon
Title
3 in 1 Wooden Puzzles for Toddlers | Educational Board Game ABCD …
Thumbnail
3 in 1 Wooden Puzzles for Toddlers | Educational Board Game ABCD Alphabets, Numbers & Shapes Puzzles | Toddler Learning Puzzle Toys for Kids 1-3 Years Old | Early Education Gift for Kids
Price
₹238
More information
Buy on Amazon
Title
Yetli Wooden Educational Puzzle Set, ABC Letters, Numbers and Sha…
Thumbnail
Yetli Wooden Educational Puzzle Set, ABC Letters, Numbers and Shapes Board, Learning Toys for Toddlers 2+ Years
Price
₹299
More information
Buy on Amazon
Title
Wooden Puzzle English Alphabet ABCD Children Knob Educational Boa…
Thumbnail
Wooden Puzzle English Alphabet ABCD Children Knob Educational Board with Letters Blocks and Knobs Learning Puzzles for Baby Kids Years 2 and 3 Toy Design 2 Multicolor
Price
₹228
More information
Buy on Amazon
Title
M2K HUB® Wooden ABCD Alphabet Number Shape Explorative Puzzles To…
Thumbnail
M2K HUB® Wooden ABCD Alphabet Number Shape Explorative Puzzles Toddler Learning Puzzles,Educational Activity Boards Toys for Child Boys and Girls (2 Pack ABCD+1234)
Price
₹144
More information
Buy on Amazon
Share this
PrevPreviousFactors influencing learning
Factors influencing learning

Factors influencing learning

15/09/2026 No Comments
Read More »
Contexts of learning

Contexts of learning: Home, School, and Environment

15/09/2026 No Comments
Read More »
Learning

Learning- Meaning, Nature , Types of learning, Learning Curves

15/09/2026 No Comments
Read More »
Mental Health, Adjustment and Guidance

Mental Health, Adjustment and Guidance

15/09/2026 No Comments
Read More »
Assessment of Personality

Assessment of Personality – Projective and non-projective techniques

15/09/2026 No Comments
Read More »
Theories of Personality

Theories of Personality (మూర్తిమత్వ సిద్ధాంతాలు)

15/09/2026 No Comments
Read More »
Factors influencing personality

Factors influencing personality, Physical and Socio-cultural factors

15/09/2026 No Comments
Read More »
Personality

Meaning, Definition, Characteristics and Elements of Personality

14/09/2026 No Comments
Read More »
ఉడత

4. ఉడత ఉడత హూచ్ పాఠం – తెలుగు | TLM | APSCERT | Udatha Udatha hooch | Class 1 | Udatha

14/09/2026 No Comments
Read More »

AP D.El.Ed, D.Ed & B.Ed Textbooks PDF Download 2026–27

13/09/2026 No Comments
Read More »
Republic Day quiz

Join the No: 1 Fun: Republic Day Quiz and Win a Free Gift!

17/01/2026 No Comments
Read More »
Illustration showing Republic Day speech ideas for LKG to Class 5 with students speaking, Dr. B. R. Ambedkar, and the Constitution of India

Powerful Republic Day Speech Ideas

13/01/2026 No Comments
Read More »

Where Are We

06/03/2025 No Comments
Read More »

Earth to Space

05/03/2025 No Comments
Read More »

The Journey of India for Freedom | Class 5 | Evs Textbook | Solutions

04/03/2025 No Comments
Read More »

Follow Us

Facebook Youtube Whatsapp

Contact Information

  • Phone: +91 9493580270
  • mail: mahi.mkpati@gmail.com
  • Address: Nellore, AP, India 524002
arrow

© The Curiosi.com. All Rights Reserved.

All content, including text, images, worksheets, games, and digital tools, is the property of The Curiosi.com and is protected by applicable copyright laws. Unauthorized use or reproduction is strictly prohibited.